Shivaji Priyanka Fight : నీ కలర్స్ అన్నీ చూశా కాబట్టే మాట్లాడుతున్నా - ప్రియాంకపై శివాజీ ఫైర్
Bigg Boss 7 Telugu : ‘బిగ్ బాస్’ తెలుగులో నామినేషన్స్ మరోసారి హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ఈ రోజు ఎపిసోడ్ కూడా వాడీవేడిగా సాగనుంది.
Bigg Boss Telugu 7: ‘బిగ్ బాస్’ సీజన్ 7లో మరోసారి నామినేషన్ల పర్వం సుదీర్ఘంగా సాగుతోంది. తాజా ప్రోమోలో ఎప్పటిలాగానే మరోసారి శివాజీ, గౌతమ్ మధ్య మాటల యుద్ధం జరిగింది. మరోవైపు ప్రియాంకతో కూడా ఆయన వాదనకు దిగాడు. నీ కలర్స్ అన్నీ చూసే మాట్లాడుతున్నా అంటూ ఆమెపై మండిపడ్డారు. ఇక అర్జున్ యావర్, శోభాశెట్టిలను నామినేట్ చేశాడు.
శివాజీ - గౌతమ్ మధ్య మళ్లీ రచ్చ
ముందుగా శివాజీ, గౌతమ్ మధ్య యావర్ ఎవిక్షన్ పాస్ గురించి వాదన జరిగింది. ‘‘నాగ్ సార్, అతని ఎవిక్షన్ పాస్ ఇష్టం ఉందా లేదా అని అడిగినప్పుడు. ముగ్గురు మాత్రమే చెయ్యేత్తారు. మిగతావారు ఎందుకు ఎత్తలేదు? అని ప్రశ్నించాడు శివాజీ. ఇందుకు గౌతమ్ సమాధానం ఇస్తూ.. ‘‘ఎందుకంటే.. యావర్ అల్రెడీ డిసైడ్ అయిపోయాడు ఎవిక్షన్ పాస్ ఇచ్చేద్దామని’’ అని అన్నాడు. శివాజీ స్పందిస్తూ.. ‘‘ఏంటదీ.. నువ్వు అన్నీ కరెక్టుగానే మాట్లాడావు కదా తమ్ముడు ఇప్పటి దాకా. నువ్వు ప్రియాంక మీద అంత స్టాండ్ తీసుకున్నప్పుడు నువ్వు ఎలా చూశావ్ మా ఇద్దరినీ? మా ఇద్దరిదీ చూసినప్పుడు ప్రియాంకది ఎలా చూశావ్? అని ప్రశ్నించాడు శివాజీ. దీంతో గౌతమ్ ‘‘నన్ ఆఫ్ ది మై మేటర్’’ అని అన్నాడు. ‘‘మరి ఫౌల్ గురించి కూడా నన్ ఆఫ్ ది యువర్ మేటర్ కదా. నీకేమిటీ సంబంధం? సంచాలకుడిది కదా అది’’ అని శివాజీ సమాధానం ఇచ్చాడు.
యావర్‌కు అమర్ పంచ్
ఆ తర్వాత యావర్.. నువ్వు సంచాలకుడిగా ఫెయిల్ అంటూ అమర్‌దీప్‌ను నామినేట్ చేశాడు. ‘‘నేను సంచాలకుడిగా ఫెయిల్. కానీ, ఎవరి వల్ల నేను ఫెయిల్’’ అని అమర్ దీప్ అడిగాడు. దీంతో యావర్.. ‘‘ఫౌల్ చేసినందుకే కదా ఎవిక్షన్ పాస్ తిరిగి ఇచ్చేశాను’’ అని అన్నాడు. ‘‘దానికి నువ్వు నన్ను నామినేట్ చేయడం కరెక్ట్ కాదు తెలుసా?’’ అని అమర్ దీప్ అన్నాడు. ఆ తర్వాత శోభాశెట్టి, అర్జున్‌ల వంతు వచ్చింది. ‘‘నువ్వు ఏ గేమ్ అయితే ఆడుతున్నావో.. అన్నిట్లో ఎవరో ఒక పర్శన్ ఉండటం వల్ల గెలుస్తున్నావు అన్నావు. అది నాకు నచ్చలేదు’’ అని శోభా అంది. దీనికి అర్జున్.. ‘‘నేను అలా అనలేదు’’ అని సమాధానం ఇచ్చాడు.
నీ కలర్స్ చూశా.. ప్రియాంకపై శివాజీ
ఆ తర్వాత ప్రియాంక.. శివాజీని నామినేట్ చేసింది. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ.. ‘‘నువ్వు ఎంత వాదించినా.. నువ్వే ఆ రోజు గట్టిగా మాట్లాడేవ్. అందరికీ తెలుసు’’ అని అన్నాడు. దీనికి ప్రియాంక స్పందిస్తూ.. ‘‘సేఫ్ గేమ్ ఎవరెవరు ఆడుతున్నారో తెలుసు నాకు’’ అని తెలిపింది. ‘‘నువ్వు జీనియస్, బ్రిలియెంట్, నువ్వు ఎక్స్‌ట్రార్డనరీ.. ఐ యామ్ ఎక్స్‌ప్టెడ్ థాంక్యూ’’ అంటూ శివాజీ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో ప్రియాంక యాక్సెప్ట్ కాదు సార్.. అని అంది. ‘‘నువ్వు ఎవరు నన్ను చెప్పమనడానికి? నేను యాక్సెప్ట్ అన్నాను నీ నామినేషన్‌ను నేను డిఫెండ్ చేసుకోను నీ దగ్గర’’ అని అన్నాడు. ‘‘ఎందుకిలా మాట్లాడుతున్నారు? అని ప్రియాంక శివాజీని ప్రశ్నించాడు. దానికి ఆయన సమాధానం చెబుతూ.. ‘‘నీ రకరకాల కలర్స్ చూస్తున్నా కాబట్టి.. మాట్లాడుతున్నా. ప్రతిసారి పొరపాట్లు మీద పొరపాట్లు జరుగుతున్నాయి ఈ హౌస్‌లో’’ అని అన్నాడు. దీంతో ఏం జరుగుతున్నాయో చెప్పాలని ప్రియాంక అడిగింది. ‘‘ఏం జరుగుతున్నాయంటే నేను చూశాను.. అయిపోయింది.. చెప్పలేను’’ వెళ్లిపోయాడు శివాజీ. ఆ తర్వాత యావర్.. అర్జున్‌ను నామినేట్ చేశాడు. దీంతో అర్జున్.. హౌస్‌లో ఉన్నన్ని రోజులు కలవడం అంటూ జరగదు అని చెప్పి వెళ్లిపోయాడు.