Bigg Boss Telugu Season 8: చివరి రోజు చిల్ అయిన టాప్ 5 కంటెస్టెంట్లు... ఆటలు ఆడించిన యాంకర్ సుమ
Bigg Boss Telugu Season 8 : బిగ్ బాస్ ఇంట్లో 8వ సీజన్ ముగిసేందుకు ఉన్న ఒక్క రోజుని ఎంజాయ్ చేసుకునేలా బిగ్ బాస్ ఛాన్స్ ఇచ్చాడు. టాస్కులు లేకుండా టైం పాస్ ముచ్చట్లకు టైమ్ ఇచ్చాడు.
Anchor Suma Fun Task With Top 5 Contestants: బిగ్ బాస్ ఇంట్లో 8వ సీజన్ ముగిసే టైం వచ్చింది. ఇక మిగిలిన ఒక్క రోజుని ఎంజాయ్ చేసుకునేలా బిగ్ బాస్ ఛాన్స్ ఇచ్చాడు. టాస్కులు లేకుండా టైం పాస్ ముచ్చట్లు, ఆటలతో కంటెస్టెంట్లకు రిలీఫ్ ఇచ్చాడు. ఇక యాంకర్ సుమ ఇంట్లోకి వచ్చి కంటెస్టెంట్లతో ఆటలు ఆడించింది. నిఖిల్, అవినాష్, ప్రేరణలకు సర్ ప్రైజ్ గిఫ్టులు ఇచ్చింది. ఇక బిగ్ బాస్ ఇంట్లో చివరి రోజు ఎలా గడిచిందో ఓ సారి చూద్దాం..
ఈ క్రమంలో మ్యాంగో మలై కోసం అవినాష్ తెగ ఆరాటపడ్డాడు. కానీ బీబీ మాత్రం పంపించలేదు. ఇక ఫాలో, బ్లాక్ అనే చిన్న టాస్కు పెట్టాడు. ఇంట్లో ఎవరిని ఫాలో అవ్వాలి.. ఎవరిని బ్లాక్ చేయాలని అనుకుంటున్నారో చెప్పండనే టాస్క్ పెట్టారు. ప్రేరణ.. సోనియాని, నబిల్.. హరితేజ-సోనియాని, పృథ్వీ.. బేబక్క సీతలని, అవినాష్ ఇంకా గౌతమ్ కలిసి పృథ్వీని బ్లాక్‌లో పెడతామని చెప్పారు. కానీ ఒక్కసారి ఇంటి నుంచి బయటకు వచ్చాక అందరం ఒక్కటే అని, అందరం కలిసే ఉంటామని టాప్ 5 కంటెస్టెంట్లు అన్నారు.
ఆ తరువాత 5 స్టార్ టాస్క్ పెట్టారు. ఆపై బెస్ట్, వరెస్ట్ ఎక్స్ పీరియెన్స్‌లను పంచుకోమని అన్నాడు. నబిల్ తన బిగ్ బాస్ జర్నీ బెస్ట్ అని, యాక్సిడెంట్ అయిన రోజులు వరెస్ట్ అని అన్నాడు. నిఖిల్ తన సీరియల్ కష్టాల గురించి చెప్పాడు. బిగ్ బాస్ బెస్ట్ ఎక్స్ పీరియెన్స్ అన్నాడు. ప్రేరణ తన గ్రాండ్ పేరెంట్ గురించి ఏడ్చేసింది. అవినాష్ తనకు పుట్టిన బిడ్డ పురిట్లోనే కోల్పోవడం తల్చుకుని ఏడ్చేశాడు. గౌతమ్‌కి తన బిగ్ బాస్ జర్నీలు బెస్ట్ అని, పడ్డ చోట నిలబడి చూపెట్టమని అమ్మ చెప్పిందంటూ అందుకే మళ్లీ ఎనిమిదో సీజన్‌కు వచ్చానని గౌతమ్ తెలిపాడు.
ఆ తరువాత ఇంట్లోకి సుమ వచ్చింది. సుమ ఎప్పటిలానే కంటెస్టెంట్లతో ఆటలు ఆడించింది.ఇందులో భాగంగా కొన్ని ప్రశ్నలు కూడా వేసింది. ఆడియెన్స్ వేసిన ప్రశ్నలు అంటూ అందరినీ ప్రశ్నలు వేసింది. నువ్వు కావాలని గొడవ పెట్టుకుంటావా? అటెన్షన్ కోసం పెట్టుకుంటావా? అని గౌతమ్‌ను అడిగింది. తనకు ఏ పాయింట్ నచ్చదో ఆ పాయింట్ మీద వాదిస్తాను అని గౌతమ్ చెప్పాడు. రాయల్స్ వచ్చాక ఫైర్ తగ్గింది అని నబిల్‌ను అడిగింది. ఓజీలు తక్కువ మంది ఉన్నప్పుడు ఎక్కువ అవకాశాలు వచ్చాయి.. రాయల్స్ వచ్చాక ఎక్కువ షైన్ అయ్యేందుకు ఛాన్సులు దొరకలేదు అని అన్నాడు.
ఆ తరువాత పదాల్ని కనిపెట్టే టాస్కుని పెట్టింది. ఆపై మ్యూజిక్‌తో ఓ ఆట ఆడించింది. అందులో గెలిచిన నిఖిల్‌కు ఓ సర్ ప్రైజ్ వచ్చింది. నిఖిల్‌కు తన బ్రదర్ నుంచి వీడియో మెసెజ్ వచ్చింది. మరో ఆటలో ప్రేరణ గెలవడంతో ఫోటో ఫ్రేమ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చింది. పాటలు గెస్ చేసే పోటీలో అవినాష్ గెలిచాడు. దీంతో అవినాష మదర్ వీడియో మెసెజ్‌ను చూపించారు. చివరకు గౌతమ్‌కి తన తల్లి ఫోటోను పంపించాడు.