Ankita Lokhande: బిగ్ బాస్ హౌస్‌లో భర్తను చెప్పుతో కొట్టిన భార్య - వీడియో వైరల్
Bigg Boss 17 : బిగ్ బాస్ రియాలిటీ షోలో అందరూ చూస్తుండగానే భార్య.. తన భర్తను చెప్పుతో కొట్టింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.
బిగ్ బాస్ రియాలిటీ షోలో ఉండే కెమెరాలు అన్నీ కంటెస్టెంట్స్ ప్రతీ ఒక్క కదలికలను గమనిస్తూనే ఉంటాయి. అందుకే బిగ్ బాస్ హౌజ్‌లో ఉండే కంటెస్టెంట్స్ అంతా ఏదైనా మాట్లాడేముందు, ఏదైనా పనిచేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. కానీ హిందీ బిగ్ బాస్‌లో మాత్రం కంటెస్టెంట్స్.. ఈ రూల్స్‌ను ఎప్పుడో అతిక్రమించారు. ఇప్పటికే హిందీలో ప్రసారమయిన బిగ్ బాస్ సీజన్స్‌లోని ప్రతీ ఒక్క సీజన్‌లో ఏదో ఒక పెద్ద కాంట్రవర్సీ చోటుచేసుకుంటూనే ఉంది. ఇక తాజాగా ప్రారంభమయిన బిగ్ బాస్ సీజన్ 17లో భార్యాభర్తలు కలిసి రావడంతో ఈ కాంట్రవర్సీలు మరింత పెరిగాయి. ముఖ్యంగా అంకితా లోఖండే, విక్కీ జైన్ మధ్య గొడవలకు హద్దులు ఉండడం లేదు. తాజాగా భర్తపై కోపంతో అంకితా చేసిన పనికి ప్రేక్షకులతో పాటు కంటెస్టెంట్స్ సైతం ఆశ్చర్యపోయారు.
విక్కీకి పెరిగిన ఫాలోయింగ్..
ప్రస్తుతం బిగ్ బాస్ 17లో అంకితా లోఖండే, విక్కీ జైన్.. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌గా తమ ఆటను కొనసాగిస్తున్నారు. కానీ భార్యాభర్తలుగా మాత్రం ఇద్దరూ ఎక్కువగా గొడవపడుతూనే కనిపిస్తున్నారు. కంటెస్టెంట్స్‌గా ఎవరి ఆట వారు ఆడుతున్నప్పుడు అంకితా, విక్కీ మంచి పర్ఫార్మెన్స్‌ను కనబరుస్తున్నారు. కానీ కపుల్‌గా మాత్రం వీరి మధ్య ఎన్నో మనస్పర్థలు చోటుచేసుకుంటున్నాయి. ‘పవిత్ర రిష్తా’ అనే సీరియల్ ద్వారా అంకితాకు బాలీవుడ్ బుల్లితెరపై విపరీతమైన పాపులారిటీ లభించింది. కానీ బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టిన తర్వాత మాత్రం విక్కీకే ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఎప్పుడూ ఫన్నీగా ఉంటూ, గేమ్స్ విషయంలో కూడా యాక్టివ్‌గా ఉండే విక్కీని బిగ్ బాస్ ప్రేక్షకులు ఇష్టపడడం మొదలుపెట్టారు.
చెప్పుతో కొట్టింది..
ఇప్పటికే అంకితా, విక్కీల మధ్య జరుగుతున్న గొడవలపై ప్రేక్షకులు ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ఇక తాజాగా అంకితా.. విక్కీని చెప్పుతో కొట్టిన వీడియో వైరల్‌గా మారింది. ఫుడ్ విషయంలో హౌజ్‌మేట్స్ అంతా చర్చించుకుంటుండగా.. విక్కీ.. అంకితాను సరదాగా ఆటపట్టించడం మొదలుపెట్టాడు. అంకితా వెళ్లిపోతుంటే వెనక నుంచి పట్టుకున్నాడు. వదలమన్నా వదలలేదు. దీంతో అంకితా తనను వదిలించుకొని, వెంటనే చెప్పులు తీసి విక్కీపై విసిరేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అక్కడే ఉన్న హౌజ్‌మేట్స్.. విక్కీని ఏడిపించడం మొదలుపెట్టారు. కానీ విక్కీ మాత్రం ఇదంతా చాలా కామెడీగా తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఎప్పుడూ గొడవలే..
అంకితా, విక్కీల గొడవలకు సంబంధించి ఇప్పటికే పలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముందుగా విక్కీ తనను అసలు పట్టించుకోవడం లేదని అంకితా ఆరోపించడం మొదలుపెట్టింది. బిగ్ బాస్ హౌజ్‌లోకి వచ్చినప్పటి నుంచి తనను దూరం పెడుతున్నాడంటూ ఇతర హౌజ్‌మేట్స్‌కు చెప్తూ తిరిగింది. అంతే కాకుండా తాను ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా తీసుకున్నానని చెప్పడం సంచలనంగా మారింది. కంటెస్టెంట్స్‌గా ఇద్దరు టాస్కుల విషయంలో యాక్టివ్‌గా ఉన్నా.. కలిసి ఆడే గేమ్స్‌లో మాత్రం వెనకబడిపోతున్నారు. తాజాగా అంకితా ఏ కలర్ డ్రెస్ వేసుకుంది, ఎన్ని గాజులు వేసుకుంది అనే చిన్న చిన్న ప్రశ్నలకు కూడా విక్కీ సమాధానం చెప్పలేకపోవడంతో అంకితా తనపై మరింత కోపంగా ఉంది. దీంతో తాజాగా చెప్పుతో కొట్టడం కూడా సరదా కాదని, సీరియస్ అని ప్రేక్షకులు అనుకుంటున్నారు.
Mujhe yeh vali fight dekhni hain
— Ankitalokhande (fan) (@Ankitafam) November 19, 2023
Serious vali nahi
bolna mat chappal maari 😂
Kyuki yeh bohot Masti vala tha jaise bestfriends ek dooshre ko maarte hain
Ek gala daba raha ek chapal 😂😂🤣
Ankita is in muanku mood#ankitalokhande #vickyjain #biggboss17 #munawarfaruqui pic.twitter.com/zbtRESokWN
Also Read: ఈవారం నామినేషన్స్‌లో 8 మంది కంటెస్టెంట్స్, డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరూ!