అన్వేషించండి
Advertisement
Bigg Boss 5: 'ఒక్క గేమ్ అయినా.. నిజాయితీగా ఆడావా..?' కాజల్ పై యానీ మాస్టర్ ఫైర్..
ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ లో యానీ మాస్టర్, కాజల్ ల మధ్య మాటల యుద్ధం జరిగింది.
ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ జరగబోతుంది. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో శ్రీరామ్ ని సపోర్ట్ చేస్తోన్న యానీ మాస్టర్ దగ్గరకు వెళ్లి.. ఆమెకి కితకితలు పెట్టబోయింది కాజల్. దానికి యానీ 'డోంట్ డూ దట్' అంటూ అరిచింది. ఇలా చేస్తే డిస్ క్వాలిఫై చేసేస్తానని చెప్పింది. 'మీరు చెప్పినప్పుడు వాళ్లను డిస్ క్వాలిఫై చేయాలి కదా మాస్టర్ మరి' అని ప్రశ్నించాడు సన్నీ. 'మీ వాళ్లే వచ్చి చేశారని' యానీ అనగా.. 'మావోళ్లు ఎవరు మాస్టర్ మావోళ్లు, మీవోళ్లు' అంటూ ఫైర్ అయ్యాడు.
ఆ తరువాత యానీ.. 'నీ గేమ్ అయిపోయింది కదా.. నువ్ ఎవరిని సపోర్ట్ చేస్తున్నావ్' అని కాజల్ ని అడిగింది. దానికి రవి సైడ్ అని చెప్పింది కాజల్. 'రవి సైడ్ అని చెప్పి.. రవి సైడ్ వాళ్లకే గిలిగింత పెడతావా..?' అని ప్రశ్నించింది. 'అవును మాస్టర్.. నా గేమ్ అదే' అని బదులిచ్చింది కాజల్. 'నీ గేమ్ నువ్ ఆడుకో.. నా దగ్గరకు రాకు.. డోంట్ టచ్ మీ' అంటూ గట్టిగా అరిచింది యానీ. దానికి కాజల్ 'చెప్పారుగా.. ఇక అలా చేయనని' చెప్పింది.
దయచేసి నా దగ్గరకు రాకు తల్లీ అంటూ దండం పెట్టింది యానీ. 'మేం ఆడతాం.. బరాబార్ ఆడతాం.. ముందు నుంచి చెప్తున్నాం' అని కాజల్ అనగా.. 'ఎస్ నాగిన్' అంటూ డాన్స్ చేసింది యానీ మాస్టర్. మాటలే కాదు.. యాక్షన్స్ కూడా లూజ్ అవుతున్నారంటూ కాజల్ డైలాగ్ వేసింది. 'ఒక్క గేమ్ అయినా.. నిజాయితీగా ఆడావా..?' అంటూ యానీ.. కాజల్ పై ఫైర్ అయింది.
Evaru loosing of words and actions?? Who is right #Anee or #Kajal?? #BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/0LCbeNBFSx
— starmaa (@StarMaa) November 12, 2021
Also Read: 'దృశ్యం 2' రిలీజ్ డేట్ వచ్చేసింది..
Also Read: మంచి జరుగుతూనే ఉంటుంది గుర్తుంచుకోండి .. సామ్ పోస్ట్ వైరల్
Also Read: టికెట్ ధరలు పెంచుతారా? లేదా? ఏపీ ఆన్లైన్ టికెట్ల విధానంలో స్పష్టత వచ్చిందా? లేదా!?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
క్రైమ్
మొబైల్స్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion