అన్వేషించండి

Bigg Boss 5 Telugu: ఆ నలుగురు సేఫ్.. రేపు ఎలిమినేట్ అయ్యేది ఆ మాస్టారే 

బిగ్ బాస్ సీజన్ 5 శనివారం ఎపిసోడ్ లో ఆ నలుగురిని సేవ్ చేశారు నాగార్జున. మరి రేపు ఎవరు ఎలిమినేట్ అవుతారో.. 

బిగ్ బాస్ సీజన్ 5 నాలుగో వారం పూర్తిచేసుకోబోతుంది. ఇప్పటికే తొలివారం సరయు, రెండోవారంలో ఉమాదేవి ఎలిమినేట్ కాగా.. మూడోవారంలో లహరి ఎలిమినేట్ అయింది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది. శనివారం నాడు ఎపిసోడ్ లో ఎప్పటిలానే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు నాగార్జున. రాగానే శుక్రవారం నాడు హౌస్ లో ఏం జరిగిందో చూపించారు! 

ఫ్రైడే హైలైట్స్.. 
షణ్ముఖ్ తనతో సరిగ్గా మాట్లాడడం లేదని.. కావాలనే పక్కన పెడుతున్నాడని కాజల్ దగ్గర సిరి వాపోయింది. ఆ తరువాత షణ్ముఖ్ తో మీటింగ్ పెట్టింది సిరి. ఈ క్రమంలో షణ్ముఖ్.. అందరూ తనను వాడుకుంటున్నారని అనిపిస్తుందని.. జెస్సీ తనను వాడుకున్నా ఆ ఫీలింగ్ రాదని పరోక్షంగా సిరి వాడుకుంటున్నట్లు కామెంట్ చేశాడు. దీంతో సిరి 'నీ నుంచి ఇలాంటి మాటలు ఊహించలేదు' అంటూ అక్కడ నుంచి వెళ్లిపోయింది. 
ఆ తరువాత హౌస్ మేట్స్ తో మాట్లాడిన నాగార్జున ఈ వారం ఎవరైతే పొరపాట్లు చేశారో.. వాళ్లని లేచి నుంచోమని చెప్పారు. కెప్టెన్ గా నేను ఫెయిల్ అయ్యానని జెస్సీ అనగా.. తప్పు చేయకపోయినా జెస్సీ లేచి నుంచున్నాడని కానీ తప్పు చేసిన వాళ్లు ఒప్పుకోవడం లేదని నాగ్ కామెంట్ చేశారు. 

Also Read:సమంతతో విడాకులు - నాగచైతన్య అధికారిక ప్రకటన !

లోబోకి వార్నింగ్..

లోబో రూల్స్ ని చాలా సార్లు బ్రేక్ చేశాడని తన దృష్టిలో లోబో వరస్ట్ పెర్ఫార్మర్ అని శ్వేతా చెప్పగా.. లోబోతో మాట్లాడారు నాగార్జున. 'నా వరకు నేనేంచేసినా.. బరాబర్ చేసినా.. జనాలకు నచ్చుతుందో లేదో తెలియడం లేదు' అన్నాడు. 'అంటే అరవడం కూడా అలానే అరుస్తావా' అని నాగ్ ప్రశ్నించాడు. దానికి లోబో.. 'లవ్ అనే పదం అనగానే' అంటూ ఏదో చెప్పబోతుంటే.. 'నీ ఒక్కడికే ఉంది ప్రేమ ఇంకెవరికీ లేదు' అని కామెంట్ చేశారు నాగ్. 'మాట్లాడితే బస్తీ నుంచి వచ్చాను.. this is bigg boss house.. ఇది బస్తీ కాదు, విల్లా కాదు.. అందరూ ఒక్కటే' అంటూ ఫైర్ అయ్యారు నాగ్. నామినేషన్స్ లో ఎలా అరిచావో ఇప్పుడు అరిచి చూపించమని నాగ్.. లోబోని అడగ్గా.. తనకు గుర్తులేదని.. కానీ ఫ్రస్ట్రేషన్ లో అలా ప్రవర్తించానని క్షమాపణలు కోరాడు. 

ఆ తరువాత కెప్టెన్సీ టాస్క్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ అందరికీ బిగ్ బాస్ రివార్డ్స్ ప్రకటించారు. కొందరికి కేక్, మరికొందరికి మఫిన్స్ ఇచ్చారు. సిరి, షణ్ముఖ్ లను నుంచోమని చెప్పి వారి ముందు మిర్చీలతో ఉన్న ప్లేట్ ను పెట్టారు. 'తినమ్మా చిన్న ముక్క తిను' అని నాగ్.. షణ్ముఖ్ కి చెప్పగా.. అతడు మిర్చీను తిన్నాడు. 'కూర్చొని కబుర్లు చెప్తున్నావ్ అంతే' అంటూ షణ్ముఖ్ పై పంచ్ వేశారు నాగ్ 'నీలో ఉన్న ఫైర్ ని బయటకు తీయడానికి మిర్చి ఇచ్చానని' అన్నారు. ఆ తరువాత సిరిని ఉద్దేశిస్తూ.. 'నీ ఆట నువ్ ఆడమ్మా' అని అన్నారు. సిరి-షణ్ముఖ్ లను ఉద్దేశిస్తూ.. మీ కారణంగా జెస్సీ కూడా ఎఫెక్ట్ అవుతున్నాడు అన్నారు నాగ్.

రవి సేఫ్..

నామినేషన్ లో ఉన్నవాళ్లను గార్డెన్ ఏరియాలోకి పిలిచిన నాగార్జున.. టాస్క్ ద్వారా యాంకర్ రవి సేఫ్ అయినట్లు వెల్లడించారు.  

  • హౌస్ మేట్స్ అందరికీ 'బిగ్ బాస్ యాప్ స్టోర్' అనే టాస్క్ ఇచ్చారు నాగార్జున. ఈ టాస్క్ లో రవి 'అటెన్షన్ సీకర్' అనే పదాన్ని ప్రియాంకకు ఇచ్చాడు.
  • ప్రియా 'వాచ్ యువర్ టంగ్' అనే పదాన్ని లోబోకి ఇచ్చింది.
  • సన్నీ 'అటెన్షన్ సీకర్' అనే పదాన్ని కాజల్ కి ఇచ్చాడు.
  • మానస్ 'బ్రెయిన్ యూజ్ చేయండి' అనే పదాన్ని లోబోకి ఇచ్చాడు.
  • హమీద 'బ్రెయిన్ యూజ్ చేయండి' అనే పదాన్ని సన్నీ కి ఇచ్చాడు.
  • యానీ మాస్టర్ 'అటెన్షన్ సీకర్' అనే పదాన్ని ప్రియాంకకు ఇచ్చింది.
  • కాజల్ 'సింపతీ గైనర్' అనే పదాన్ని లోబోకి ఇచ్చింది. 

ప్రియా సేఫ్..

నామినేషన్ లో ఉన్నవాళ్లకి ఫోన్ టాస్క్ ఇచ్చారు నాగార్జున. ఫోన్ రింగ్ అయినప్పుడు ఎంగేజ్ వస్తే.. వాళ్లు అన్ సేఫ్ అని చెప్పారు. ఈ టాస్క్ లో ప్రియా సేఫ్ అయింది. 

  • నటరాజ్ మాస్టర్ 'సింపతీ గైనర్' అనే పదాన్ని విశ్వకి ఇచ్చాడు.
  • విశ్వ 'బ్రెయిన్ యూజ్ చేయండి' అనే పదాన్ని లోబోకి ఇచ్చాడు.
  • ప్రియాంక 'వాచ్ యూవర్ టంగ్' అనే పదాన్ని లోబోకి ఇచ్చింది.
  • శ్వేతా 'వాచ్ యూవర్ టంగ్' అనే పదాన్ని కాజల్ కి ఇచ్చింది.
  • జెస్సీ 'మైండ్ యువర్ ఓన్ బిజినెస్' అనే పదాన్ని రవికి ఇస్తూ.. 'నా మీద ఫోకస్ చేయడం మానేసి గేమ్ ఆడు.. నేను నాలానే ఉంటా.. నాకు నా స్పేస్ ఉంది.. మీకు ఎవరినైనా మార్చాలని ఉంటే హౌస్ లో రూల్స్  పాటించని వారిని, బూతులు మాట్లాడుతున్న వారిని మార్చండి' అని చెప్పాడు.
  • షణ్ముఖ్ 'యూజ్ యువర్ బ్రెయిన్' అనే పదాన్ని సిరికి ఇస్తూ.. తనకు ఎవరు ఏంటో అర్ధమయ్యే లోపు తన సెల్ఫ్ ని తను లూజ్ అవుతుందనిపిస్తుందని రీజన్ చెప్పాడు.
  • సిరి 'యూజ్ యువర్ బ్రెయిన్' అనే పదాన్ని లోబోకి ఇస్తూ.. నామినేషన్స్ లో వేరే లోబోని చూస్తున్నామని ఆ తీరు మార్చుకోవాలని చెప్పింది.
  • శ్రీరామచంద్ర 'యూజ్ యువర్ బ్రెయిన్' అనే పదాన్ని లోబోకి ఇచ్చాడు. 

తరువాత టాస్క్ లో సన్నీ, కాజల్ లను సేవ్ అయినట్లు చెప్పారు నాగార్జున. ఇక మిగిలిన లోబో, సిరి, నటరాజ్ మాస్టర్, యానీ మాస్టర్ లలో ఎవరో ఒకరు రేపు ఎలిమినేట్ కానున్నారు. 

Also Read: రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టేసిన 'పుష్ప' టీమ్, రిలీజ్ డేట్ ఫిక్స్ చేసేశారు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి


 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Matka: అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
Which OTT Platform Has Basic Instinct: మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
Andhra News: అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
Sim Cards Blocked: 1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
Embed widget