X

Bigg Boss 5 Telugu: సన్నీ కాదు.. సిరి కాదు.. ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరంటే..?

మొదటి ఫైనలిస్ట్ గా ఎన్నికైంది సన్నీ, సిరి కాదు.. శ్రీరామచంద్ర. ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇక్కడ చదివేయండి.

FOLLOW US: 

ఈరోజు కూడా బిగ్ బాస్ హౌస్ లో 'టికెట్ టు ఫినాలే' టాస్క్ కంటిన్యూ అయింది. కాజల్, ప్రియాంక, షణ్ముఖ్ లు కొన్ని ఛాలెంజెస్ లో ఓడిపోవడంతో మిగిలిన హౌస్ మేట్స్ తో గేమ్ కంటిన్యూ చేశారు. 

ఉదయాన్నే ప్రియాంక, షణ్ముఖ్ ఎలిమినేషన్ గురించి మాట్లాడుకున్నారు. తను, కాజల్ లలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారనిపిస్తుందని ప్రియాంక చెప్పింది. ఆ తరువాత షణ్ముఖ్.. సన్నీ ఎన్ని తప్పులు చేస్తున్నా యాక్సెప్ట్ చేస్తున్నారని.. చాలా మంచి ఫ్యాన్స్ ఉన్నారని.. వాళ్లు ఎన్ని చేసినా ఏం అనరు.. ఓట్లు వేస్తున్నారు.. అది బాధగా ఉందంటూ కామెంట్ చేశాడు. 

కాజల్ పై సన్నీ ఫైర్: హౌస్ మేట్స్ అందరూ కలిసి మళ్లీ 'ఫోకస్' ఛాలెంజ్ ను ఎన్నుకున్నారు. ఈ టాస్క్ లో భాగంగా.. కొన్ని సౌండ్స్ ను ఒక సీక్వెన్స్ లో వినిపించారు బిగ్ బాస్. వాటిని అదే సీక్వెన్స్ లో తక్కువ టైంలో రాయాలని హౌస్ మేట్స్ కి చెప్పారు. సన్నీ, మానస్, శ్రీరామ్, సిరి ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేశారు. అయితే గేమ్ లో కాజల్ డిస్టర్బ్ చేస్తుందని.. ఆమెని తన పక్క నుంచి వెళ్లిపొమ్మని చెప్పాడు సన్నీ. ఆమె వెళ్లనని వాదించింది. ఆ తరువాత కాజల్ పై అరిచాడు సన్నీ. దీంతో ఇద్దరి మధ్య కాసేపు గొడవ జరిగింది. ఇక ఈ ఛాలెంజ్ లో సన్నీ, మానస్ ఫస్ట్ ప్లేస్ లో రాగా.. శ్రీరామ్, సిరి సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్ లో వచ్చారు. 

సన్నీపై టిష్యూ విసిరిన కాజల్: తింటున్నప్పుడు మరోసారి కాజల్ తో గొడవ పెట్టుకున్నాడు సన్నీ. ఆమె తన వెర్షన్ చెప్పే ప్రయత్నం చేయగా అక్కడనుంచి లేచి వెళ్లిపోయాడు. ఆ తరువాత మానస్-సన్నీ కిచెన్ ఏరియలో ఉండగా.. కాజల్.. సన్నీతో మాట్లాడింది. ఎన్ని సార్లు సారీ చెప్పినా పట్టించుకోవట్లేదని డైలాగ్ కొట్టింది. సన్నీ కౌంటర్ వేయడంతో.. కాజల్ కి కోపమొచ్చి తను వాడిన టిష్యూని అతడి తలపై విసిరికొట్టింది. దీంతో సన్నీకి కోపమొచ్చింది. కానీ కంట్రోల్ చేసుకుంటూ.. కామన్ సెన్స్ తో, ఒక మనిషిలా బిహేవ్ చెయ్ అంటూ తిట్టాడు. అవతలివాళ్లకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో అంటూ డైలాగ్ వేశాడు. 

యాక్యురెసీ ఛాలెంజ్: నెక్స్ట్ ఛాలెంజ్ లో భాగంగా పోటీదారులందరూ కలిసి 'యాక్యురెసీ' ఛాలెంజ్ ను ఎన్నుకున్నారు. ఇందులో భాగంగా పోటీదారులకు సంబంధించిన బోర్డ్స్ పై కొన్ని బల్బ్స్ ఉన్నాయి. ప్రతి బల్బ్ కింద ఆ బల్బ్ కి సంబంధించిన స్విచ్ ఉంది. బోర్డ్స్ పై ఉన్న బల్బ్స్ లో కొన్ని ఆన్, కొన్ని ఆఫ్ చేసి ఉన్నాయి. ప్రతీ పోటీదారుల లక్ష్యం వీలైనంత తక్కువ సమయంలో వారి బోర్డ్స్ పై ఉన్న బల్బ్స్ అన్నింటినీ ఆన్ చేయాల్సి ఉంటుంది. సిరి-శ్రీరామ్ ఇద్దరి కోసం కూడా షణ్ముఖ్ గేమ్ ఆడాడు. 

సన్నీ-సిరి అవుట్: ఐదవ ఛాలెంజ్ తరువాత అందరికంటే తక్కువ స్కోర్ ఉన్న ఇద్దరు పోటీదారులు టికెట్ టు ఫినాలే నుంచి తప్పుకోవాల్సిఉంటుందని బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. సన్నీ, సిరిలకు తక్కువ స్కోర్స్ రావడంతో వారిద్దరూ పోటీ నుంచి తప్పుకున్నారు. 

మొదటి ఫైనలిస్ట్ గా శ్రీరామచంద్ర: మొదటి ఫైనలిస్ట్ గా నిలిచేందుకు మానస్, శ్రీరామ్ గేమ్ ఆడాల్సి ఉంటుందని చెప్పి.. ఫైనల్ గేమ్ ఇచ్చారు. గార్డెన్ ఏరియలో పిల్లర్ ఫ్రేమ్స్ ఉన్నాయి.. ఒక్కో లెవెల్ లో ఒక్కో ఫ్రేమ్ ఉంది. పోటీదారులిద్దరూ.. రోప్స్ కి ఉన్న వెయిట్ బ్యాగ్ సహాయంతో రోప్ ని లాగి వదిలేస్తూ.. వారి పిల్లర్ ఫ్రేమ్స్ లోని ఒక్కో లెవెల్ లో ఉన్న బోర్డ్స్ అన్నింటినీ ఒకటి తరువాత ఒకటి పగలగొట్టి.. వెయిట్ బ్యాగ్ అన్ని బోర్డ్స్ ని దాటి చివరి ఫ్రేమ్ కి వెళ్లేలా చేయాల్సి ఉంటుంది. ఈ టాస్క్ ను ఎవరు ముందుగా కంప్లీట్ చేస్తారో వాళ్లు మొదటి ఫైనలిస్ట్ గా ఎంపికవుతారని చెప్పారు. గేమ్ లో మానస్ వెయిట్ బ్యాగ్ పిల్లర్ కి ఇరుక్కుపోవడంతో అతడి కంటే ముందుగా శ్రీరామచంద్ర టాస్క్ ని పూర్తి చేసి మొదటి ఫైనలిస్ట్ గా ఎంపికయ్యాడు. 

Also Read: కంగ్రాట్స్ బాలా బాబాయ్... అబ్బాయ్ ట్వీట్ చూశారా? మహేష్ కూడా!

Also Read: 'అఖండ' రివ్యూ: జాతర... బాలకృష్ణ మాస్ జాతర!

Also Read: ‘ఒమిక్రాన్’ ఇది వైరస్ కాదు 1963లో విడుదలైన సినిమా.. ట్విస్ట్ ఏమిటంటే...

Also Read: సెట్స్‌కు వ‌చ్చిన మెగాస్టార్‌... నెర్వ‌స్‌లో డైరెక్ట‌ర్‌

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Bigg Boss 5 Telugu Bigg Boss 5 manas Shanmukh Siri Sunny sreeramachandra Bigg Boss 5 Telugu Episode 90 Highlights

సంబంధిత కథనాలు

షన్ముఖ్, దీప్తి బ్రేకప్‌పై స్పందించిన సిరి.. డిప్రషన్‌లోకి వెళ్లిపోయా!

షన్ముఖ్, దీప్తి బ్రేకప్‌పై స్పందించిన సిరి.. డిప్రషన్‌లోకి వెళ్లిపోయా!

Deepthi Sunaina: ఏడిస్తే కష్టం పోతుందా? - దీప్తి సునయన లేటెస్ట్ పంచ్! బ్రేకప్ బాధ నుంచి బయటకొస్తోందా? 

Deepthi Sunaina: ఏడిస్తే కష్టం పోతుందా? - దీప్తి సునయన లేటెస్ట్ పంచ్! బ్రేకప్ బాధ నుంచి బయటకొస్తోందా? 

Bigg Boss Telugu OTT: ‘బిగ్ బాస్’ ప్రేక్షకులకు బ్యాడ్ న్యూస్.. ‘ఓటీటీ’ సీజన్‌పై ఒమిక్రాన్ ఎఫెక్ట్

Bigg Boss Telugu OTT: ‘బిగ్ బాస్’ ప్రేక్షకులకు బ్యాడ్ న్యూస్.. ‘ఓటీటీ’ సీజన్‌పై ఒమిక్రాన్ ఎఫెక్ట్

Deepthi Sunaina: షణ్ముఖ్ తో బ్రేకప్.. లైవ్ లోనే ఏడ్చేసిన దీప్తి సునయన..

Deepthi Sunaina: షణ్ముఖ్ తో బ్రేకప్.. లైవ్ లోనే ఏడ్చేసిన దీప్తి సునయన..

Srihan: దీప్తి బ్రేకప్ స్ట్రాటజీ.. సిరి బాయ్ ఫ్రెండ్ ఫాలో అవుతాడా..?

Srihan: దీప్తి బ్రేకప్ స్ట్రాటజీ.. సిరి బాయ్ ఫ్రెండ్ ఫాలో అవుతాడా..?
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Weather Updates: రెయిన్ అలర్ట్.. ఏపీ, తెలంగాణలో నేడు ఓ మోస్తరు వర్షాలు.. పెరుగుతున్న చలి తీవ్రత

Weather Updates: రెయిన్ అలర్ట్.. ఏపీ, తెలంగాణలో నేడు ఓ మోస్తరు వర్షాలు.. పెరుగుతున్న చలి తీవ్రత

Gold-Silver Price: నేటి పసిడి, వెండి ధరల్లో ఊహించని పరిణామం.. ఇవాళ ధరలు ఇలా..

Gold-Silver Price: నేటి పసిడి, వెండి ధరల్లో ఊహించని పరిణామం.. ఇవాళ ధరలు ఇలా..

Petrol-Diesel Price, 18 January: నేడు చాలా చోట్ల నిలకడగా పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇక్కడ ఇంకా స్థిరంగానే.. తాజా రేట్లు ఇలా..

Petrol-Diesel Price, 18 January: నేడు చాలా చోట్ల నిలకడగా పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇక్కడ ఇంకా స్థిరంగానే.. తాజా రేట్లు ఇలా..

Horoscope Today 18th January 2022: మంగళవారం ఏ రాశులపై హనుమంతుడి అనుగ్రహం ఉందో తెలుసుకోండి..

Horoscope Today 18th January 2022: మంగళవారం ఏ రాశులపై హనుమంతుడి అనుగ్రహం ఉందో తెలుసుకోండి..