అన్వేషించండి

Bigg Boss 5 Telugu: నామినేషన్ లో పది మంది.. సన్నీ-సిరిల మధ్య చిచ్చు..

ఈ వారం ఎలిమినేషన్ కోసం మొత్తం పది మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు.

మానస్-సిరి కూర్చొని శ్రీరామచంద్ర గురించి మాట్లాడుకున్నారు. మొదట్లో ఉన్నట్లుగా ఇప్పుడు లేడని అనుకున్నారు. షణ్ముఖ్-రవి కూర్చొని సన్నీ గురించి డిస్కషన్ పెట్టుకున్నారు. తనవల్లే కెప్టెన్ అయ్యానని సన్నీ చెప్పడం బాలేదని.. ఈరోజు నామినేషన్ లో అవన్నీ తీస్తానని షణ్ముఖ్ చెప్పుకొచ్చాడు. 
 
 
నామినేషన్ ప్రక్రియ.. 
 
ఇంటి సభ్యులందరూ.. ఎటువంటి ముసుగు లేకుండా నామినేట్ చేసే రోజు ఆసన్నమైంది అంటూ బిగ్ బాస్ చెప్పారు. హౌస్ మేట్స్ నామినేట్ చేయాలనుకుంటున్న కంటెస్టెంట్స్ ముఖంపై ఫోమ్ పూయాలని చెప్పారు. 
  1. మానస్ - శ్రీరామ్ ని నామినేట్ చేస్తూ.. తనతో బాండింగ్ కుదరడం లేదని, నువ్ వెళ్లిపోతే నాకు ఫరక్ పడదని రీజన్ చెప్పి నామినేట్ చేశాడు. దానికి శ్రీరామ్.. 'నువ్ ఉన్నా కూడా నాకు ఫరక్ పడదు' అని శ్రీరామ్ కౌంటర్ వేశాడు. ఆ తరువాత జెస్సీను నామినేట్ చేస్తూ.. సంచాలక్ గా ఆలోచించి డెసిషన్ తీసుకోవాల్సిందని' రీజన్ చెప్పాడు. 
  2. సిరి - ముందుగా సన్నీని నామినేట్ చేస్తూ.. టాస్క్ లలో ఆయన ప్రవర్తన నచ్చలేదని రీజన్ చెప్పింది. ఆ తరువాత యానీ మాస్టర్ ను నామినేట్ చేస్తూ.. కెప్టెన్సీ టాస్క్ లో ఫ్రెండ్షిప్, ఫ్రెండ్షిప్ అని అన్నారని.. నా గేమ్ నేను ఆడుకుంటున్నా అని చెప్పుకొచ్చింది.
  3. శ్రీరామ్ - సన్నీకి నాకు హెల్తీ ఈక్వేషన్ ఉంది కానీ గేమ్ తరువాత కూడా అంతే అగ్రెసివ్ గా ఉంటున్నాడని.. దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడని చెప్పాడు. కాలేజ్ చైన్ బ్యాచ్ గొడవల్లా ఉంటుందని కామెంట్ చేసి అతడిని నామినేట్ చేశాడు. ఆ తరువాత మానస్ ని నామినేట్ చేస్తూ.. 'నీతో మాట్లాడినా ప్రాబ్లమే.. మాట్లాడకపోయినా ప్రాబ్లమే.. నిన్ను యంగర్ బ్రదర్ లా భావించాను. కానీ నువ్ నాలుగైదు మాస్క్ లు వేసుకొని ఉన్నావ్. నువ్ ఏమైనా ఉంటే నాతో మాట్లాడడానికి ట్రై చెయ్' అని అన్నాడు. దీంతో మానస్ ఫైర్ అవ్వడంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది.
  4. రవి - అన్నీ గుడ్ క్వాలిటీస్ ఉన్నాయ్ కానీ ఎక్కడో ధైర్యం లేదని మానస్ ని నామినేట్ చేశాడు. రవి చెప్పిన రీజన్స్ తనకు నచ్చలేదని మానస్ సీరియస్ గా మాట్లాడాడు. ఆ తరువాత కాజల్ ని నామినేట్ చేశాడు.
  5. జెస్సీ - కాలితో తన్నడం నచ్చలేదని సన్నీని నామినేట్ చేశాడు. ఆ తరువాత మానస్ ని నామినేట్ చేస్తూ.. సంచాలక్ గా నేను ఫెయిర్ డెసిషన్ తీసుకోలేదని చెప్పడం కరెక్ట్ కాదని.. నాగ్ సార్ కూడా తన తప్పు లేదని చెప్పారని జెస్సీ అన్నాడు. 
  6. ప్రియాంక - స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని విశ్వని నామినేట్ చేసింది. 'ఆలోచించే విధానానికొస్తే రవి అన్నయ్య కంటే ఎవరూ బాగా ఆలోచించలేరు' అంటూ అతడి నామినేట్ చేస్తూ రీజన్ చెప్పగా.. 'నేను బాగా ఆలోచిస్తానని.. ఇంటి నుంచి బయటకు పంపిస్తున్నావ్.. దీనంత వరస్ట్ ఇంకొకటి ఉండదు' అంటూ ఫైర్ అయ్యాడు రవి. 'ఫైనల్ లో నువ్ నేను ఉన్నప్పుడు నువ్ కచ్చితంగా గెలవలేవని నీకు తెలుసు..?' అని రవి అనగా.. 'అది నాకు తెలుసు కాబట్టే నేను నామినేట్ చేస్తున్నా' అంటూ బదులిచ్చింది ప్రియాంక.
  7. సన్నీ - 'సడెన్ గా యాక్టివ్ గా ఉంటున్నావ్.. సడెన్ గా నార్మల్ అయిపోతావ్' అంటూ సిరిని నామినేట్ చేశాడు. 'సంచాలక్ గా ఆలోచించి డెసిషన్ తీసుకోవాల్సింది' అంటూ జెస్సీని నామినేట్ చేశాడు.
  8. విశ్వ - 'ఇంట్లో స్ట్రాంగ్ ఉన్న వాళ్లను ఎలా నామినేట్ చేస్తున్నారో.. అలానే వీక్ కంటెస్టెంట్స్ కి కూడా ఉండే హౌస్ లో ఉండే అర్హత లేదని' ప్రియాంకను నామినేట్ చేశాడు. ఆ తరువాత మానస్ ని నామినేట్ చేస్తూ.. మూడు వారాల క్రితం జరిగిన  టాస్క్ లో ప్రియా గారి హెల్ప్ తీసుకోవడం నచ్చలేదని రీజన్ చెప్పాడు.
  9. కాజల్ - రవిని నామినేట్ చేస్తూ.. ఏదైనా ఇష్యూ ఉంటే సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నించడం లేదని.. అలానే తనకు స్నేక్ ఇవ్వడంపై హర్ట్ అవుతూ.. 'నిన్ను ఎదగకుండా ఆపడానికి నేనైతే ట్రై చెయ్యట్లేదు.. అండ్ నిన్ను ఎదగనివ్వకుండా హౌస్ లో ఎవరూ ట్రై చేయలేరు రవి' అని చెప్పింది. 'వేరే వాళ్ల గురించి నువ్ ఎందుకు మాట్లాడుతున్నావ్' అంటూ రవి కామెంట్ చేశాడు. శ్రీరామచంద్రను నామినేట్ చేస్తూ.. 'నీతో నార్మల్ గా మాట్లాడదాం ట్రై చేస్తున్నా.. సరిగ్గా ఉండడం లేదని' రీజన్ చెప్పింది. 'మీ ఇంటి పేరు పొగరా..? మీ ఇంటి పేరు పొగరుబోతా..?' అనే మాటలు నువ్ అన్నావ్ అని కాజల్ పై ఫైర్ అయ్యాడు శ్రీరామ్.
  10. యానీ మాస్టర్ - సిరి, కాజల్ లను నామినేట్ చేసింది.
  11. షణ్ముఖ్ - మానస్ ని నామినేట్ చేస్తూ.. 'ఫస్ట్ వీక్ నుంచి నీతో మంచి బాండింగ్ ఉంది. సన్నీని వరస్ట్ పెర్ఫార్మర్ గా సెలెక్ట్ చేసిన సమయంలో కొన్ని మాటలు అన్నావ్. నీ నుంచి ఆ మాటలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు' అంటూ నామినేట్ చేశాడు. ప్రియాంకను నామినేట్ చేస్తూ.. 'ప్రియాంక నీ గేమ్ నువ్ ఆడు.. ఇక వేరే గేమ్ నువ్ ఆడొద్దు' అనగా.. 'మీరు అలా అనేసి నామినేట్ చేసిన బయటకు పంపించేస్తే ఇంకెవరు ఆడతారు నా గేమ్' అని ప్రశ్నించింది. దానికి షణ్ముఖ్ 'ఇది నా రీజన్' అని చెప్పాడు. 'మీరే ఆడండి వెళ్లిన తరువాత' అంటూ సీరియస్ అయింది. 
ఆ తరువాత సిరి అందరిముందు సన్నీని ఎందుకు నామినేట్ చేసిందో మరోసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. దీంతో సన్నీ కూడా రియాక్ట్ అయ్యాడు. నామినేషన్ అయ్యాక ఎందుకు మాట్లాడడం అని మానస్ అనగా.. హైలైట్ అవ్వడానికి అంటూ సన్నీ కామెంట్ చేశాడు. ఆ మాటలు సిరికి వినిపించడంతో 'ఇక్కడ ఎవడూ హైలైట్ అవ్వడానికి రాలేదు.. హైలైట్ అవ్వడానికి చేయట్లేదు.. నువ్ చేస్తున్నావేమో అందుకే నీకు అనిపిస్తుంది. నోరు ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఎవడూ పడడు ఇక్కడ' అంటూ గట్టిగా చెప్పింది. 
 
ఈ వారం ఎలిమినేట్ అవ్వడానికి ఎవరెవరు నామినేట్ అయ్యారంటే.. మానస్, సన్నీ, శ్రీరామ్, సిరి, కాజల్, ప్రియాంక, రవి, జెస్సీ, యానీ మాస్టర్, విశ్వ. 
 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Manipur: మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
Nora Fatehi From Matka: 'మట్కా' ఫ్లాపే కానీ... మూవీలో నోరా ఫతేహి ఎంత ముద్దుగా ఉందో చూశారా?
'మట్కా' ఫ్లాపే కానీ... మూవీలో నోరా ఫతేహి ఎంత ముద్దుగా ఉందో చూశారా?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Embed widget