Bigg Boss 5 Telugu: రాత్రి మూడు గంటలకు హమీద, శ్రీరామ్ ల రిలేషన్ ముచ్చట్లు.. ఫైనల్ గా ఏ రిలేషన్ కి ఫిక్స్ అవుతారో..
బిగ్ బాస్ సీజన్ 5 మూడో వారం నడుస్తోంది.
బిగ్ బాస్ సీజన్ 5 మూడో వారం నడుస్తోంది. ఈరోజు ఎపిసోడ్ లో సిరి, నాతో మాట్లాడు.. నువ్ నాతో మాట్లాడడం లేదనే నేను వేరే వాళ్లతో స్నేహం చేస్తున్నానని చెప్పింది. చేస్తో అని షణ్ముఖ్ అనగా.. వాళ్లు జెన్యూన్ కాదని సిరి చెప్పింది. ఆ తరువాత షణ్ముఖ్ 'ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది బిగ్ బాస్ హౌస్ లో' అంటూ సిరికి చెప్పాడు.
తెల్లవారుజామునే హౌస్ మేట్స్ అందరూ ముదినేపల్లి సాంగ్ కి స్టెప్స్ వేసి అలరించారు. ఆ తరువాత రవి, లోబో, ప్రియాంక కలిసి కామెడీ చేసే ప్రయత్నం చేశారు.
అతికిందంటే అదృష్టమే..
లగ్జరీ బడ్జెట్ టాస్క్ 'అతికిందంటే అదృష్టమే..' అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. టాస్క్ ఆడదానికి వెళ్లేముందు నటరాజ్ మాస్టర్.. ముందు విశ్వను పంపిద్దామని ఆయనకీ ఈ టాస్క్ లో బాగా ఐడియా ఉంటుందని అన్నారు. దీంతో సన్నీ.. యూనిటీ అన్నప్పుడు ఒక పేరు తీయొద్దు మాస్టర్.. అందరూ ఆడగలరు అని అన్నాడు. దానికి నటరాజ్ మాస్టర్.. 'నాకు అనిపించింది చెప్పాను.. ఇక్కడ అందరూ ఆడగలరు.. ఎవరికి వాళ్లు తోపులని ఫీల్ అవుతారు. లాస్ట్ టైమ్ ఏమైనా పీకారా..?(లగ్జరీ బడ్జెట్ టాస్క్ ను ఉద్దేశిస్తూ) అందరూ కలిపి తినాల్సిన ఫుడ్ ఇది.. అందరూ కలిసి పనిచేస్తేనే అవుతుంది' అంటూ సీరియస్ గా చెప్పారు.
మానస్.. హమీదకి ఫుడ్ తినిపిస్తూ.. ''అమ్ము(లహరి) ఏంటో అర్ధం కావడం లేదబ్బా.. చాలా పొసెసివ్ గా బిహేవ్ చేస్తుంది'' అని అన్నాడు. దానికి హమీద 'క్లియర్ చేస్కో.. నాకు మధ్యలో శ్రీరామ్ తో అలానే ఉండేది.. క్లియర్ చేసుకున్నా' అని చెప్పింది. మానస్ అలా హమీదకి ఫుడ్ తినిపిస్తున్నప్పుడు ప్రియాంక వచ్చి చూసింది. ఆమె ముఖకవళికలు మారిపోయాయి.
సన్నీ, లోబో, హమీద, నటరాజ్ మాస్టర్, యానీ కలిసి గేమ్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో నటరాజ్ మాస్టర్ 'గేమ్ ఎలా ఆడాలి, ఏం చేయాలనే బేసిక్ నాలెడ్జ్, సెన్స్ కూడా ఉండదు. ఏమైనా అంటే ప్రొఫెషన్ మీద ఇన్ డైరెక్ట్ డైలాగ్స్. అవి గనుక బయటకొస్తే.. బయటే విరగ్గొట్టేస్తా కాళ్లు' అంటూ ఫైర్ అయ్యాడు. 'ప్రొఫెషన్ మీద ఎవరన్నారు మాస్టర్ అని యానీ, సన్నీ' అడగ్గా.. 'నాకు తెలుసు.. చెప్తా చెప్తా.. నాకు దొంగనాటకాలు రావు. మనిషి ముందు ఒకలాగా, వెనక ఒకలాగా రావు నాకు. ఏదైనా డైరెక్ట్ గా మాట్లాడతా' అని నటరాజ్ మాస్టర్ అన్నాడు. ఈ విషయంలో సన్నీ, నటరాజ్ మాస్టర్ కాసేపు వాదించుకున్నారు.
రవి, సిరి, కాజల్.. ఈసారి ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారో అని మాట్లాడుకున్నారు. సిరి ఇద్దరు 'పి'(ప్రియాంక, ప్రియా)లలో ఎవరో ఒకరు వెళ్తారనిపిస్తుందని చెప్పింది. ఆ తరువాత అందరూ నటరాజ్ మాస్టర్ బిహేవియర్ గురించి మాట్లాడుకున్నారు. ఆయనకి అనుమానం ఎక్కువ అని సిరి అనగా.. సింపతీ కార్డ్ ప్లే చేస్తున్నారని రవి అన్నాడు.
ఆ తరువాత లహరి వెళ్లి విశ్వ, లోబోలతో డిస్కషన్ పెట్టింది. ''టీమ్స్ లాగా డివైడ్ అయిపోయారు.. నేను వెళ్లగానే అప్పటివరకు నవ్వుతున్న వాళ్లు, మాట్లాడుకుంటున్న వాళ్లు సడెన్ గా ఆపేస్తున్నారు. కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది' అని చెప్పింది లహరి.
అనంతరం బిగ్ బాస్.. హౌస్ మేట్స్ అందరి ఏకాభిప్రాయంతో ఈ వారంలో వరస్ట్ పెర్ఫార్మర్ ఎవరో చెప్పమని సూచించారు. ఈ క్రమంలో ఎవరెవరు ఎవరి పేర్లు చెప్పారంటే..
- జెస్సీ- హమీద
- షణ్ముఖ్-మానస్
- హమీద-మానస్
- మానస్-జెస్సీ
- విశ్వ-ప్రియా
- సిరి-మానస్
- కాజల్-మానస్
- యానీ-సన్నీ
- నటరాజ్-మానస్
- శ్వేతా-నటరాజ్ మాస్టర్
- సన్నీ-షణ్ముఖ్
- రవి-షణ్ముఖ్
- లహరి-ప్రియా
- శ్రీరామ్-మానస్
ఎక్కువ మంది మానస్ పేరు చెప్పడంతో బిగ్ బాస్ అతడిని జైల్లో పెట్టమని చెప్పారు. ఇది చూసిన విశ్వ.. 'ఫస్ట్ టైమ్ ఒక మనిషి జైలుకి వెళ్తుంటే నేను అసలు హ్యాపీగా లేను. అది తప్పు అసలు' అంటూ శ్వేతాకి చెప్పాడు.
ఆ తరువాత జైల్లో ఉన్న మానస్ దగ్గరకు వెళ్లిన ప్రియాంక.. 'మరి ఇప్పుడు నువ్ జైలులో ఉన్నావ్ గా.. హమీదకి ఎవరు తినిపిస్తారు' అంటూ అతడిని ఆటపట్టించింది. ''నేనైతే ఒక్కోసారి జెలస్ ఫీల్ అవుతా.. నువ్ అసలు పట్టించుకోకు' అంటూ మానస్ కి చెప్పింది. 'హమీదకి తినిపిస్తుంటే ఆ కోతి మొహం దానికి అవసరమా..? అంటున్న అంతే' అంటూ ప్రియాంక మాట్లాడుతుండగా..'హమీద నా ఫ్రెండ్ అంతే.. సిస్టర్ అని అనమంటావా చెప్పు అనేస్తా' అన్నాడు మానస్. వద్దులే.. ఫ్రెండ్ ఫ్రెండ్ గానే ఉండాలని చెప్పింది ప్రియాంక. 'అవసరమైతే శ్రీరామ్ కి రాఖీ కడతా.. కానీ నీకు మాత్రం రాఖీ కట్టను' అని ప్రియాంక చెబుతుంటే నవ్వేశాడు మానస్.
అనంతరం హౌస్ లో బిడ్డ ఏడుపు వినిపించగా.. ఎక్కడ నుంచి ఏడుపు వినిపిస్తుందా అని అందరూ పరుగులు తీశారు. ఆ తరువాత బిగ్ బాస్ టీవీలో నటరాజ్ మాస్టర్ భార్యకు జరిగిన సీమంతాన్ని చూపించారు. అది చూసిన నటరాజ్ మాస్టర్ ఎమోషనల్ అయ్యాడు. కన్నీళ్లు పెట్టుకుంటూ టీవీలో కనిపించిన తన భార్యను ముద్దాడారు.
రాత్రి మూడు గంటలకు శ్రీరామచంద్ర, హమీద కలిసి కిచెన్ రూమ్ లో ముచ్చట్లు పెట్టారు. తనకు ఎందుకు ఫుడ్ తినిపించలేదని శ్రీరామ్.. హామీదను అడిగాడు. ఫ్రెండ్స్ కి తినిపించరా..? అని ఆమెని అడిగాడు.. మానస్ నీకు తినిపిస్తాడు కదా.. నువెందుకు నాకు తినిపించవ్ అని అడగ్గా.. 'నేను నీతో మాట్లాడే విధానం, చూసే విధానం వేరేలా ఉంటుంది. మానస్, సన్నీలను ఫ్రెండ్స్ లానే చూస్తాను.. నీకు అది తెలియడం లేదా..?' అని ప్రశ్నించింది హమీద. 'నేను అంత గమనించను' అని శ్రీరామ్ బదులిచ్చాడు. 'కొన్ని సార్లు నువ్ అర్ధమవుతావ్ కొన్నిసార్లు అర్ధం కావు.. ఇలా కనెక్ట్ అవుతావ్.. వెంటనే డిస్ కనెక్ట్ అవుతావ్..' అంటూ కంప్లైంట్ చేసింది హామీద. దానికి శ్రీరామ్.. 'నీకు మానస్ కి ఒక డెఫినిషన్ ఉంది అది ఫ్రెండ్ షిప్. కానీ నీకు నాకు మధ్య ఆ డెఫినిషన్ లేదు. ఫ్రెండ్ కంటే ఎక్కువ కావొచ్చు, తక్కువ కావొచ్చు. నీది, నాది క్వశ్చన్ మార్క్ జోన్ లో ఉంది ప్రస్తుతానికి' అంటూ చెప్పగా.. హమీద నవ్వేసింది.
Also Read: లవ్‌స్టోరీ సమీక్ష: గుండె బరువెక్కించే సందేశం.. ప్రేమకథ రూపంలో..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి