Bigg Boss 6 Telugu : 'బిగ్ బాస్'లో బల్లికి భయపడిన 'అ అంటే అమలాపురం' భామ
Bigg Boss 6 Telugu Contestant Abhinayashree : 'బిగ్ బాస్ 6' సందడి మొదలైంది. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే ముందు స్టేజి మీద నాగార్జునతో మాట్లాడుతున్నప్పుడు బల్లులు పడటంతో అభినయశ్రీ భయపడ్డారు.
'మ మ ముద్దు అంటే చేదా...' అంటూ ఒక కవి పాట రాశారు. ఒకవేళ అభినయ శ్రీ (Abhinayashree) ని చూస్తే... 'బ బ బల్లి అంటే భయమా?' అని రాసేవారు ఏమో!? ప్రతి ఒక్కరికీ కొన్ని కొన్ని భయాలు ఉంటాయి. కారణాలు ఏవైనా కావచ్చు... ఆ భయాన్ని ఎంత వయసు వచ్చినా కొంత మంది దాటలేరు. నటిగా, హాస్యనటిగా, ఐటమ్ సాంగ్స్ స్పెషలిస్టుగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న అభినయ శ్రీకి బల్లి అంటే భయం అని 'బిగ్ బాస్' తెలుగు ఆరో సీజన్ (Big Boss 6 Telugu) వల్ల తెలిసింది.
నాగార్జున సాక్షిగా బల్లికి భయపడిన అభినయ
అభినయ శ్రీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. 'ఆర్య' చిత్రంలో 'అ అంటే అమలాపురం... ఆ అంటే ఆహాపురం' పాట నుంచి ఆ తర్వాత ఆమె చేసిన ప్రతి పాట హిట్టే. సుమారు పదేళ్లుగా తెలుగు తెరకు ఆమె దూరంగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ 'బిగ్ బాస్ 6'తో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇస్తూ ఇస్తూ స్టేజి మీద మాంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఆ తర్వాత 'పులి అంటే భయం లేదు... లిజార్డ్ (బల్లి) అంటే భయమా? అని నాగార్జున అడిగారు. అప్పుడు అభినయ శ్రీ ''చిన్నప్పటి నుంచి...'' అని చెబుతున్నారు. ఒకసారిగా పై నుంచి కిందకు చాలా బల్లులు పడ్డాయి. అవ్వడానికి అవి ప్లాస్టిక్ బల్లి బొమ్మలు అయినా... అభినయ భయపడ్డారు.
నాగార్జున సినిమాతో తెలుగు తెరపై ఎంట్రీ
విశేషం ఏమిటంటే... 'బిగ్ బాస్' హోస్ట్ (Bigg Boss Telugu Season 6 Host Nagarjuna) నాగార్జున, ఆయన మేనల్లుడు సుమంత్ హీరోలుగా నటించిన 'స్నేహమంటే ఇదేరా' సినిమాతో అభినయ శ్రీ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత మూడేళ్లకు 'ఆర్య'లో సాంగ్ చేశారు. అప్పటి నుంచి కొన్నాళ్ళ పాటు ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. అదీ సంగతి!
Also Read : 'జబర్దస్త్' ప్రోగ్రామ్‌కు 'బిగ్ బాస్' నుంచి భారీ ఝలక్
బుల్లితెరపై బిగ్ బాస్ (Bigg Boss) నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది . అన్ని భాషల్లో ఈ షో సూపర్ హిట్ అయింది. తెలుగులో ఇప్పటి వరకు ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ ఏడాది ఓటీటీ వెర్షన్ వచ్చింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో 24 గంటల కాన్సెప్ట్ తో ఈ షో రన్ చేశారు. కానీ, ఆశించిన స్థాయిలో ఆదరణ రాలేదు.
ఇప్పుడు టీవీలో 'బిగ్ బాస్' ఆరో సీజన్ మొదలైంది. దీనికి అక్కినేని నాగార్జున హోస్ట్. ఈసారి మొత్తం 18 మంది కంటెస్టెంట్స్ కనిపించనున్నారని సమాచారం. ఈ సారి అబ్బాయిల నెంబర్ కంటే అమ్మాయిలే ఎక్కువ మంది హౌస్ లో కనిపించబోతున్నారు. ఎప్పటిలానే ఈసారి కూడా బిగ్ బాస్ హౌస్ ని చాలా కొత్తగా డిజైన్ చేశారు. మొత్తం 18 మంది పోటీదారులు కాబట్టి ఈసారి షో 100 రోజులకు పైగానే ఉండే ఛాన్స్ ఉంది. మధ్యలో డబుల్ ఎలిమినేషన్స్ కూడా ఉంటాయట.