అన్వేషించండి

Bigg Boss OTT 3: 'బిగ్ బాస్' హౌజ్‌లో పాము - సోషల్ మీడియాలో వీడియో వైరల్

Bigg Boss OTT 3: హిందీలో బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 ప్రారంభమయ్యింది. ప్రారంభయిన కొన్నిరోజుల్లోనే వ్యూయర్స్‌లో ఆసక్తి పెంచేసింది. అదే సమయంలో బిగ్ బాస్ హౌజ్‌లోకి పాము రావడం అందరినీ షాక్‌కు గురిచేసింది.

Bigg Boss OTT 3 Hindi: బిగ్ బాస్ రియాలిటీ షో అనేది కేవలం టీవీ వరకే పరిమితం అవ్వకుండా ఓటీటీలోకి కూడా వస్తే బాగుంటుందని మేకర్స్‌కు ఐడియా వచ్చింది. అందుకే ఎక్స్‌క్లూజివ్‌గా ఓటీటీ సబ్‌స్క్రైబర్స్ కోసం బిగ్ బాస్ ఓటీటీ ప్రారంభించారు. ఇప్పుడు హిందీలో సక్సెస్‌ఫుల్‌గా బిగ్ బాస్ మూడో సీజన్ రన్ అవుతోంది. కొత్త కొత్త టాస్కులతో, కొత్త పనిష్మెంట్స్‌తో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తోంది బిగ్ బాస్ ఓటీటీ 3. ఇదే క్రమంలో ప్రేక్షకులు.. బిగ్ బాస్ హౌజ్‌లో ఒక షాకింగ్ విషయాన్ని గమనించారు. హౌజ్‌లోకి పాము రావడం కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హౌజ్‌లో పాము..

బిగ్ బాస్ ఓటీటీ 3లో చాలా మార్పులు జరిగాయి. ఇప్పటివరకు హిందీలో బిగ్ బాస్ షోకు హోస్ట్‌గా సల్మాన్ ఖాన్ మాత్రమే వ్యవహరించాడు. కానీ బిగ్ బాస్ ఓటీటీ 3 కోసం అనిల్ కపూర్ హోస్ట్‌గా రంగంలోకి దిగాడు. అలా ఆడియన్స్‌కు రోజుకు ఒక సర్‌ప్రైజ్ ఇస్తున్నారు మేకర్స్. తాజాగా బిగ్ బాస్ హౌజ్‌లోకి పాము రావడం అయితే వారికి షాకిచ్చింది. బిగ్ బాస్ ఓటీటీ 3లో ఒక కంటెస్టెంట్ అయిన లవ్కేష్ కటారియాకు బిగ్ బాస్ పనిష్మెంట్ ఇచ్చారు. అందులో భాగంగా అతడిని గార్డెన్ ఏరియాలో సంకెళ్లతో కట్టేశారు. అదే సమయంలో అతడి వెనుక నుంచి ఒక పాము వెళ్లడాన్ని ఆడియన్స్ గమనించారు. దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు.

నిజం కాదు..

మామూలుగా మునుపటి బిగ్ బాస్ సీజన్స్‌లో ఎవరైనా కంటెస్టెంట్ తప్పు చేస్తే దానికి పనిష్మెంట్‌గా వారిని జైలుకు పంపించేవారు. కానీ ఈసారి మాత్రం ఏకంగా సంకెళ్లతో బంధించారు. దీంతో లవ్కేష్ కటారియాకు ఇచ్చిన శిక్షను చాలామంది ఆడియన్స్ ఖండిస్తున్నారు. పైగా అదే సమయంలో తన వెనుక నుండి పాము వెళ్లడం చూసి చాలామంది భయపడిపోయారు. అది లవ్కేష్ దగ్గరకు వచ్చినా తను ఏమీ చేసే పరిస్థితిలో లేడని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ మరికొందరు అయితే ఆ మాత్రం సేఫ్టీ లేకుండా అంత పెద్ద రియాలిటీ షోను నడిపించలేరని, కచ్చితంగా అది ఎడిట్ చేసిన వీడియో అని అంటున్నారు.

హాట్ టాపిక్..

లవ్కేష్ కటారియాకు అసలు ఆ పనిష్మెంట్ ఎందుకు ఇచ్చారు అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. బిగ్ బాస్ ఓటీటీ3లో లవ్కేష్‌తో యూట్యూబర్ అర్మాన్ మాలిక్, రాఖీ సావంత్, గౌహర్ ఖాన్, అజాజ్ ఖాన్ కూడా కంటెస్టెంట్స్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికీ ఈ సీజన్ ప్రారంభమయ్యి నెలరోజుల కాకముందే దీనిపై ఆడియన్స్ అంతా చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ఇంతలో బిగ్ బాస్ హౌజ్‌లోకి పాము ఎంట్రీ అనే విషయం కూడా బిగ్ బాస్ వ్యూయర్స్ మధ్య హాట్ టాపిక్‌గా మారింది.

Also Read: ప్రణీత్ హనుమంతు ఎక్కడ ఉంటాడు - హైదరాబాద్‌లోనా, అమెరికాలోనా?

టాప్ హెడ్ లైన్స్

Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Rocking Rakesh: మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి జబర్దస్త్ వరకు.. రాకింగ్ రాకేష్ రియల్ లైఫ్ విశేషాలు
మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి జబర్దస్త్ వరకు.. రాకింగ్ రాకేష్ రియల్ లైఫ్ విశేషాలు
Patas Hari: పంచ్ పంచ్‌లో కామెడీ.. పటాస్ హరి రియల్ లైఫ్ విషయాలు.. బిగ్ బాస్ ఎంట్రీపై ఊహాగానాలు!
పంచ్ పంచ్‌లో కామెడీ.. పటాస్ హరి రియల్ లైఫ్ విషయాలు.. బిగ్ బాస్ ఎంట్రీపై ఊహాగానాలు!
Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్ 10'లోకి ఫిమేల్ లిరిసిస్ట్... గ్లామర్ లేడీ కాదు, కంటెంట్ ఉన్న అమ్మాయి
'బిగ్ బాస్ 10'లోకి ఫిమేల్ లిరిసిస్ట్... గ్లామర్ లేడీ కాదు, కంటెంట్ ఉన్న అమ్మాయి

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget