Bigg Boss Telugu Season 8: నీ మనసులో లోటు తెలుసు నిఖిల్... ఎంతో మందికి ‘ప్రేరణ’గా నిలవాలి... నబిల్ సెల్ఫ్ మేడ్
Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ ఇంట్లో ప్రయాణం చివరి వరకు చేరింది. ఈ నేపధ్యంలో శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో నిఖిల్, ప్రేరణ, నబిల్ జర్నీలపై బిగ్ బాస్ మాట్లాడాడు.
![Bigg Boss Telugu Season 8: నీ మనసులో లోటు తెలుసు నిఖిల్... ఎంతో మందికి ‘ప్రేరణ’గా నిలవాలి... నబిల్ సెల్ఫ్ మేడ్ Bigg Boss 8 Telugu Episode 103 Day 102 written Review Nikhil Prerana and Nabeel Special Avs Bigg Boss Telugu Season 8: నీ మనసులో లోటు తెలుసు నిఖిల్... ఎంతో మందికి ‘ప్రేరణ’గా నిలవాలి... నబిల్ సెల్ఫ్ మేడ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/14/403641e52823926ac2ba3f1d0dff4bc617341324691651036_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Nikhil Prerana and Nabeel Special AVs: బిగ్ బాస్ ఇంట్లో ప్రయాణం చివరి వరకు చేరింది. శుక్రవారం రాత్రితో ఓటింగ్ లైన్స్ కూడా ముగుస్తాయి. ఇప్పటికే జనాలు విన్నర్ ఎవరు అనేదానిపై చర్చలు పెట్టేసుకుంటున్నారు. విన్నర్, రన్నర్ అన్నది మాత్రం నిఖిల్, గౌతమ్ మధ్యే ఉంటుందని అంతా ఫిక్స్ అయ్యారు. ఇక శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో నిఖిల్, ప్రేరణ, నబిల్ జర్నీలపై బిగ్ బాస్ మాట్లాడాడు. వారి జర్నీ వీడియోలు చూపించి ఏడ్పించేశాడు బిగ్ బాస్.
నిఖిల్ జర్నీ గురించి బిగ్ బాస్ చాలా గొప్పగా చెప్పాడు. నీకు ఈ ఇంట్లో పృథ్వీ రూపంలో మంచి సోదరుడు దొరికాడు.. అందరూ గ్రూప్ గేమ్ అన్నారు.. కానీ మీరు మీ స్నేహం కోసం నిలబడ్డారు.. దాని కోసమే ఆడారు.. మీ మీద నిందలు వేశారు.. సేఫ్ గేమ్ అన్నారు.. స్నేహాన్ని గట్టిగా పట్టుకున్నావు.. నిజమైన జెంటిల్మెన్.. రాయల్స్ వచ్చాక.. ఓజీని ఏకత్రాటిపైకి తీసుకొచ్చావ్.. మీకన్నా ఇంటి కోసం చేశావ్.. ఎప్పుడూ హద్దులు దాటలేదు.. వీటివల్లే ఇక్కడి వరకు వచ్చావ్..
పోటీ దారుడిగా.. ఇంటి సభ్యుడిగా..మీరు అందరినీ మెప్పించారు.. మీ మనసులో ఉన్న లోటు.. నాకు తెలుసు.. మీ మనసుకు దగ్గరైన ప్రతీదీ మీకు దక్కాలని కోరుకుంటూ.. అంటూ బిగ్ బాస్ పొగిడేశాడు. ఆ తరువాత తన జర్నీ చూసి ఎమోషనల్ అయ్యాడు. జనాలు నన్ను ఇష్టపడి ఓట్లు వేసి ఇక్కడకు వరకు తీసుకొచ్చారు.. థాంక్స్.. మీ రుణం తీర్చుకోలేను.. ఎవ్వర్నీ వాడుకుని, ఆడుకుని ఇక్కడ వరకు రాలేదు.. అంటూ నిఖిల్ క్లారిటీగా చెప్పాడు.
ఆ తరువాత ప్రేరణ జర్నీ గురించి బిగ్ బాస్ మాట్లాడుతూ.. నిరంతరం నేర్చుకునే గుణమే నిలబెడుతుంది.. అంతా నేనే అనే అహం పడగొడుతుంది.. మిమ్మల్ని మీరు మల్చుకున్న తీరే ఈ స్థానంలో నిలబెట్టింది.. పసి పాపలాంటి అమాయకత్వంతో అడుగు పెట్టారు.. అదే అందర్నీ దగ్గరకు చేర్చింది.. ఇక్కడే మీరు గుణపాఠాలు, నైపుణ్యాన్ని నేర్చుకున్నారు.. మెగా ఛీప్ అయ్యాకే కష్టాలు.. కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించారు.. అందుకే నిందించారు.. అవే తిప్పలు తీసుకొచ్చింది.. ఇంటి సభ్యుల దృష్టిలో వరెస్ట్ కావొచ్చు.. బిగ్ బాస్ దృష్టిలో బెస్ట్ మెగా చీఫ్.. పెళ్లైనా కూడా ఎంతో సాధించొచ్చు అని ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తారని ఆశిస్తున్నా.. అంటూ బిగ్ బాస్ పొగిడేశాడు.
ఆ తరువాత తన జర్నీని చూసుకుని ప్రేరణ భోరున ఏడ్చేసింది. నీట్‌గా రెడీ అయి వచ్చా.. మీరు ఊరికే ఏడ్పించేస్తున్నారు అంటూ బిగ్ బాస్‌తో ఫన్నీగా ముచ్చట్లు పెట్టింది. నాలో నాకు నచ్చని విషయాల్ని చెప్పారు. అవన్నీ మార్చుకుంటే నా లైఫ్ ఇంకా బాగుంటుంది.. థాంక్యూ బిగ్ బాస్. నాకు ఓట్లు వేసి గెలిపించండని ప్రేరణ కోరింది. ఆ తరువాత నబిల్ జర్నీ గురించి బిగ్ బాస్ మాట్లాడాడు. లైక్ షేర్ సబ్ స్క్రైబర్స్ నుంచి.. లైట్ యాక్షన్ కెమెరా వరకు మీ 9 ఏళ్లలోని తపన.. ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టింది.
Also Read: నిఖిల్ విన్నర్ అవుతాడా? రన్నరా? 'బిగ్ బాస్ 8' హౌస్‌లోని అతని గేమ్‌లో ప్లస్, మైనస్ లేంటి?
వరంగల్ కా షేర్.. ప్రతీ ఇంట్లో సుపరిచితం అయ్యావ్.. మీ టాలెంట్, వ్యక్తిత్వాన్ని కోట్ల మందికి ఈ ఫ్లాట్ ఫాం ద్వారా చేరవేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.. నామినేషన్స్, టాస్కుల్లో మీ ఫైర్, పట్టుదల.. మీ పేరుని అందరూ అండర్ లైన్ చేసేలా చేసింది.. ఎవిక్షన్ షీల్డ్ త్యాగం చేసి.. ఉన్నతంగా ఆలోచించే గుణానికి.. వయసుతో సంబంధం లేదు అని నిరూపించావ్.. నబిల్ సెల్ఫ్ మేడ్.. మీ ఆత్మ గౌరవాన్ని ప్రశ్నించిన వారికి ధీటుగా సమాధానం ఇచ్చారు.. మీ ఫైర్ తగ్గిందని అన్నారు.. దీంతో మీ సామర్థ్యాన్ని ప్రశ్నించుకున్నారు.. ఆమోద యోగ్యంగా మారేందుకు మీరు పడిన తపన కనిపించింది.. మీ చుట్టూ ఉన్న తారలా తళుకు బెళుకుల మధ్య సామాన్యుడిగా ఒంటరైన నిల్చున్నట్టు అనిపించింది.. అది మీ బలహీనత కాదు.. అదే మీ బలం.. అంటూ బిగ్ బాస్ పొగిడేశాడు. అనంతరం తన జర్నీని చూసి నబిల్ ఎమోషనల్ అయ్యాడు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)