Bigg Boss 8 Episode 13 : ఆ ఒక్క తప్పు కారణంగా యష్మీ గౌడ, నైనిక క్లాన్ లను డిస్సాల్వ్ చేసిన నాగ్... కొత్త చీఫ్ ఎవరంటే?
ప్రస్తుతం హౌజ్ లో యష్మి గౌడ, నైనిక, నిఖిల్ క్లాన్ లు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఓ తప్పు కారణంగా యష్మి గౌడ, నైనిక క్లాన్ లను బిగ్ బాస్ డిస్సాల్వ్ చేశారు. కొత్త చీఫ్ ను నియమించారు.
ఎప్పుడెప్పుడా అని బిగ్ బాస్ షో లవర్స్ ఎదురు చూస్తున్న సెకండ్ వీకెండ్ రానే వచ్చింది. గత వారం కంటెస్టెంట్స్ ను సైలెంట్ గా వదిలేసి నాన్న నాగార్జున ఈసారి మాత్రం స్ట్రాంగ్ వార్నింగ్ లతో షోను హీటెక్కించారు. హౌస్ లో ఒక్కొక్కరూ చేసిన తప్పులను ఎత్తి చూపుతూ కడిగి పారేశారు ఆయన. ఆ తర్వాత ప్రస్తుతం హౌస్ లో ఉన్న క్లాన్ లలో రెండు క్లాన్లను డిస్సాల్వ్ చేసి ఒక కొత్త క్లాన్ ను నిర్మించబోతున్నారు. మరి ఆ కొత్త క్లాన్ ఎవరిది? ఎందుకు యష్మి గౌడ, నైనిక క్లాన్లను డిస్సాల్వ్ చేశారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
యష్మి గౌడ, నైనిక క్లాన్లు డిస్సాల్వ్
ఈసారి హౌస్ లో ముందుగా హౌజ్ మేట్స్ అందరూ చీఫ్ ల గురించి ఏం అనుకుంటున్నారు అనే విషయాలను తెలుసుకుని, ఎవరెవరికి బుద్ధి చెప్పాలో వారికి చెప్పారు బిగ్ బాస్. ముఖ్యంగా విష్ణు ప్రియ విషయంలో సోనియాను, ఎఫ్ వర్డ్స్ వాడుతున్నావు అంటూ పృథ్వీకి ఇచ్చిపడేశారు నాగ్. నోటిని అదుపులో పెట్టుకోండి అంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు నాగ్. ఆ తరువాత యష్మి గౌడ, నైనిక ఇద్దరి క్లాన్స్ డిస్సాల్వ్ చేశారు నాగ్. "నో కెప్టెన్సీ అని లాస్ట్ వీక్ చెప్పాను. అయితే హౌస్ లో చీఫ్స్ ఉండే అవకాశం ఉంటుంది. మీరు అయ్యారు కూడా. అలాగే నో రేషన్ అని చెప్పాము. కానీ వీరిద్దరూ రేషన్ విషయాన్నీ సీరియస్ గా తీసుకోలేదు. బిగ్ బాస్ ఆల్రెడీ మిమ్మల్ని అర్ధరాత్రి నిద్రలేపి హెచ్చరించారు. అలాగే లిమిట్ లెస్ మనీ అని కూడా చెప్పాము. మీ క్లాన్ లో ఇంతమంది సభ్యులు ఉన్నప్పటికీ మీరు టాస్క్ లలో గెలవలేకపోయారు. కేవలం ఇద్దరు మాత్రమే ఉన్న క్లాన్ డబ్బులు ఎక్కువగా గెలిచింది. మీరు చీఫ్ లుగా ఫెయిల్ అయ్యారు. అందుకే నైనిక, యష్మి గౌడ క్లాన్ లను డిస్సాల్వ్ చేస్తున్నాను" అని చెప్పారు నాగ్. అంతే కాకుండా నిఖిల్ ని అభినందిస్తూ ఇప్పటికైతే ఒక హౌస్ లో ఒక్కరే చీఫ్ అంటూ నాగార్జున చిన్న బ్రేక్ తీసుకున్నారు.
కొత్త క్లాన్ ఎవరిదంటే ?
ఇక హౌస్ లో నిఖిల్ ఒక్కడిదే క్లాన్ ఉండగా, ఆ తర్వాత నాగ్ మరో క్లాన్ ని ఏర్పాటు చేసే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా యష్మి గౌడ, నైనిక తప్ప మిగిలిన వాళ్ళను యాక్షన్ రూమ్ లోకి పిలిచారు. ఆ తర్వాత నిఖిల్ తప్ప మిగిలిన వాళ్ళను ఎవరు, ఎందుకు చీఫ్ అవ్వాలని కోరుకుంటున్నారో చెప్పి వాళ్లకి సంబంధించిన పాత్రలో వైట్ పెయింట్ వేయాలని, వద్దు అనుకున్న వారికి బ్లాక్ కలర్ పెయింట్ వేయాలని సూచించారు బిగ్ బాస్. అందులో మణికంఠ, అభయ్ లకి ఎక్కువ మంది సభ్యులు వైట్ పెయింట్ వేశారు. ఆ ఇద్దరిలోనూ అభయ్ కి ఎక్కువ సంఖ్యలో ఓట్లు పడడంతో అతన్ని కొత్త చీఫ్ గా ప్రకటించారు బిగ్ బాస్. అంటే ఈ వారం నుంచి నెక్స్ట్ వీకెండ్ వరకు హౌస్ లో రెండు క్లాన్స్ ఉంటాయి. అయితే ఎవరెవరు ఏఏ టీంలోకి వెళ్లాలి అనే విషయాన్ని ఈరోజటి ఎపిసోడ్లో వెల్లడించునున్నారు.