(Source: ECI/ABP News/ABP Majha)
Bigg Boss 8 Telugu Day 22 Promo 2 : మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ అంటూ రెచ్చగొట్టిన సోనియా... మాడిపోయిన నబిల్ ముఖం
బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు డే 22కు సంబంధించిన రెండో ప్రోమో రిలీజ్ కాగా, అందులో కూడా నబిల్ - సోనియా ఆకుల మధ్య గొడవ తార స్థాయికి చేరినట్టుగా చూపించారు.
బిగ్ బాస్ సీజన్ 8 22వ రోజుకు సంబంధించిన రెండవ ప్రోమో తాజాగా రిలీజ్ అయింది. ఇప్పటికే రిలీజ్ చేసిన నాలుగవ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రోమో ఈరోజు ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచేసింది. అంతలోనే రెండవ ప్రోమో రిలీజ్ చేసి ఇంకా చూడాల్సింది చాలా ఉంది అన్నట్టుగా అంచనాలు పెంచేశారు బిగ్ బాస్ నిర్వాహకులు. ముఖ్యంగా "మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్" అంటూ సోనియా రెచ్చగొట్టగా, నబిల్ ముఖం వాడిపోయినట్టుగా కన్పించింది. అంతేకాకుండా సోనియా ఈవారం ఎలిమినేట్ కాబోయేది ఎవరో కూడా చెప్పేసింది.
మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్... నబిల్ పై సోనియా రివేంజ్ నామినేషన్
ఈరోజు ఉదయం రిలీజ్ చేసిన ప్రోమోలో నబిల్ - సోనియా మధ్య నామినేషన్ల రచ్చ జరిగినట్టుగా చూపించారు. అయితే తాజా ప్రోమోలో సోనియా.. నబిల్ ను రెచ్చగొట్టినట్టుగా మాట్లాడడమే కాకుండా రివేంజ్ నామినేషన్ వేసినట్టుగా చూపించారు. ముందుగా ప్రేరణ వర్సెస్ నైనిక మధ్య నామినేషన్ల గొడవ జరిగింది. అయితే తనను నామినేట్ చేస్తున్న ప్రేరణకు కూల్ గానే ఇచ్చి పడేసింది నైనిక. ఇక మూడవ వారం జరిగిన గొడవను దృష్టిలో పెట్టుకుని పృథ్వీని నామినేట్ చేశాడు మణికంఠ. నెక్స్ట్ విష్ణు ప్రియ - ప్రేరణ మధ్య కూడా గొడవ తారస్థాయికి చేరింది. సరైన కారణం చెప్పకుండానే తనను నామినేట్ చేస్తున్నావని ప్రేరణ వాదించగా, నువ్వు స్టాండ్ తీసుకోలేకపోయావు అంటూ విష్ణు ప్రియ డామినేట్ చేసింది. ఆ తర్వాత రంగంలోకి దిగిన సోనియా "మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్" అంటూ నబిల్ ను ఉద్దేశించి మొదలుపెట్టింది. "నన్ను ఫెయిల్డ్ సంచాలక్ అని పిలవకండి" అంటూ నబిల్ కామెంట్ చేయగా, "నేను ఇలాగే పిలుస్తాను. నువ్వు సంచాలక్ గా ఫెయిలయ్యావు. అలాగే పర్సన్ గా కూడా ఫెయిల్ అయ్యావు" అంటూ మరింత రెచ్చగొట్టింది సోనియా. అంతేకాకుండా "ఎంత ఇస్తానో అంత తీసుకునే దమ్ము కూడా నాకు ఉంటుంది" అంటూ ధీటుగా సమాధానం చెప్పింది. "నా ఉద్దేశంలో నువ్వు పర్సన్ గా కూడా ఫెయిల్ అయ్యావు" అని చెప్పడంతో నబిల్ రెచ్చిపోయి కామెంట్ చేయడం ప్రోమోలో మరో హైలెట్.
💥 Bonds are being tested in the Bigg Boss Telugu 8 house! The 'Foam Spray' challenge has not only sprayed foam but also shattered relationships!#BiggBossTelugu8 #StarMaa @iamnagarjuna @DisneyPlusHSTel pic.twitter.com/rXwIW2qmNG
— Starmaa (@StarMaa) September 23, 2024
Read Also: లీగల్ యాక్షన్ కు రెడీగా ఉండండి - దర్శకుడు శంకర్ సీరియస్ వార్నింగ్ ఆ రెండు సినిమాలకేనా?
ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతనేనా?
నాలుగో వారం నామినేషన్లు ఇంకా పూర్తి కానేలేదు. అప్పుడే రెండవ ప్రోమో ద్వారా సోనియా ఈ వారం ఎలిమినేట్ కాబోయేది ఎవరు అన్న విషయాన్ని చెప్పేసింది. సోనియా.. ఆదిత్య ఓంను ఉద్దేశించి మాట్లాడుతూ "మీ గురించి చెప్పడానికి ఏమీ లేదు. ఎందుకంటే మీరు హౌస్ లో పెద్దగా పెర్ఫార్మన్స్ ఇవ్వట్లేదు" అని చెప్పింది సోనియా. "ఈ వీక్ లో వెళ్తానని మీరే డిసైడ్ అయ్యారు కదా.. కాబట్టి వెళ్లిపోండి" అంటూ మొహం మీద కొట్టినట్టుగా చెప్పి ఫోమ్ స్ప్రే చేసింది సోనియా. దీంతో ఆదిత్య ఓం పెద్దగా రెస్పాండ్ అయినట్టుగా కన్పించలేదు. కానీ ఈ వీక్ నామినేషన్ లలో అందరూ సోనియా, పృథ్వీనే టార్గెట్ చేసినట్టుగా కన్పిస్తోంది. అసలేం జరిగిందో తెలియాలంటే కంప్లీట్ ఎపిసోడ్ వచ్చేదాకా ఆగాల్సిందే.
Read Also : Pawan Kalyan: వీరమల్లు సెట్స్‌లో అడుగుపెట్టిన పవన్... HHVM రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారోచ్