Bigg Boss 5 Telugu: ఫైనల్ గా కెప్టెన్ అయిన యానీ మాస్టర్.. మండిపడ్డ సిరి..
ఈ వారం కెప్టెన్సీ టాస్క్ కోసం 'చిక్కకు దొరకకు' అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాక్స్ లో ఎవరు గెలిచారంటే..?
బిగ్ బాస్ సీజన్ 5లో రెండు రోజులుగా కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ జరుగుతోంది. ఈ టాస్క్ లో హౌస్ మేట్స్ ఒకరినొకరు టార్చర్ చేసుకుంటూ కనిపిస్తున్నారు. ఈరోజు కూడా ఈ టాస్క్ కొనసాగిస్తున్నారు. ముందుగా బిగ్ బాస్ సభ్యులకు ఓ టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ లో సూపర్ హీరోస్ టీమ్ విజేతలుగా నిలిచింది.
మొత్తానికి సూపర్ హీరోస్ వర్సెస్ సూపర్ విలన్స్ టాస్క్ లో ఫైనల్ గా సూపర్ విలన్స్ విజేతలుగా నిలిచారు. దీంతో సూపర్ విలన్స్ టీమ్ కి హౌస్ మేట్స్ కి కంగ్రాట్స్ చెప్పారు. ప్రియాంక వెళ్లి జెస్సీకి విష్ చేస్తుండగా.. జెస్సీ సడెన్ గా ఆమెకి ముద్దు పెట్టేశాడు.
ఇక ఉదయాన్నే మానస్-ప్రియాంక-కాజల్ మాట్లాడుకున్నారు. మానస్.. ప్రియాంకను సిస్టర్ అంటూ కాసేపు ఏడిపించాడు. ఆ తరువాత సిరి-ప్రియాంక బెడ్ పై కూర్చొని మాట్లాడుకున్నారు. 'ఎంతవరకు వచ్చింది మీ ఇద్దరి లవ్' అంటూ ప్రియాంకను అడిగింది. దానికి ఆమె తెగ సిగ్గుపడిపోయింది. మానస్ కి కూడా ఇష్టమే అంట కదా అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది సిరి. దానికి ప్రియాంక మెల్లగా.. 'ఒప్పుకున్నాడు.. నేనేంటో తనకు తెలుసు' అంటూ చెప్పింది.
Also Read: యాక్సిడెంట్ తరువాత తేజు ఫస్ట్ పిక్..
ప్రియాంక హగ్.. సన్నీ కౌంటర్..
ఆ తరువాత ప్రియాంక వెళ్లి మానస్ తో నవ్వుతూ మాట్లాడుతుండగా.. 'మచ్చా అక్కడేం జరుగుతుందని' సన్నీ.. కాజల్ ని అడిగాడు. దానికి ఆమె 'ప్రేమించుకుంటున్నారు' అని బదులిచ్చింది. ఆ వెంటనే ప్రియాంక.. మానస్ ని కౌగిలించుకుంది. అది చూసిన సన్నీ 'ప్రేమించుకుంటున్నారా..? ఇంత పబ్లిక్ గానా..?' అంటూ కామెంట్ చేశాడు.
చిక్కకు దొరకకు..
కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా 'చిక్కకు దొరకకు' అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో భాగంగా కెప్టెన్సీ పోటీదారులపై మిగిలిన ఇంటి సభ్యులు బాల్స్ విసురుతూ ఉంటారు. ఎవరికైతే తక్కువ బాల్స్ అతుక్కుంటాయో వాళ్లు కెప్టెన్ అని ప్రకటించారు. ఈ టాస్క్ లో యానీ మాస్టర్ విన్నర్ గా గెలిచారు.
షణ్ముఖ్ పై సిరి ఫైర్..
అయితే షణ్ముఖ్ తనపై ఎక్కువ బాల్స్ వేశాడని సిరి కోప్పడింది. 'నువ్ ఫేక్' అంటూ షణ్ముఖ్ ని ఉద్దేశిస్తూ కొన్ని మాటలు అనేసింది. 'లోపల ఒకటి పెట్టుకుంటావ్.. బయటకి ఒకలా ఉంటావ్' అంటూ షణ్ముఖ్ ని ఉద్దేశిస్తూ కామెంట్ చేసింది. 'వాడు(జెస్సీ), నేను తెలియక చేసినదానికి ఎంత రచ్చ చేశావ్ షన్ను నువ్వు.. ఇప్పుడు దానికి డబుల్ బాధపడుతున్నా నేను' అంటూ వెక్కి వెక్కి ఏడ్చేసింది. ఆ తరువాత షణ్ముఖ్ 'అరె ఇండివిడ్యుయల్ గేమ్ ఆడమంటారు.. మీరు ఆడతారు.. నేను ఆడితే మీకేంట్రా నొప్పి.. ఎవడి గేమ్ వాడు ఆడాడు' అంటూ జెస్సీతో చెప్పాడు.
సిరితో క్లోజ్ అవ్వడానికి షణ్ముఖ్ ప్రయత్నించినా.. ఆమె దగ్గరకు రానివ్వలేదు. ఆ తరువాత రవి, సన్నీ, విశ్వ కూర్చొని సిరితో మాట్లాడుతున్నారు. సన్నీ.. షణ్ముఖ్ గురించి సిరితో మాట్లాడుతుండగా.. రవి కల్పించుకొని 'ఒరేయ్ వాళ్లిద్దరి మధ్యలోకి వెళ్లకు. తరువాత ఇద్దరూ కలిసిపోతారు. మనం ఎదవలం అయిపోతాం.. హౌస్ లోకి వచ్చినప్పటి నుంచి నేనొక పాతిక సార్లు అయ్యి ఉంటాను' అంటూ కామెడీ చేశాడు. ఆ తరువాత జెస్సీ.. సన్నీతో డిస్కషన్ పెట్టాడు. షణ్ముఖ్ తనకు సపోర్ట్ చేయకపోవడంతో జెస్సీ హర్ట్ అయ్యాడు. ఫ్రెండ్ గా నువ్ సపోర్ట్ చేయకు కానీ వెన్నుపోటు పొడవకూడదు అంటూ షణ్ముఖ్ ని ఉద్దేశిస్తూ.. సన్నీతో చెప్పాడు.
Also Read: 'నేను ఆడితే మీకేంట్రా నొప్పి'.. షణ్ముఖ్ ఫైర్.. ఏడ్చేసిన సిరి..