అన్వేషించండి
Advertisement
Bigg Boss 5 Telugu Promo: అత్తా కోడళ్లుగా ఉమాదేవి, సిరి.. హౌస్ లో 'సీటీమార్' డాన్స్..
బిగ్ బాస్ సీజన్ 5 మొదలై పది రోజులకు పైనే అయింది. మొదటివారం సరయు ఎలిమినేట్ అవ్వగా.. రెండో వారంలో నామినేషన్లో ఏడుగురు ఉన్నారు.
బిగ్ బాస్ సీజన్ 5 మొదలై పది రోజులకు పైనే అయింది. మొదటివారం సరయు ఎలిమినేట్ అవ్వగా.. రెండో వారంలో నామినేషన్లో ఏడుగురు ఉన్నారు. ఇదిలా ఉండగా.. రెండు రోజులుగా హౌస్ లో కెప్టెన్సీ కోసం టాస్క్ జరుగుతోంది. ఇది ఫిజికల్ టాస్క్ కావడంతో హౌస్ మేట్స్ అంతా రెచ్చిపోయారు. ఒకరిపై మరొకరు పడిపోతూ.. కొట్టుకుంటూ హింసకు పాల్పడ్డారు. బిగ్ బాస్ ఎన్ని సార్లు వార్నింగ్ ఇచ్చినా.. హౌస్ మేట్స్ మాత్రం తగ్గలేదు.
రెండు రోజులుగా హౌస్ లో గొడవలు మాత్రమే జరుగుతుండడంతో బిగ్ బాస్ కి కూడా విసుగొచ్చిందో ఏమో గానీ ఈరోజు ఎపిసోడ్ ని కాస్త ఫన్ గా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇందులో ముందుగా లోబో, ప్రియాంక కలిసి నవ్వించడానికి ప్రయత్నించారు. ఇద్దరూ కలిసి ఆటో టాస్క్ చేశారు.
ఆ తరువాత ఉమాదేవి, సిరి కలిసి అత్తాకోడళ్లుగా ఓ టాస్క్ చేశారు. సిరిని పొగిడేస్తూ.. తన కొడుకుగా షణ్ముఖ్ పేరు చెబుతూ రచ్చ చేసింది ఉమాదేవి. అత్తాకోడళ్లు ఎక్స్ పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ అంటూ సాగిన ఈ టాస్క్ చూసి హౌస్ మేట్స్ బాగా నవ్వుకున్నారు. అనంతరం హౌస్ మేట్స్ అందరూ కలిసి 'సీటీమార్ సీటీమార్ సీటీమార్' అంటూ సాగే మాస్ మసాలా సాంగ్ కు స్టెప్పులేస్తూ అలరించారు.
#5MuchFun kosam chinna relief plan chesam... Let's have some fun!#BiggBossTelugu5 today at 10 PM on #StarMaa#FiveMuchFun pic.twitter.com/pixcZyq4VJ
— starmaa (@StarMaa) September 16, 2021
Also Read : నాకు అన్యాయం చేస్తారా.. ఇక బయట నుంచి దమ్ దమ్ చేస్తా చూస్కోరి.. బిగ్బాస్కు సరయు వార్నింగ్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion