News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Bigg Boss 5 Telugu: సిగ్గుతో తలదించుకున్న రవి.. తట్టుకోలేక ఏడ్చేసిన ప్రియా.. ఈ వారం నామినేషన్స్ లో ఉన్నది వీళ్లే.. 

బిగ్ బాస్ సీజన్ 5 నాలుగో వారంలోకి ఎంటర్ అయింది.

FOLLOW US: 
Share:

బిగ్ బాస్ సీజన్ 5 నాలుగో వారంలోకి ఎంటర్ అయింది. సోమవారం ఎపిసోడ్ లో నామినేషన్ ప్రక్రియ జరిగింది. అంతకంటే ముందు రవి, షణ్ముఖ్, సిరి కూర్చొని మాట్లాడుకున్నారు. ''అసలు నేను అలా ఎలా మాట్లాడానో.. ఏదో ట్రాన్స్ లో మాట్లాడేశాను.. ఒక మనిషి లేనప్పుడు వాళ్ల గురించి ఎలా మాట్లాడాను..? పైగా అమ్మ మీద ఒట్టు పెట్టి అనలేదని చెప్పాను..'' అంటూ షణ్ముఖ్, సిరిల వద్ద చెప్పుకుంటూ బాధపడ్డాడు యాంకర్ రవి. 'టైమ్ తో అన్నీ అవే సెట్ అవుతాయని' షణ్ముఖ్ అనగా.. 'ముందు మనల్ని మనం క్షమించుకోగలగాలి.. ఆ తరువాత అవతలి వాళ్ల గురించి ఆలోచించాలి' అంటూ రవి అన్నాడు. 

Also Read: అవకాశాల పేరుతో అమ్మాయిని మోసం చేస్తే.. మీరేం చేశారు..? పవన్ పై పోసాని వ్యాఖ్యలు

''నువ్ అంటే నాకు ఇష్టం.. నేను నీకు ఎలా కనెక్ట్ అయ్యానో అర్ధం కావట్లేదు.. ఇప్పుడు గేమ్ ఆడదాం.. హౌస్ నుంచి బయటకు వెళ్లిన తరువాత డిస్కస్ చేద్దామని అనుకుంటున్నా'' అంటూ శ్రీరామ్ తో చెప్పింది హమీద. 

నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఇంటి సభ్యులు నామినేట్ చేయాలనుకుంటున్న ఇంటి సభ్యులంతా తమ ఫోటో స్టాండుల వెనుక నిల్చున్నారు. నామినేట్ చేయాలనుకునేవారు ఆ ఫోటోలోని ఓ ముక్కను తీసి నామినేట్ చేయాలి.

  • ప్రియా - లోబో, సన్నీలను ను నామినేట్ చేస్తూ.. కొన్నిరోజులుగా వారిద్దరూ తనతో సరిగ్గా ఉండడం లేదని కారణం చెప్పింది. 
    విశ్వ - రవిని నామినేట్ చేస్తూ.. కెప్టెన్సీ టాస్క్ లో తనకు సపోర్ట్ చేస్తానని చెప్పి సరిగ్గా చేయలేదని రీజన్ చెప్పాడు. 'హైదరాబాద్ అమ్మాయి.. అమెరికా అబ్బాయ్' టాస్క్ లో నటరాజ్ బయట విషయాలను తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడారంటూ నామినేట్ చేశాడు.
  • లోబో - ప్రియాను నామినేట్ చేస్తూ.. తన లవ్ స్టోరీ గురించి చెబుతుంటే ఏదో సినిమాలా ఉందంటూ ప్రియ కామెంట్ చేసిందని.. అది చాలా బాధించిందని చెప్పాడు లోబో. ప్రియా మాట్లాడబోతుంటే 'నన్ను మాట్లాడనీ' అంటూ పెద్దపెద్దగా అరిచాడు. నీ అరుపుకు నేను భయపడనని సమాధానమిచ్చింది ప్రియ. ఆ తరువాత లోబో తన ప్రేమను గుర్తుచేసుకొని ఎమోషనల్ అవుతూ ఏడ్చేశాడు. రవి వెళ్లి లోబోను ఓదార్చే ప్రయత్నం చేశాడు. 'మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఇంకోటి మాట్లాడొద్దు లోబో' అని ప్రియ అంది. ఆ తరువాత సిరిని నామినేట్ చేస్తూ.. కాజల్ తన లవ్ స్టోరీ చెబుతున్నప్పుడు సిరి తనకు ఆకలేస్తుందని చెప్పిందని.. ఆమె స్టోరీ చెప్పినప్పుడు వినాలి కానీ పక్కవాళ్ల గురించి మాత్రం పట్టించుకోదన్నట్లుగా రీజన్ చెప్పి నామినేట్ చేశాడు. ఇంతలో సిరి తనకు నిజంగానే ఆకలేసిందని.. అందుకే చెప్పానని బదులిచ్చింది.  లోబో తనపై అరవడం తట్టుకోలేకపోయిన ప్రియా వెక్కి వెక్కి ఏడ్చేసింది. హౌస్ మేట్స్ ఆమెని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు.
  • శ్రీరామచంద్ర - శ్వేతాను నామినేట్ చేస్తూ.. లాస్ట్ వీక్ లో చిన్న పాయింట్ తీసుకొని తనను నామినేట్ చేసిందని.. ఆ విషయం తనకు నచ్చలేదని రీజన్ చెప్పాడు శ్రీరామచంద్ర.  నామినేషన్ లో అబ్బాయిలు స్ట్రాంగ్ అని రీజన్ చెప్పి నామినేట్ చేయడం కరెక్ట్ కాదని, బిగ్ బాస్ హౌస్ లో అందరూ ఈక్వల్ అంటూ యానీ మాస్టర్ ను నామినేట్ చేశాడు.
  • షణ్ముఖ్ - రవిని నామినేట్ చేస్తూ.. గేమ్ పరంగా మీ వల్ల బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నానని రీజన్ చెప్పాడు. ఆ తరువాత లోబోని నామినేట్ చేస్తూ ప్రియా గారితో ప్రవర్తించిన తీరు బాలేదని చెప్పగా.. 'నేను చిన్న బస్తీలో ఉంటా.. బస్తీ లైఫ్ స్టైల్ వేరు.. విల్లాస్ లైఫ్ స్టైల్ వేరు' అని లోబో.. షణ్ముఖ్ కి చెబుతుండగా.. 'అందరూ కిందనుంచే వచ్చారు.. ప్రతిసారి కింద నుంచి వచ్చా.. బస్తీ నుంచి వచ్చా అని చెప్పొద్దు అది తప్పు' అని షణ్ముఖ్ ఫైర్ అయ్యాడు.
  • కాజల్ - నటరాజ్ ని నామినేట్ చేస్తూ.. 'నామినేషన్స్ ని బాగా హార్ట్ కి తీసుకుంటున్నారని' రీజన్ చెప్పింది. ఆ తరువాత సన్నీను నామినేట్ చేసింది.
  • సిరి - యానీ మాస్టర్ ని ముందుగా నామినేట్ చేసింది. లోబోని నామినేట్ చేస్తూ.. ఆయన ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు.. తన కామెడీ అప్పుడప్పుడు లిమిట్స్ కూడా క్రాస్ అవుతుంది.. అదే పని వేరేవాళ్లు చేస్తే తట్టుకోలేరని రీజన్ చెప్పింది.
  • మానస్ - లోబోని నామినేట్ చేస్తూ హౌస్ లో ఫౌల్ లాంగ్వేజ్ వాడుతున్నారని రీజన్ చెప్పాడు. ఆ తరువాత నటరాజ్ మాస్టర్ ని నామినేట్ చేస్తూ 'మీకు ప్రాబ్లమ్ ఉంటే నాతో చెప్పేయండి.. అంతేతప్ప నన్ను గిల్లి గిచ్చి వదిలేయొద్దు' అని అన్నాడు
  • శ్వేతా - లోబోని నామినేట్ చేస్తూ.. విమెన్ ని రెస్పెక్ట్ చేస్తానని చెప్పి ప్రియా గారితో సరిగ్గా బిహేవ్ చేయలేదని రీజన్ చెప్పింది. టాస్క్ లు బాగానే ఆడుతున్నారు కానీ హౌస్ యాక్టివిటీస్ లో సరిగ్గా ఉండడం లేదని రీజన్ చెప్పింది.
  • హమీద - లోబోని నామినేట్ చేసింది. ఆ తరువాత నటరాజ్ మాస్టర్ ని నామినేట్ చేస్తూ.. కిచెన్ లో తనను పని చేయనివ్వడం లేదని రీజన్ చెప్పింది.
  • నటరాజ్ - 'విశ్వ మనం గేమ్ ఆడాలి కానీ అతిగా నటించకూడదు.. నువ్ ఇప్పుడు నాకు స్ట్రాంగ్ అని కూడా అనిపించడం లేదంటూ' విశ్వని నామినేట్ చేయగా.. విశ్వ-నటరాజ్ మాస్టర్ ల మధ్య కాసేపు మాటల యుద్ధం నడిచింది. 'సింహంతో వేట నాతో ఆట రెండూ ప్రమాదమే' అంటూ సినిమా డైలాగులు కొట్టారు నటరాజ్ మాస్టర్. 'అవన్నీ నీ దగ్గర పెట్టుకో' అంటూ విశ్వ కోపంగా చెప్పాడు. ఆ తరువాత రవిని నామినేట్ చేశారు నటరాజ్ మాస్టర్.
  • ప్రియాంక - లోబోని నామినేట్ చేస్తూ.. తనను తప్పుగా ముట్టుకున్న విషయాన్ని రీజన్ గా చెప్పింది. ఆ తరువాత కాజల్ ని నామినేట్ చేసింది.
  • రవి - ''మీ అందరి ముందు తలెత్తుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది. శనివారం నా జీవితంలో వరస్ట్ డే అని చెప్పాలి. ఈ విషయంలో ముగ్గురికి సారీ చెప్పాలి.. ఒకరు ప్రియా, రెండు లహరి, ఇంకొకరు మా అమ్మకు. ఎంత దారుణమంటే నేను మీకే(ప్రియా) చెప్పిన మాట.. చెప్పలేదని మా అమ్మ మీద ఒట్టేశా.. ఓ మగాడు అలా మాట్లాడకూడదు కానీ మాట్లాడాను.. లహరి వెళ్లిపోయినందుకు బాధగా ఉంది. ఆమె ఉంటే కచ్చితంగా సాల్వ్ చేసుకునేవాడిని' అని చెప్పాడు. ఆ తరువాత కాజల్ ని నామినేట్ చేశాడు. ఆ తరువాత నటరాజ్ మాస్టర్ ని నామినేట్ చేస్తూ.. 'గుంటనక్క నన్ను హాంట్ చేస్తుంది.. ఇక్కడున్న వారందరికీ తెలుసు మీరు నన్ను ఉద్దేశించే అన్నారని..' అంటూ రీజన్ చెప్పాడు.  
  • యానీ మాస్టర్ - హౌస్ లో స్ట్రాంగ్ గా ఉన్నవాళ్లను, నన్ను నామినేట్ చేసినవాళ్లనే నేను నామినేట్ చేస్తానని చెప్పి.. శ్రీరామచంద్ర, సిరిలను నామినేట్ చేసింది.
  • సన్నీ - తనను సేఫ్ గేమ్ ఆడుతున్నాడని అంటున్నారని ప్రియా, కాజల్ లను నామినేట్ చేశాడు.
  • జెస్సీ - బిగ్ బాస్ రూల్స్ ను  ప్రియాంక సరిగ్గా ఫాలో అవ్వడం లేదని ఆమెని నామినేట్ చేశాడు. ఆ తరువాత రవిని నామినేట్ చేశాడు.

ఈ వారం నామినేట్ అయిన సభ్యులు నటరాజ్, లోబో, రవి, ప్రియా, కాజల్, సిరి, సన్నీ, యానీ. 

Also Read: ఓటీటీలో 'భీమ్లా నాయక్'.. క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్..

Also Read: పవన్ ‘మా’ సభ్యుడే.. ఎన్నికల్లో రాజకీయ జోక్యం వద్దు: ప్రకాష్ రాజ్

 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Published at : 27 Sep 2021 11:21 PM (IST) Tags: Bigg Boss 5 Telugu Bigg Boss 5 anchor ravi Shanmukh Lobo Priya Nataraj

ఇవి కూడా చూడండి

Bigg Boss Promo: బ్యాంక్ గా మారిన బిగ్ బాస్ హౌస్- నాలుగో పవర్ అస్త్ర కోసం పోటీ!

Bigg Boss Promo: బ్యాంక్ గా మారిన బిగ్ బాస్ హౌస్- నాలుగో పవర్ అస్త్ర కోసం పోటీ!

Bigg Boss Season 7 Day 22 Updates: చెల్లి, అక్కా అని పిలుస్తా, నీ పేరు ఎత్తితే చెప్పుతో కొట్టు - రతికతో పల్లవి ప్రశాంత్ లొల్లి

Bigg Boss Season 7 Day 22 Updates: చెల్లి, అక్కా అని పిలుస్తా, నీ పేరు ఎత్తితే చెప్పుతో కొట్టు - రతికతో పల్లవి ప్రశాంత్ లొల్లి

Bigg Boss Sivaji: ‘బిగ్ బాస్’ హౌస్‌కు శివాజీ గెస్టా? ఆడేది తక్కువ అజమాయిషీ ఎక్కువ - పిల్ల గ్యాంగ్‌తో మైండ్ గేమ్!

Bigg Boss Sivaji: ‘బిగ్ బాస్’ హౌస్‌కు శివాజీ గెస్టా? ఆడేది తక్కువ అజమాయిషీ ఎక్కువ - పిల్ల గ్యాంగ్‌తో మైండ్ గేమ్!

Bigg Boss Season 7 Telugu Day 22 Updates: శోభాశెట్టిపై గౌతమ్ అసభ్యకర సైగలు? పల్లవి ప్రశాంత్ చెప్పింది నిజమేనా? ఆ రోజు ఏం జరిగింది?

Bigg Boss Season 7 Telugu Day 22 Updates: శోభాశెట్టిపై గౌతమ్ అసభ్యకర సైగలు? పల్లవి ప్రశాంత్ చెప్పింది నిజమేనా? ఆ రోజు ఏం జరిగింది?

Bigg Boss Season 7: శుభశ్రీపై టిష్యూ విసిరేసిన అమర్‌దీప్ - ఆమె స్థానంలో ప్రియాంక ఉంటే?

Bigg Boss Season 7: శుభశ్రీపై టిష్యూ విసిరేసిన అమర్‌దీప్ - ఆమె స్థానంలో ప్రియాంక ఉంటే?

టాప్ స్టోరీస్

ACB Court Case : అక్టోబర్ నాలుగో తేదీకి ఏసీబీ కోర్టులో విచారణలు వాయిదా - కస్టడీ, బెయిల్ పిటిషన్లూ అప్పుడే !

ACB Court Case : అక్టోబర్ నాలుగో తేదీకి ఏసీబీ కోర్టులో విచారణలు వాయిదా - కస్టడీ, బెయిల్ పిటిషన్లూ అప్పుడే !

IND vs AUS 3rd ODI: చితక్కొట్టిన కంగారూలు! టీమ్‌ఇండియా టార్గెట్‌ 353

IND vs AUS 3rd ODI: చితక్కొట్టిన కంగారూలు! టీమ్‌ఇండియా టార్గెట్‌ 353

Oscars 2024 - 2018 Movie : బ్రేకింగ్ - ఆస్కార్స్‌కు మలయాళ సినిమా '2018'

Oscars 2024 - 2018 Movie : బ్రేకింగ్ - ఆస్కార్స్‌కు మలయాళ సినిమా '2018'

Telangana Group 1 : గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు ఖాయం - ప్రభుత్వ అప్పీల్‌ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు !

Telangana Group 1 :    గ్రూప్ 1 ప్రిలిమ్స్  రద్దు ఖాయం   - ప్రభుత్వ అప్పీల్‌ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు !