X

Bigg Boss 5 Telugu: అమ్మ చెప్పింది.. షన్నూ.. ఇప్పటికైనా స్ట్రాటజీ మారుస్తావా..?

ఈ మధ్యకాలంలో షణ్ముఖ్ గేమ్ బాగా దెబ్బతింది. గట్టిగా చెప్పాలంటే జెస్సీ బయటకు వెళ్లిపోవడం కూడా ఒక కారణమనే చెప్పాలి.

FOLLOW US: 

యూట్యూబ్ స్టార్ గా ఎదిగి బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్ గా చోటు దక్కించుకున్నాడు షణ్ముఖ్. మొదటి నుంచి కూడా చాలా కూల్ గా ఉంటూ.. స్ట్రాటజీతో గేమ్ ఆడుతున్నాడు షణ్ముఖ్. అందుకే చాలా వారాల పాటు అతడిని ఎవరూ నామినేట్ చేయలేకపోయారు. కానీ మెల్లమెల్లగా షణ్ముఖ్ ని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. కానీ షణ్ముఖ్ మాత్రం తన గేమ్ ప్లేతో అభిమానులను పెంచుకుంటూ వస్తున్నాడు. తను నామినేషన్ ఉన్న ప్రతిసారి అత్యధిక ఓట్లు వేసి కాపాడుకుంటూ వచ్చారు ప్రేక్షకులు. 

కానీ ఈ మధ్యకాలంలో షణ్ముఖ్ గేమ్ బాగా దెబ్బతింది. గట్టిగా చెప్పాలంటే జెస్సీ బయటకు వెళ్లిపోవడం కూడా ఒక కారణమనే చెప్పాలి. అప్పటివరకు జెస్సీ-సిరి-షణ్ముఖ్ ఎంతో స్నేహంగా ఉండేవారు. గేమ్ లో కూడా ముగ్గురూ చాలా యాక్టివ్ గా ఉండేవారు. ఎవరైనా గొడవకు వచ్చారంటే.. ముగ్గురూ కలిసే ఎదుర్కొనేవారు. ఆ ముగ్గురి స్నేహం యూత్ కి బాగా కనెక్ట్ అయింది. దీంతో ఎక్కువ ఓట్లు వీరికే పడేవి. జెస్సీ ఎప్పుడైతే వర్టిగో కారణంగా బయటకు వచ్చేశాడో.. సిరి.. షణ్ముఖ్ కి బాగా క్లోజ్ అయిపోయింది. 

ఎంతలా ఉంటే ఇద్దరూ ఒకే బెడ్ పై హత్తుకొని పడుకోవడం, లేవగానే హగ్ చేసుకోవడం, ముద్దులు పెట్టుకోవడం చేసేవారు. స్నేహానికి కూడా హద్దులు ఉంటాయనే సంగతి మర్చిపోయి ప్రవర్తించేవారు. షణ్ముఖ్ కొన్ని సార్లు ఎవైడ్ చేద్దామని చూసినా సిరి మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. ఆమె అలగడం, షణ్ముఖ్ బుజ్జగించండం కొంతకాలం పాటు హౌస్ లో ఇదే లొల్లి. దీంతో చూసే ప్రేక్షకుడికి విసిగొచ్చింది. 

మొన్నటికి మొన్న నియంత టాస్క్ లో కూడా షణ్ముఖ్ చైర్ లో కూర్చోగానే.. గట్టిగా హత్తుకొని అందరి ముందు గట్టిగా ముద్దుపెట్టింది. షణ్ముఖ్ కూడా షాకైపోయాడు. హౌస్ లో రవి కూడా ఓ సందర్భంలో మీ రిలేషన్ ఎటు పోతుందో చూస్కోండి అంటూ సిరికి సలహా ఇచ్చాడు. కానీ సిరి మాత్రం తన ప్రవర్తన మార్చుకోలేదు. షణ్ముఖ్ తనతో సరిగ్గా మాట్లాడడం లేదని తలబాదుకోవడం వంటి పనులు చేసింది. ఈ ఎమోషనల్ బాండింగ్ కారణంగా షణ్ముఖ్ గేమ్ పై బాగా ఎఫెక్ట్ పడింది. 

ఈ విషయం షణ్ముఖ్ కి అర్థమైనా.. ఏం చేయలేని పరిస్థితి. లాస్ట్ వీక్ నాగార్జున వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ వారం హౌస్ లోకి వచ్చిన సిరి తల్లి అయితే అందరి ముందే మీ హగ్గులు నాకు నచ్చట్లేదంటూ చెప్పేసింది. దీంతో సిరి తన తల్లితో గొడవ పడింది. ఈ విషయంలో షణ్ముఖ్ బాగా హర్ట్ అయ్యాడు. 'అడ్వాంటేజ్ తీసుకోలేదని ఎప్పడూ అనుకోలేదు.. మీ మమ్మీకి ఆ విషయం చెప్పు' అంటూ సిరికి చెప్పాడు. 

ఇక నిన్నటి ఎపిసోడ్ లో షణ్ముఖ్ తల్లి వచ్చి పరోక్షంగా సిరికి చురకలు అంటించింది. షణ్ముఖ్ కూడా తన తల్లి దగ్గర బాధపడ్డాడు. సిరి వాళ్ల మదర్ అలా అనడంతో ఫీలైయ్యానని చెప్పాడు. ఎవరు అలిగినా ఎమోషనల్ అవ్వొద్దని కొడుక్కి సలహా ఇచ్చింది. నువ్ చాలా స్ట్రాంగ్ అని షణ్ముఖ్ ని మోటివేట్ చేసింది. తల్లిచ్చిన ప్రోత్సాహంతో.. 'ఇకపై షన్ను అంటే ఏంటో చూపిస్తాను' అంటూ షణ్ముఖ్ డైలాగ్స్ కొట్టాడు. కనీసం ఇప్పటినుంచైనా.. షణ్ముఖ్ తన స్ట్రాటజీని మారుస్తాడేమో చూడాలి!

Also Read:సన్నీ ఎవిక్షన్ ఫ్రీ పాస్.. హౌస్ లో హాట్ డిస్కషన్..

Also Read: పునీత్ రాజ్‌కుమార్ అలా కాదు... తాను మ‌ర‌ణించే వ‌ర‌కూ ఆ విష‌యం ఎవ్వ‌రికీ చెప్ప‌లేదు - రాజ‌మౌళి

Also Read: మహిళా నిర్మాతపై చీటింగ్ కేస్... కంప్లయింట్ చేసిన ప్రముఖ టాలీవుడ్ యాక్టర్?

Also Read: త్రివిక్ర‌మ్‌కు, ఏపీ మంత్రి పేర్ని ప్రస్తావించిన ట్వీట్‌కు సంబంధం లేదు

Also Read: కంగనా రనౌత్ పై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశాలు... వివాదాస్పద వ్యాఖ్యలపై దర్యాప్తు చేయాలని ఆర్డర్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Tags: Bigg Boss 5 Telugu Bigg Boss 5 Jessie Shanmukh Siri Shanmukh Strategy

సంబంధిత కథనాలు

Deepthi Sunaina: హీరోయిన్‌గా దీప్తీ సునయిన‌... ఆమె రియాక్ష‌న్ ఏంటంటే?

Deepthi Sunaina: హీరోయిన్‌గా దీప్తీ సునయిన‌... ఆమె రియాక్ష‌న్ ఏంటంటే?

Bigg Boss Siri: సిరి బాయ్ ఫ్రెండ్ కి క్రేజీ ఆఫర్.. ఛాన్స్ నిలబెట్టుకుంటాడా..?

Bigg Boss Siri: సిరి బాయ్ ఫ్రెండ్ కి క్రేజీ ఆఫర్.. ఛాన్స్ నిలబెట్టుకుంటాడా..?

Siri Hanmanth Covid: 'బిగ్ బాస్' బ్యూటీ సిరి హనుమంతుకు కరోనా

Siri Hanmanth Covid: 'బిగ్ బాస్' బ్యూటీ సిరి హనుమంతుకు కరోనా

షన్ముఖ్, దీప్తి బ్రేకప్‌పై స్పందించిన సిరి.. డిప్రషన్‌లోకి వెళ్లిపోయా!

షన్ముఖ్, దీప్తి బ్రేకప్‌పై స్పందించిన సిరి.. డిప్రషన్‌లోకి వెళ్లిపోయా!

Deepthi Sunaina: ఏడిస్తే కష్టం పోతుందా? - దీప్తి సునయన లేటెస్ట్ పంచ్! బ్రేకప్ బాధ నుంచి బయటకొస్తోందా? 

Deepthi Sunaina: ఏడిస్తే కష్టం పోతుందా? - దీప్తి సునయన లేటెస్ట్ పంచ్! బ్రేకప్ బాధ నుంచి బయటకొస్తోందా? 
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

AP Employees Strike Notice : ఆరో తేదీ అర్థరాత్రి నుంచి సమ్మె.. ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల నోటీసు !

AP Employees Strike Notice :   ఆరో తేదీ అర్థరాత్రి నుంచి సమ్మె.. ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల నోటీసు !

BheemlaNayak: పవన్ సినిమా రన్ టైం ఎంతో తెలుసా..?

BheemlaNayak: పవన్ సినిమా రన్ టైం ఎంతో తెలుసా..?

Baahubali Web Series: బాహుబలికే షాక్ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్.. రూ.150 కోట్లు ఖర్చు పెట్టాక అలా!

Baahubali Web Series: బాహుబలికే షాక్ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్.. రూ.150 కోట్లు ఖర్చు పెట్టాక అలా!

Amazon Tablet Offers: అమెజాన్‌లో ట్యాబ్లెట్లపై భారీ ఆఫర్లు.. ఏకంగా 50 శాతం వరకు!

Amazon Tablet Offers: అమెజాన్‌లో ట్యాబ్లెట్లపై భారీ ఆఫర్లు.. ఏకంగా 50 శాతం వరకు!