News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Bigg Boss 5 Telugu: సన్నీ ఎమోషనల్ జర్నీ.. కన్నీళ్లు ఆగవు..

ఈ వారంతో బిగ్ బాస్ షో పూర్తి కాబోతుంది. దీంతో టాప్ 5 కంటెస్టెంట్స్ జర్నీను వాళ్లకు చూపించాలని నిర్ణయించుకున్నారు బిగ్ బాస్.

FOLLOW US: 
Share:

ఈ వారంతో బిగ్ బాస్ షో పూర్తి కాబోతుంది. దీంతో టాప్ 5 కంటెస్టెంట్స్ జర్నీను వాళ్లకు చూపించాలని నిర్ణయించుకున్నారు బిగ్ బాస్. ఇప్పటికే శ్రీరామ్, మానస్ ల జర్నీ చూపించగా.. ఈరోజు ఎపిసోడ్ లో ముందుగా షణ్ముఖ్ జర్నీను చూపించారు. 

ఎన్ని గొడవలైనా.. చివరిదాకా ఒకటిగానే ఉన్నారు..: ''ఈ తరం వారికి ముఖ్యంగా సోషల్ మీడియా ఉపయోగించే యువత అందరికీ షణ్ముఖ్ జస్వంత్ అనే పేరు ఎంతో సుపరిచితం. మీరు ఇంట్లోకి వచ్చిన రోజు నుంచి ప్రతిఒక్కరికీ మీరొక పోటీలా నిలిచారు. ఇది వేరే ప్రపంచం. ఇక్కడ నిజమైన మనుషులు.. వారి విభిన్న వ్యక్తిత్వాలు.. కోపాలు.. గొడవలు.. ప్రేమ.. ప్రతీఒక్కటీ నిక్కచ్చిగా ఉంటాయి. మీలోని కోణాన్ని ఒక్కొక్కటిగా అందంగా ఈ ప్రయాణం బయటకు తీసుకొచ్చింది. అర్ధం చేసుకునే మనుషులు ఉండడం.. మనసుని తేలిక పరచడమే కాక.. ఆటలో ముందుకు వెళ్లేందుకు కావాల్సిన ఉత్సాహాన్ని నింపుతుంది. అలాంటి అర్ధం చేసుకునే స్నేహితులు మీకు ఈ ఇంట్లో దొరికారు. మీ కోపాన్ని, అసహనాన్ని దూదిలాగా పీల్చుకుంటూనే మీలోని నిప్పుని నిరంతరం వెలిగిస్తూ ముందుకు తీసుకొచ్చారు. మీ మనసుకు దగ్గరైన వారితో అభిప్రాయబేధాలు వచ్చిన ప్రతీసారి మీరు మోసిన బరువుని బిగ్ బాస్ గమనించారు. ఈ ఇంట్లో మీకు దగ్గరైన బంధాలు మీకు ఎంత ముఖ్యమో.. మీరు వారికోసం నిలబడ్డ తీరు తెలియజేస్తుంది. వారికోసం ఎంత దూరమైనా వెళ్లడానికి నిర్ణయించుకున్నారు. అందుకే ఎన్ని గొడవలైనా.. చివరిదాకా ఒకటిగానే ఉన్నారు. ఎప్పుడైతే.. మీ మనసులోని భారం తగ్గిందో.. అప్పటినుంచి టాస్క్ లలో పట్టుదల చూపి, బుద్ధిబలం ఉపయోగించి ఇంటి కెప్టెన్ అవ్వడమే కాకుండా.. అందరితో బ్రహ్మ అనిపించుకున్నారు. షణ్ముఖ్ ఈ ఇంట్లో మీకిష్టమైన చోటు మోజ్ రూమ్ అని బిగ్ బాస్ కి తెలుసు. అక్కడ మీరు ఒంటరిగా గడిపిన క్షణాలు.. మీలోని కోపం, బాధ మరియు ప్రేమ అన్నింటినీ ఆ గది చూసింది. ఒక్కో వారం మీ చుట్టూ ఉన్న మనుషులను, వారి ఆటను అంచనా వేస్తూ.. మీదైన శైలిలో కామ్ అండ్ కంపోజ్డ్ గా ఆటను ముందుకు తీసుకెళ్తూ వచ్చారు. మీ తీరులో ఆటను ఒక్కో లెవెల్ దాటించి ఫినాలే వరకు తీసుకొచ్చారు. మీ ఎన్నో జ్ఞాపకాలు మోసిన ఈ ఇంట్లో ఇప్పటివరకు సాగిన మీ ప్రయాణం ఒకసారి చూద్దాం'' అని అతడి జర్నీని వీడియో రూపంలో చూపించారు బిగ్ బాస్. వీడియో చూసిన షణ్ముఖ్ ఎమోషనల్ అయ్యాడు. 

ఆ తరువాత సన్నీని గార్డెన్ ఏరియాకి రమ్మని పిలిచారు బిగ్ బాస్. హౌస్ లో సన్నీ మెమొరీస్ కి సంబంధించిన ఫొటోలన్నీ వేర్వేరు ప్లేసెస్ లో ఎరేంజ్ చేశారు బిగ్ బాస్. కొన్ని ఫొటోలు ఫన్నీగా ఉండడంతో సన్నీ నవ్వుకున్నాడు. అలానే ఓ చోట కేక్ ముక్కను కూడా ఉంచారు బిగ్ బాస్. దాన్ని తీసుకొని స్మెల్ చూసిన సన్నీ.. 'వెయిట్ ఫర్ ది క్లైమాక్స్' అని డైలాగ్ కొట్టాడు. ఆ తరువాత చెట్టుకి వేలాడుతూ ఉన్న కోతి బొమ్మను చూస్తూ.. 'ఓ కాజల్ ఎట్లున్నావ్.. బాగున్నావా..?' అని ఫన్ చేశాడు. ఆ తరువాత తన తల్లితో ఉన్న ఫొటోను తీసుకొని ముద్దాడుతూ.. 'కళావతి టాప్ 5 లో ఉన్నా.. జస్ట్ ఒక్క అడుగు' అని అన్నాడు.

సన్నీ.. మీ సమయమొచ్చేసింది..: ''సరదా.. సన్నీ రెండూ ఒకే అక్షరంతో మొదలవుతాయని బిగ్ బాస్ ఇంట్లోకి మీరు అడుగుపెట్టిన మొదటిరోజు నుంచి ఈ షో చూస్తున్న అందరికీ మీరు గుర్తుచేశారు. ఈ ఇంట్లో మీరు కోరుకున్న బంధాలు.. మిమ్మల్ని కోరుకునే స్నేహితులు గెలిచిన ఆటలు, జరిగిన గొడవలు, మోసిన నిందలు, చేసిన వినోదం.. ఇలా మీరు పోగుచేసుకున్నవి ఎన్నో జ్ఞాపకాలు. అన్నీ కలిపి మిమ్మల్ని మీరు ఒక కొత్త మనిషిలా అందరి మొహంపై నవ్వు తీసుకొచ్చి ఎంటర్టైనర్ గా అందరి మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. మీవాళ్ల కోసం మీరు నిలబడ్డ తీరు.. మిమ్మల్ని వారు ఇష్టపడ్డా.. లేకపోయినా ప్రతీ ఒక్కరినీ మీలోని స్నేహితుడు పలకరించాడు. ఈ ప్రయాణం మీకు సులువుగా మొదలవ్వలేదు. ప్రారంభంలోనే మీ కోసం మీకు ఇబ్బందులను తీసుకొచ్చినా.. ఒక్కొక్క రోజు మిమ్మల్ని మీరు మార్చుకుంటూ ముందుకు సాగారు. అందరిముందు ఒక దోషిలా నిలబడ్డ క్షణాలు.. మీ మనసుని ఎంతో బరువుగా చేసిన విషయం బిగ్ బాస్ గమనించారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా.. ఎటువంటి జంకు లేకుండా మీతో వచ్చేవారిని కలుపుకొని ఆ క్షణం నుంచి ఇప్పటివరకు ఓర్పుతో అందరినీ సంతోషపరచడానికే ప్రయత్నించారు. ప్రతీమనిషిలో ఉండే అన్ని భావాలు సమంగా ఉన్నప్పుడే మనిషి పరిపూర్ణుడవుతాడు. మీకోపం, మీ ప్రేమ, మీ వినోదం, మీ విలాపం.. ఉన్నది ఉన్నట్టుగా అందరితో పంచుకునే తీరు మిమ్మల్ని అందరూ మరింత ప్రేమించేలా చేసింది. ప్రతీ టాస్క్ లో గెలవాలనే మీ తపన, గెలిచేవరకు పోరాడే పట్టుదల ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడినా.. మీ ఓర్పుకి కోల్పోని తత్వమే మిమ్మల్ని ఇక్కడవరకు తీసుకొచ్చింది. ఒంటరిగా వచ్చే మనిషికి కొంచెం ప్రేమను సంపాదించుకోవడం కన్నా.. పెద్ద విజయం ఏదీ లేదని మీరు సాగించిన ప్రయాణమే మళ్లీ రుజువు చేస్తోంది. సన్నీ.. మీరు వెతుకుతున్న స్వప్న సుందరి కూడా మీకు త్వరలోనే దొరకాలని బిగ్ బాస్ ఆశిస్తున్నారు. అపనా టైం ఆయేగా.. అన్న మీ మాట మిమ్మల్ని ప్రేమించేవారికి గట్టిగా వినిపించింది. సన్నీ.. ఇప్పుడు మీ సమయమొచ్చేసింది'' అంటూ ఓ రేంజ్ లో ఎలివేట్ చేశారు. తన జర్నీ వీడియో చూసిన సన్నీకి కన్నీళ్లు ఆగలేదు. బిగ్ బాస్ కి థాంక్స్ చెబుతూ.. తనను ఈ స్టేజ్ వరకు వచ్చేలా చేసిన ప్రేక్షకులకు శిరస్సు వంచి నమస్కారం చేశాడు. 

Also Read: కొత్త నేలపై 'సంచారి'... 'రాధే శ్యామ్' సినిమాలో కొత్త సాంగ్ టీజర్ వచ్చింది

Also Read: ఇమ్మూ-వర్ష జోడీ వచ్చాక... సుధీర్-రష్మీ జోడీకి క్రేజ్ తగ్గిందా?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి  

Published at : 14 Dec 2021 11:24 PM (IST) Tags: Bigg Boss 5 Telugu Bigg Boss 5 manas Shanmukh Sunny Bigg Boss 5 Telugu 101 Episode Highlights

ఇవి కూడా చూడండి

Bigg Boss 7 Telugu: SPY vs SPA - నువ్వేమైనా ఒలింపిక్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చావా? శోభా నామినేషన్‌కు శివాజీ కౌంటర్

Bigg Boss 7 Telugu: SPY vs SPA - నువ్వేమైనా ఒలింపిక్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చావా? శోభా నామినేషన్‌కు శివాజీ కౌంటర్

Goutham: బయటికి వెళ్లిన తర్వాత ముందుగా శుభశ్రీతో మాట్లాడతా - ఆసక్తికర విషయాలు బయటపెట్టిన గౌతమ్

Goutham: బయటికి వెళ్లిన తర్వాత ముందుగా శుభశ్రీతో మాట్లాడతా - ఆసక్తికర విషయాలు బయటపెట్టిన గౌతమ్

Bigg Boss 7 Telugu: అర్జున్ ఎలిమినేట్ అవ్వాల్సింది కానీ.. అంటూ కంటెస్టెంట్‌కు షాకిచ్చిన నాగార్జున

Bigg Boss 7 Telugu: అర్జున్ ఎలిమినేట్ అవ్వాల్సింది కానీ.. అంటూ కంటెస్టెంట్‌కు షాకిచ్చిన నాగార్జున

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్‌కు క్యాష్ ప్రైజ్ ఎంతో రివీల్ చేసిన నాగార్జున, డబ్బులతో పాటు అవన్నీ కూడా!

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్‌కు క్యాష్ ప్రైజ్ ఎంతో రివీల్ చేసిన నాగార్జున, డబ్బులతో పాటు అవన్నీ కూడా!

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ స్టేజ్‌పై ‘నా సామిరంగ’ హీరోయిన్ - ఇంప్రెస్ చేసి ఫ్లయింగ్ కిస్ కొట్టేసిన అమర్

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ స్టేజ్‌పై ‘నా సామిరంగ’ హీరోయిన్ - ఇంప్రెస్ చేసి ఫ్లయింగ్ కిస్ కొట్టేసిన అమర్

టాప్ స్టోరీస్

కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు - తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎవరు.?

కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు - తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎవరు.?

తీవ్ర తుపానుగా మారుతున్న మిగ్‌జాం - తీరం దాటేది ఏపీలోనే!

తీవ్ర తుపానుగా మారుతున్న మిగ్‌జాం - తీరం దాటేది ఏపీలోనే!

Cyclone Michaung: సైక్లోన్ మిగ్జాం విధ్వంసం మొదలు, తమిళనాడుని ముంచెత్తుతున్న వర్షాలు - ప్రభుత్వం అలెర్ట్

Cyclone Michaung: సైక్లోన్ మిగ్జాం విధ్వంసం మొదలు, తమిళనాడుని ముంచెత్తుతున్న వర్షాలు - ప్రభుత్వం అలెర్ట్

Cyclone Michaung: తుపాను సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష- ప్రజలకు ఇబ్బంది రావద్దని చంద్రబాబు సూచన

Cyclone Michaung: తుపాను సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష-  ప్రజలకు ఇబ్బంది రావద్దని చంద్రబాబు సూచన
×