Bigg Boss 6 Telugu: ఈ వారం డబుల్ ఎలిమినేషన్? ఈరోజు అతడు, రేపు ఆమె?
Bigg Boss 6 Telugu: ఈ వారం బిగ్ బాస్ హౌస్‌లో బిగ్ ట్విస్టు ఉండబోతున్నట్టు సమాచారం.
Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్ల కన్నా బిగ్ బాసే ఎక్కువ గేమ్ ఆడుతున్నారు.ఈ సీజన్లో ఇంటి సభ్యులతో ఆడించేందుకు చాలా కష్టపడుతున్నారు బిగ్ బాస్. గత వారం గీతూ ఎలిమినేషన్‌తో పెద్ద షాక్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ వారం కూడా మరో షాక్ ఉండబోతోంది అని సమాచారం. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. శనివారం ఒకరిని, ఆదివారం మరొకరిని ఎలిమినేట్ చేయబోతున్నట్టు సమాచారం.
శనివారం ఎవరు?
శనివారం నాగార్జున ఈ వారం జరిగిన సంఘటనలపై క్లాసు తీసుకున్నారు. ఇనాయ, రేవంత్, ఆదిరెడ్డికి క్లాసు తీసుకున్నారు. అందరికన్నా ఇనాయకు గట్టిగానే క్లాసు తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే శనివారం ఒక కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేసినట్టు సమాచారం. అది బాలాదిత్య అని వార్త. బాలాదిత్యకు ఓట్లు ఎప్పట్నించో తక్కువ పడుతున్నాయి. మొదట్లో బాలాదిత్య ఆట చక్కగా ఉన్నా... తరువాత గీతూతో అయిన గొడవలతో ఆయనకు కాస్త చెడ్డ పేరు వచ్చింది. గీతూ ఈ సీజన్లో లేకపోతే బాలాదిత్య టాప్ 5లో ఉండేవాడేమో. గీతూ ఈ ఇంట్లో ఎక్కువగా ఆడుకున్నది బాలాదిత్యతోనే. అతనికి ఉన్న సిగరెట్ల వీక్‌నెస్‌ను అడ్డుపెట్టుకుని రెండు మూడు వారాలు అతనితోనే ఆడింది గీతూ. చివరికి ఆమె కూడా బయటికిపోయింది, ఆ తరువాతి వారమే బాలాదిత్య కూడా బయటికి వెళ్లిపోతున్నట్టు తెలుస్తోంది.
మెరీనా, వాసంతి, బాలాదిత్యకు ఓట్లు తక్కువగా పడుతున్నాయి. వాసంతికి ఎప్పట్నించో ఓటింగ్ తక్కువగానే ఉంది. కానీ ఆమె డీసెంట్ ఆటతో ఇంతవరకు నెట్టుకొచ్చింది. అయితే ఈ ఆదివారం ఆమెను ఎలిమినేట్ది చేసినట్టు సమాచారం. ఇది నిజమో కాదో తెలియాలంటే శనివారం, ఆదివారం ఎపిసోడ్‌లు చూడాలి. ప్రస్తుతానికి టైటిల్ ఫేవరేట్‌గా రేవంత్, శ్రీహాన్, ఆదిరెడ్డి, ఇనాయ దూసుకెళ్తున్నారు. వీరిలో ఎక్కువ ఓట్లు పడుతున్నవి రేవంత్‌కే.
ఈ వారం నామినేషన్లలో ఉన్న సభ్యులు ఎవరంటే...
1. బాలాదిత్య
2. మెరీనా
3. ఫైమా
4. వాసంతి
5. కీర్తి
6. ఇనాయ
7. శ్రీహాన్
8.ఆదిరెడ్డి
9. రేవంత్
View this post on Instagram
Also read: ఫైమాను అడల్ట్ కామెడీ స్టార్ అన్నావ్ - ఇనాయకు గట్టిగా క్లాసు తీసుకున్న నాగార్జున