Bigg Boss 5 Telugu: 'ఇమిటేట్ చేస్తే మర్యాదగా ఉండదు..' సన్నీకి వార్నింగ్ ఇచ్చిన సిరి..

ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ లో యానీ మాస్టర్, కాజల్ ల మధ్య మాటల యుద్ధం జరిగింది. అలానే సన్నీ-సిరి-షణ్ముఖ్ ల మధ్య పెద్ద గొడవ జరిగింది.

FOLLOW US: 

హౌస్ మేట్స్ కి ఇచ్చిన బీబీ హోటల్ టాస్క్ పూర్తయినట్లు బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. ఈ టాస్క్ లో హోటల్ స్టాఫ్ విఫలం కావడంతో.. అతిథులు విజేతలుగా నిలిచారు. రవికి ఇచ్చిన సీక్రెట్ టాస్క్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేయడంతో అతడు మొదటి కెప్టెన్సీ పోటీదారుడయ్యాడు.  హోటల్ స్టాఫ్ ప్రదర్శనను అభినందిస్తూ.. వాళ్లకి ఒక పవర్ ఇచ్చారు బిగ్ బాస్. హోటల్ స్టాఫ్ అందరూ కలిసి అతిథుల టీమ్ నుంచి కెప్టెన్సీ పోటీదారులయ్యేందుకు అనర్హులుగా భావించే ఇద్దరు సభ్యుల పేర్లను, తగిన కారణాలతో చెప్పమని సూచించారు. దీంతో వాళ్లు డిస్కస్ చేసుకొని.. మానస్-ప్రియాంక పేర్లు చెప్పారు. దీంతో ప్రియాంక ఫైర్ అయింది. మానస్ కూడా డిస్కషన్ పెట్టాడు. ప్రియాంక.. షణ్ముఖ్ ఇచ్చిన రీజన్ బాలేవని మండిపడింది. అతడికి సిరితో ఉండడమే సరిపోయిందని.. టాస్క్ లో మన దగ్గరకు ఎక్కడ వచ్చాడంటూ మానస్,సన్నీలతో చెప్పింది. ఫైనల్ గా రవి, సిరి, సన్నీ, కాజల్ లను కెప్టెన్సీ టాస్క్ కోసం పోరాడతారని చెప్పారు బిగ్ బాస్. 

Also Read: 'ఒక్క గేమ్ అయినా.. నిజాయితీగా ఆడావా..?' కాజల్ పై యానీ మాస్టర్ ఫైర్..

కెప్టెన్సీ టాస్క్.. 

'టవర్ లో ఉంది పవర్' అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ లో పోటీదారులు ఎత్తైన టవర్ ను నిర్మించి అది కూలకుండా చూసుకోవాలి. వేరే వాళ్ల టవర్స్ ను బాల్స్ విసిరి కూల్చే ప్రయత్నం చేయొచ్చని చెప్పారు. హౌస్ మేట్స్ ఎవరికైతే మద్దతు తెలుపుతారో.. వాళ్ల టవర్  ను కాపాడాలని చెప్పారు. ఫస్ట్ రౌండ్ లో కాజల్, సెకండ్ రౌండ్ లో సన్నీ ఓడిపోయారు. సెకండ్ రౌండ్ లో తనకు సిరి అడ్డుపడడంతో సన్నీ ఫైర్ అయ్యాడు. 'నేను గేమ్ ఆడితే నిన్ను అప్పడంలా తొక్కేస్తా' అని సిరిపై అరిచాడు. సిరి-సన్నీ గొడవ జరుగుతుండగా షణ్ముక్ అడ్డుపడడంతో.. సన్నీ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు. దమ్ము లేదని, చేతకాని ఆటలు ఆడతారని షణ్ముఖ్ ని ఉద్దేశిస్తూ కామెంట్స్ చేశాడు. ఏరా-పోరా-రారా అనే స్థాయికి వెళ్లింది. ఇద్దరూ ఒకరిపై మరొకరు అరుచుకున్నారు.

గేమ్ లో రవిని సపోర్ట్ చేస్తోన్న యానీ మాస్టర్ దగ్గరకు వెళ్లి.. ఆమెకి కితకితలు పెట్టబోయింది కాజల్. దానికి యానీ 'డోంట్ డూ దట్' అంటూ అరిచింది. 'మీరు చెప్పినప్పుడు వాళ్లను డిస్ క్వాలిఫై చేయాలి కదా మాస్టర్ మరి' అని ప్రశ్నించాడు సన్నీ. 'మీ వాళ్లే వచ్చి చేశారని' యానీ అనగా.. 'మావోళ్లు ఎవరు మాస్టర్ మావోళ్లు, మీవోళ్లు' అంటూ ఫైర్ అయ్యాడు. ఆ తరువాత యానీ.. 'నీ గేమ్ అయిపోయింది కదా.. నువ్ ఎవరిని సపోర్ట్ చేస్తున్నావ్' అని కాజల్ ని అడిగింది. దానికి రవి సైడ్ అని చెప్పింది కాజల్. 'రవి సైడ్ అని చెప్పి.. రవి సైడ్ వాళ్లకే గిలిగింత పెడతావా..?' అని ప్రశ్నించింది. 'అవును మాస్టర్.. నా గేమ్ అదే' అని బదులిచ్చింది కాజల్. 'నీ గేమ్ నువ్ ఆడుకో.. నా దగ్గరకు రాకు.. డోంట్ టచ్ మీ' అంటూ గట్టిగా అరిచింది యానీ. దానికి కాజల్ 'చెప్పారుగా.. ఇక అలా చేయనని' చెప్పింది. 

దయచేసి నా దగ్గరకు రాకు తల్లీ అంటూ దండం పెట్టింది యానీ. 'మేం ఆడతాం.. బరాబార్ ఆడతాం.. ముందు నుంచి చెప్తున్నాం' అని కాజల్ అనగా.. 'ఎస్ నాగిన్' అంటూ డాన్స్ చేసింది యానీ మాస్టర్. మాటలే కాదు.. యాక్షన్స్ కూడా లూజ్ అవుతున్నారంటూ కాజల్ డైలాగ్ వేసింది. 'ఒక్క గేమ్ అయినా.. నిజాయితీగా ఆడావా..?' అంటూ యానీ.. కాజల్ పై ఫైర్ అయింది. ఫాల్తూ, బేవకూఫ్ గేమ్ ఆడుతున్నావ్ అంటూ యానీ ఇష్టమొచ్చినట్లు మాటలు విసిరేసింది. 

ప్రియాంక చీర తగిలి తన టవర్ పడిపోవడంతో సన్నీ కోప్పడ్డాడు. కావాలని చేస్తుందా..? తెలియక చేస్తుందా..? అని పింకీని ఉద్దేశిస్తూ మానస్ అనడంతో సన్నీ మరింత ఫ్రస్ట్రేట్ అయ్యాడు. 

సిరి-షణ్ముఖ్-సన్నీల మధ్య గొడవను పరిష్కరిద్దామని యానీ డిస్కషన్ పెట్టగా.. గొడవ మరింత పెద్దదైంది. సన్నీ ఆగ్రహంతో ఊగిపోతూ.. కామెంట్స్ చేయడంతో 'రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు' అంటూ షణ్ముఖ్ అన్నాడు. వెంటనే సన్నీ.. షణ్ముఖ్ ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేశాడు. 'ఇమిటేట్ చేస్తే మర్యాదగా ఉండదు.. వాడిని ఇమిటేట్ చేస్తే మర్యాదగా ఉండదు..' అంటూ సిరి ఓ రేంజ్ లో ఫైర్ అయింది. 'రా అంటే ఇంత కోపం వస్తది.. అన్నన్ని మాటలు విసిరేస్తే ఎవరు పడతారు' అంటూ సన్నీపై కామెంట్ చేసింది సిరి. ఫ్లోలో సన్నీ.. 'యూట్యూబ్ వరకే..' అని షణ్ముఖ్ ని ఉద్దేశిస్తూ అనడంతో 'ఐయామ్ జస్ట్ ఏ యూట్యూబర్' అంటూ షణ్ముఖ్ అన్నాడు. 'అవును అక్కడ నుంచే వచ్చాము' అంటూ సిరి చెప్పింది. ఇక గేమ్ లో థర్డ్ రౌండ్ లో సిరి టవర్ కూలిపోవడంతో కెప్టెన్సీ టాస్క్ లో రవి గెలిచాడు. 

Also Read: యంగ్ హీరోలు.. ఒకరి సినిమాను మరొకరు ప్రమోట్ చేసుకుంటూ..

 

Also Read: 'దృశ్యం 2' రిలీజ్ డేట్ వచ్చేసింది..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 12 Nov 2021 11:18 PM (IST) Tags: Kajal Bigg Boss 5 Telugu Bigg Boss 5 Shanmukh Siri Sunny Anee Master

సంబంధిత కథనాలు

Bigg Boss Sunny New Movie: 'సన్నాఫ్ ఇండియా' దర్శకుడితో 'బిగ్ బాస్' విన్నర్ సన్నీ హీరోగా సినిమా

Bigg Boss Sunny New Movie: 'సన్నాఫ్ ఇండియా' దర్శకుడితో 'బిగ్ బాస్' విన్నర్ సన్నీ హీరోగా సినిమా

Bigg Boss 6 Telugu: ‘బిగ్ బాస్’ సీజన్-6లోకి సామాన్యులకు అవకాశం, నాగ్ ఆహ్వానం

Bigg Boss 6 Telugu: ‘బిగ్ బాస్’ సీజన్-6లోకి సామాన్యులకు అవకాశం, నాగ్ ఆహ్వానం

Urfi Javed: పగిలిన గాజు ముక్కలతో డ్రెస్, ఉర్ఫి జావెద్ మరో అరాచకం, తాకితే చేతులు తెగుతాయ్!

Urfi Javed: పగిలిన గాజు ముక్కలతో డ్రెస్, ఉర్ఫి జావెద్ మరో అరాచకం, తాకితే చేతులు తెగుతాయ్!

Bindu Madhavi: బాత్రూమ్ లో బిందు మాధవి స్మోకింగ్ - నిజమేనా?

Bindu Madhavi: బాత్రూమ్ లో బిందు మాధవి స్మోకింగ్ - నిజమేనా?

Bigg Boss Non-Stop Winner Prize Money: బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ - ప్రైజ్ మనీ ఎంత గెలుచుకుందంటే?

Bigg Boss Non-Stop Winner Prize Money: బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ - ప్రైజ్ మనీ ఎంత గెలుచుకుందంటే?

టాప్ స్టోరీస్

Redmi 11 5G Launch: రెడ్‌మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!

Redmi 11 5G Launch: రెడ్‌మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!

Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?

Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?

Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!

Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!

3 Years of YSR Congress Party Rule : జగన్ మూడేళ్ల పాలనలో టాప్ టెన్ హైలెట్స్ ఇవే !

3 Years of YSR Congress Party Rule :   జగన్ మూడేళ్ల పాలనలో టాప్ టెన్ హైలెట్స్ ఇవే !