Bigg Boss 7 Telugu Nominations: అప్పుడే ఫిట్టింగ్ పెట్టేసిన ‘బిగ్ బాస్’ - అర్హత లేదంటూ ఆమెను నామినేట్ చేసేసిన శివాజీ, రచ్చ మొదలు!
బిగ్ బాస్ సీజన్స్ ఎన్ని మారినా.. నామినేషన్స్, అందులో జరిగే గొడవలు మాత్రం కామన్‌గానే ఉంటాయి.

బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. ఆ గ్రాండ్ లాంచ్ రోజు కంటెస్టెంట్స్ అంతా ఒకరిని ఒకరు కలిశారు. సరదాగా ఉన్నారు. కానీ ఇంతలోనే నామినేషన్స్ అంటూ వారి మధ్య వాగ్వాదాలు మొదలయ్యేలా చేశారు బిగ్ బాస్. ఏ సీజన్‌లో అయినా లాంచ్ డే తర్వాత వెంటనే నామినేషన్స్ జరగడం కామనే. అయితే ఉల్టా పుల్టా అంటూ ప్రారంభమయిన ఈ బిగ్ బాస్ సీజన్ 7లో కూడా అదే జరుగుతోంది. సరదాగా ఒకరోజంతా కూర్చొని కబుర్లు చెప్పుకున్న కంటెస్టెంట్స్ అంతా.. నామినేషన్ అనగానే సీరియల్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 7 మొదటి నామినేషన్స్ లిస్ట్‌లో ఎనిమిది మంది ఉన్నారు.
నామినేషన్స్ ప్రోమో విడుదల..
బిగ్ బాస్ సీజన్స్ ఎన్ని మారినా.. నామినేషన్స్, అందులో జరిగే గొడవలు మాత్రం కామన్‌గానే ఉంటాయి. ఈసారి కూడా నామినేషన్స్ అలాగే మొదలయ్యాయి. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది. బిగ్ బాస్.. ఒక్కొక్కరిగా కంటెస్టెంట్స్‌ను యాక్టివిటీ రూమ్‌లోకి పిలుస్తారు. ఆ తర్వాత వారు.. ఏ ఇద్దరి కంటెస్టెంట్స్‌ను నామినేట్ చేయాలని అనుకుంటున్నారో.. వారు అవతలి వైపు కూర్చొని ఉంటారు. అసలు వారిని నామినేట్ చేయడానికి కారణమేంటో వారి ముందే చెప్పాల్సి ఉంటుంది. ఈ నామినేషన్ ప్రక్రియలో నామినేట్ చేసే కంటెస్టెంట్, నామినేట్ అవుతున్న ఇద్దరు కంటెస్టెంట్స్.. ఇలా ముగ్గురు మాత్రమే పాల్గొంటున్నట్టుగా ప్రోమోలో చూపించారు.
అర్హత లేదంటూ నామినేట్..
తాజాగా విడుదలయిన బిగ్ బాస్ 7 ప్రోమోలో ముందుగా శివాజీ.. సింగర్ దామినిని నామినేట్ చేసినట్టుగా చూపించారు. ఆ అమ్మాయికి అర్హత లేదు అంటూ శివాజీ చేసిన వ్యాఖ్యలు కూడా ప్రోమోలో ఉన్నాయి. ఇక ప్రియాంక జైన్.. రతిక, పల్లవి ప్రశాంత్‌ను నామినేట్ చేసింది. వారిద్దరూ రైతు బిడ్డలని చెప్పుకుంటున్నారని, అందరితో కలవడం లేదని కారణం చెప్తూ నామినేట్ చేసింది ప్రియాంక. ఈ విషయం రతిక, పల్లవి ప్రశాంత్‌లకు నచ్చలేదు. దీంతో వారు వచ్చి నువ్వే మాతో సరిగా ఉండడం లేదని ప్రియాంకతో వాగ్వాదానికి దిగారు. ఇక ఈ ప్రోమో చూస్తుంటే.. ఈ మొదటి నామినేషన్స్ ఎపిసోడ్‌లో మరెన్నో ఆసక్తికర అంశాలు జరిగాయని అర్థమవుతోంది.
The battleground is set! 📋 Contestants are now locked in a fierce battle of nominations, each fighting to safeguard their place. It's a high-stakes game inside the Bigg Boss house! 💪 #BiggBossNominations #GameOn @iamnagarjuna #BiggBossTelugu7 @DisneyPlusHSTel pic.twitter.com/xuBT5NwYg7
— Starmaa (@StarMaa) September 4, 2023
హౌజ్ వాతావరణాన్ని మార్చేసిన నామినేషన్స్..
బిగ్ బాస్‌లో కంటెస్టెంట్స్ అంతా ఒకరితో ఒకరు ఎంత సరదాగా ఉన్నా.. నామినేషన్స్ అనేవి వారి రిలేషన్‌షిప్స్‌ను పూర్తిగా మార్చేస్తాయి. నామినేషన్స్ అనేవి యుద్ధాలు లాగా ఉంటాయని, ఈ యుద్ధంలో గెలవాలంటే ఎవరి షీల్డ్‌తో వారు సిద్దంగా ఉండాలని బిగ్ బాస్ కూడా అంటుంటారు. వచ్చి ఒకరోజే అయినా కూడా కంటెస్టెంట్స్‌లో కొందరు టీమ్‌లాగా అయిపోయి.. వారికి నచ్చినవారిని నామినేట్ చేయకుండా ఉన్నారని ప్రేక్షకులు అప్పుడే విమర్శించడం మొదలుపెట్టారు. మొత్తంగా ఈ బిగ్ బాస్ సీజన్ 7 మొదటి నామినేషన్స్‌లో ఉన్నవారు గౌతమ్ కృష్ణ, రతిక, షకీలా, పల్లవి ప్రశాంత్, శోభా శెట్టి, కిరణ్ రాథోడ్, ప్రిన్స్ యావర్, దామిని భట్ల. మరి ఈ 8 మంది కంటెస్టెంట్స్‌లో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. లేదా ఫస్ట్ వీక్ కాబట్టి, ఈసారి తక్కువమంది కంటెస్టెంట్స్ ఉన్నారు కాబట్టి ఎలిమినేషన్ జరగకుండా ఉండే ఛాన్స్ కూడా ఉందని ప్రేక్షకులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ‘బిగ్ బాస్’ హౌస్‌లో సీక్రెట్ రూమ్? 14 కాదంట 21 మందట - వారంత అక్కడేనా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial





















