అన్వేషించండి

Bigg Boss 8 Telugu Day 30 Promo: తాళం విడిపించు, టైర్‌ను నడిపించు... 12 వైల్డ్ కార్డు ఎంట్రీ పక్కా - లెక్కలు తేల్చేసిన మణికంఠ

బిగ్ బాస్ 8 తెలుగు డే 30కి సంబంధించిన మొదటి ప్రోమో తాజాగా రిలీజ్ కాగా, అందులో తాళం విడిపించు టైర్ ను నడిపించు అనే టాస్క్ ను పెట్టినట్టుగా చూపించారు.

బిగ్ బాస్ సీజన్ 8 (Bigg Boss 8 Telugu) డే 30కి సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ అయింది. ఇందులో వైల్డ్ కార్డు ఎంట్రీలకు సంబంధించి 'బిగ్ బాస్' వేస్తున్న లెక్కలు ఏంటో పసిగట్టేసాడు నాగ మణికంఠ. ఏదైతేనెం ఎట్టకేలకు 12 వైల్డ్ కార్డు ఎంట్రీలు హౌస్ లోకి అడుగు పెడతాయంటూ బాంబు పేల్చాడు. మరి మణికంఠ అనాలసిస్ ఏంటి? ఈ ప్రోమోలో ఉన్న విశేషాలు ఏంటో? ఒక లుక్కేద్దాం పదండి. 

తాళం విడిపించు... టైర్‌ను నడిపించు!
'బిగ్ బాస్' తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో ఒక కొత్త టాస్కుని పెట్టారు. 'తాళం విడిపించు టైర్ ను నడిపించు' అనే ఈ టాస్క్ లో శక్తి టీం నుంచి నిఖిల్, కాంతారా టీం నుంచి విష్ణు ప్రియ పాల్గొన్నారు. ఇక టాస్క్ ఏంటంటే స్విమ్మింగ్ పూల్ లో ఒక లాకర్ ను పెడతారు. బయట తాళాలు పెడతారు. బయట ఉన్న ఆ తాళాలు తీసుకుని స్విమ్మింగ్ పూల్ లోకి దూకి, అందులో ఉన్న లాకర్ ను ఓపెన్ చేసి, టైర్ లను బయటకు తీసుకురావాలి. ఆ తర్వాత టైర్లను ఒక టేబుల్ మీద నుంచి దొర్లించి బాస్కెట్ లో పడేలా చేయాలి. ఈ టాస్క్ ను ఫాస్ట్ గా ఎవరు ఫినిష్ చేస్తే వాళ్లే విన్ అయినట్టు. ఇక నిఖిల్, విష్ణు ప్రియ తమ శక్తి మేర ఈ టాస్క్ లో పోటీ పడ్డారు. అయితే ప్రోమోలో మాత్రం చివరకు ఎవరు గెలిచారు అనే విషయాన్ని సస్పెన్స్ లో పెట్టారు. కానీ కాస్త గమనిస్తే నిఖిల్ గెలిచినట్టుగా అనిపిస్తోంది. టాస్క్ అయిపోయాక ఎక్కడ వాళ్లు అక్కడ కూర్చుని గ్రూపులుగా చేరి ముచ్చట్లు పెట్టడం కనిపించింది. ఆ టైంలోనే మణికంఠ వైల్డ్ కార్డు ఎంట్రీలకు సంబంధించిన లెక్కలను చెప్పి షాక్ ఇచ్చాడు. 

12 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు పక్కా.. 
ప్రోమోలో విష్ణు ప్రియ 'చదువుతాం అని చెప్పేసి మొత్తం బ్లాక్ పెయింట్ వేశారు' అంటూ నబిల్, పృథ్వితో చెప్పుకొచ్చింది. 'అంత ఈజీగా పెడితే అక్కడ చదువుకొని వచ్చి ఇక్కడ పెట్టేస్తాం కదా మనం. టాస్క్ అంత ఈజీగా ఏం ఉండదు' అంటూ బిగ్ బాస్ స్ట్రాటజీని చెప్పాడు నవీన్. 'మరి అక్కడ ఏదైనా కనిపించిందా?' అని విష్ణు ప్రియను అడగ్గా, ఆమె 'కనిపించింది కానీ ఆ పేరు ఇక్కడ లేదు' అని చెప్పింది. మరి వీళ్ళు ఏ పేరు గురించి మాట్లాడుకుంటున్నారో తెలియాలంటే ఈరోజు ఈ ఎపిసోడ్ ను చూడాల్సిందే. ఆ తర్వాత నిఖిల్ వైల్డ్ కార్డ్ కు సంబంధించిన లెక్కలను మణికంఠతో మాట్లాడుతూ కనిపించాడు. 'ఒకటి ఓడిపోయాం కాబట్టి ఒకటి యాడ్ అయ్యింది. ఆ రెండు ఓడిపోతే యాడ్ అవుతారు' అంటూ తన అనాలసిస్ ని చెప్పాడు. వెంటనే మణికంఠ అందుకుని 'మొత్తం 6 ఛాన్సులు.. ఇందులో రెండు విన్ అయ్యాము, నాలుగు లూస్ అయ్యాము. ప్లస్ 2, మైనస్ 2 ఆఫ్సెట్ కాబట్టి ఇక్కడ రెండు, అక్కడ రెండు... ఆ రెండింటికి ఈ రెండు బ్యాలెన్స్ అయిపోతే మొత్తం 12 కు 12 మంది దిగిపోతారు' అంటూ చెప్పి నిఖిల్ కి షాక్ ఇచ్చాడు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ - తక్కువ ధరకే కందిపప్పు, చక్కెర
ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ - తక్కువ ధరకే కందిపప్పు, చక్కెర
DJ Banned: హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
Death Penalty: తల్లిని చంపి శరీర భాగాలు వండేందుకు యత్నం - నిందితుడికి ఉరిశిక్షను సమర్థించిన బాంబే హైకోర్టు
తల్లిని చంపి శరీర భాగాలు వండేందుకు యత్నం - నిందితుడికి ఉరిశిక్షను సమర్థించిన బాంబే హైకోర్టు
Rajinikanth Health: రజనీకాంత్ హెల్త్ అప్డేట్... ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన అపోలో డాక్టర్లు - డిశ్ఛార్జి ఎప్పుడంటే?
రజనీకాంత్ హెల్త్ అప్డేట్... ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన అపోలో డాక్టర్లు - డిశ్ఛార్జి ఎప్పుడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IND vs BAN 2nd Test Day 5 Highlights: రెండో టెస్టులో బంగ్లాను చిత్తు చేసిన టీమిండియాSircilla Weavers: 18 లక్షల చీర చూశారా? సిరిసిల్లలోనే తయారీSrikakulam Fisherman Boats Fire: నడిసంద్రంలో అగ్ని ప్రమాదాలు, వణికిపోతున్న మత్స్యకారులుTiger in Konaseema: చిరుత కోసం డ్రోన్లతో వేట - కోనసీమ DFOతో ఫేస్ టూ ఫేస్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ - తక్కువ ధరకే కందిపప్పు, చక్కెర
ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ - తక్కువ ధరకే కందిపప్పు, చక్కెర
DJ Banned: హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
Death Penalty: తల్లిని చంపి శరీర భాగాలు వండేందుకు యత్నం - నిందితుడికి ఉరిశిక్షను సమర్థించిన బాంబే హైకోర్టు
తల్లిని చంపి శరీర భాగాలు వండేందుకు యత్నం - నిందితుడికి ఉరిశిక్షను సమర్థించిన బాంబే హైకోర్టు
Rajinikanth Health: రజనీకాంత్ హెల్త్ అప్డేట్... ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన అపోలో డాక్టర్లు - డిశ్ఛార్జి ఎప్పుడంటే?
రజనీకాంత్ హెల్త్ అప్డేట్... ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన అపోలో డాక్టర్లు - డిశ్ఛార్జి ఎప్పుడంటే?
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్‌ న్యూస్‌ - 10 రోజులు మద్యం షాపులు బంద్
మందుబాబులకు బ్యాడ్‌ న్యూస్‌ - 10 రోజులు మద్యం షాపులు బంద్
I Phone Murder : ఐ ఫోన్ కోసం డెలివరీ బాయ్‌ను చంపేశాడు - బాబోయ్ ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా ?
ఐ ఫోన్ కోసం డెలివరీ బాయ్‌ను చంపేశాడు - బాబోయ్ ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా ?
Pawan Kalyan: 'శాశ్వత పరిష్కారం కోసం చేపట్టిన దీక్ష' - ఉన్న సమాచారాన్నే సీఎం చంద్రబాబు చెప్పారన్న పవన్ కల్యాణ్, కాలినడకన తిరుమలకు డిప్యూటీ సీఎం
'శాశ్వత పరిష్కారం కోసం చేపట్టిన దీక్ష' - ఉన్న సమాచారాన్నే సీఎం చంద్రబాబు చెప్పారన్న పవన్ కల్యాణ్, కాలినడకన తిరుమలకు డిప్యూటీ సీఎం
Kothagudem News: సింగరేణిలో ఉద్యోగాల పేరిట మోసం - దంపతులు ఆత్మహత్య, కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన
సింగరేణిలో ఉద్యోగాల పేరిట మోసం - దంపతులు ఆత్మహత్య, కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన
Embed widget