Bigg Boss 6 Telugu Episode 70: చెల్లి వెంటే అన్న, బాలాదిత్య కూడా అవుట్ - షాకింగ్ ఎలిమినేషన్
Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో షాకింగ్ ఎలిమినేషన్లు ఎక్కువవుతున్నాయి.
Bigg Boss 6 Telugu: శనివారం ఎపిసోడ్లో ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యాడు. చెల్లి వెంటే అన్న కూడా వెళ్లాడంటూ ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. ఆ ముందు ఆదివారమే గీతూ అవుట్ అయింది. ఆ వెంటనే అయిదు రోజుల్లోనే బాలాదిత్య కూడా ఎలిమినేట్ అయ్యాడు. వీరిద్దరి మధ్య సిగరెట్ల కారణంగా వచ్చిన గొడవలే వీరిద్దరూ బయటికి వెళ్లడానికి కారణం అయ్యింది.
ఇక ఎపిసోడ్లో ఏమైందంటే...నాగార్జున ఇంటిసభ్యులతో డాక్టర్ ఆట ఆడించారు. అందులో ఇంటిసభ్యులు డాక్టర్‌లా మారి ట్యాగ్‌లు ఇవ్వాలి. ఇగో, తల పొగరు, ఇమ్మేట్యురిటీ, మొండితనం, స్వార్థం... ఇలా ట్యాగ్ లు ఉన్నాయి. ఒక్కొక్కరూ ఇంటి సభ్యులకూ వాటిని ఇచ్చి కాకర కాయ జ్యూస్, ఉసిరి రసం, నిమ్మరసం మందులుగా ఇవ్వాలి. అయితే మధ్యమధ్యలో నాగార్జున వారికి క్లాసులు తీసుకున్నారు.
ఇనాయ ఫైమాను అడల్డ్ కామెడీ స్టార్ అని పిలవడం పై నాగార్జున చాలా సీరియస్ అయ్యారు. ఫైమాను ప్రొఫెషన్‌ను అలా అన్నావ్ కదా, మరి నిన్ను ఏమని పిలవాలి అని అడిగారు. దానికి ఇనాయ సారీ చెప్పింది. అలాగే ఫైమాను కూడా నాగార్జున సున్నితంగా హెచ్చరించారు. నామినేషన్ వంటి సీరియస్ డిస్కషన్ లో వెటకారం వద్దని చెప్పారు. దానికి ఫైమా నేనింతే సర్ అంది. దానికి నాగార్జున ‘నేనింతే అంటే ఆడియెన్స్ ఏం చేస్తారో తెలుసు కదా’ అన్నారు.
షాకింగ్ ఎలిమినేషన్...
ఇంతకు ముందు ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ చివరికి ఎలిమినేట్ చేసేవారు. కానీ ఈసారి మొదటే ఎలిమినేట్ చేసేవారు. బాలాదిత్య ఎలిమినేట్ అని చెప్పి వేదికపైకి పిలిచారు. దీంతో అందరూ షాక్ అయ్యారు. చాలా మెచ్యూర్డ్ పర్సన్ గా కనిపించే బాలాదిత్య ఏడుపులు, అతి ఓవర్ యాక్షన్ లేకుండా ఇంటి నుంచి బయటికి వచ్చేశారు. ఎలిమినేట్ అయినప్పుడు గీతూ చేసిన గోల చూసిన ప్రేక్షకులకు బాలాదిత్య డీసెంట్‌గా రావడం నచ్చింది.
వేదిక మీదకు వచ్చిన బాలాదిత్య చాలా పెద్దమనిషిలా అందరికీ సలహాలు ఇచ్చాడు. ఆయన జర్నీ వీడియో కూడా చాలా బాగుంది. తరువాత ఇంటి సభ్యుల గురించి చెప్పడం ప్రారంభించారు. అందరికీ మంచి మంచి సలహాలు ఇచ్చారు. ముఖ్యంగా ఫైమాకు ‘స్ట్రాటజీలు వాడొచ్చు కానీ అది ఫెయిర్ అవుతుందా కాదా అనేది కూడా చూసుకోవాలి. గెలవాల్సింది ఆట మాత్రమే కాదు, జనం మనసుల్ని కూడా. అంతా చూస్తున్నారు’ అని చెప్పాడు. రేవంత్, శ్రీహాన్‌లను పొగిడాడు. అలాగే ఇనాయకు మాటతీరు మార్చుకోమని సలహా ఇచ్చాడు.కీర్తిని ఎక్కువ ఆలోచించవద్దని చెప్పాడు.
ఆదివారం కూడా ఇంకో ఎలిమినేషన్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈరోజున వాసంతిని ఇంటి పంపేస్తున్నట్టు సమాచారం. గతవారం ఆట బాగా ఆడినా కూడా ఈ వారం మాత్రం పెద్దగా ఈమె ఆడలేదు. మొదట్నించి కూడా ఆటలో డల్ గానే ఉంది. అయినా ప్రవర్తన చక్కగా ఉండడంతో ఇన్నాళ్లు ఇంట్లో ఉండగలిగింది.