News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Divi Vadthya: ‘బిగ్ బాస్’ బ్యూటీ బోల్డ్ పిక్ - బ్యాక్ లెస్ శారీలో దివి అందాల విందు

బిగ్ బాస్ బ్యూటీ దివి వడ్త్యా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈమె షేర్ చేసిన బ్యాక్ లెస్ శారీ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

FOLLOW US: 
Share:

దివి.. తెలుగు సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టి, చక్కటి ఆటతీరుతో బాగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత మహేష్ బాబు, సందీప్ కిషన్, అల్లు అర్జున్, చిరంజీవి సినిమాల్లో నటించింది. పలు వెబ్ సిరీస్ లలోనూ నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అందం, అభినయం ఉన్నా, దివికి అనుకున్న స్థాయిలో అవకాశాలు రావడం లేదనే చెప్పుకోవచ్చు.   

పలు సినిమాల్లో నటించిన దివి

1996 మార్చి 15న హైదరాబాద్‌లో జన్మించిన దివి.. MBA పూర్తి చేసి మోడలింగ్ వైపు అడుగు పెట్టింది. బిగ్ బాస్ షో కంటెస్టెంట్ లా పాల్గొని బాగా గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ ద్వారా వచ్చిన పాపులారిటీతో  సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వం లో తెరకెక్కిన ‘మహర్షి’ చిత్రంలో ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాలో కాలేజీ స్టూడెంట్ గా కనిపించింది. చిన్న పాత్రే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సందీస్ కిషన్ తో కలిసి ‘A1 ఎక్స్ ప్రెస్’ అనే సినిమా చేసింది. ఈ మూవీలో  దివికి పెద్దగా కలిసి రాలేదు. ఆ తర్వాత పలు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను అలరించింది. అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలో న్యూస్ రీడర్ గా కనిపించిన ఆమె, చిరంజీవి ‘గాడ్ ఫాదర్’లో ఓ కీలక పాత్ర పోషించింది. అయితే, ఇప్పటి వరకు ఆమె కెరీర్ కు ఉపయోగపడే మంచి ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్ ఒక్కటి కూడా దక్కలేదు.

బ్యాక్ లెస్ శారీలో బిగ్ బాస్ బ్యూటీ

దివి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటుంది. పల్లెటూరి అమ్మాయిలా, మోడ్రన్ గ్లామర్ గర్ల్ లా ఇట్టే ఆకట్టుకుంటుంది. గ్లామరస్ ఫోటోలతో కుర్రకారును ఇట్టే కట్టిపడేస్తుంది. మత్తెక్కించే చూపులతో ఆకర్షిస్తుంది.   సహజమైన అందంతో అన్ని రకాల డ్రెస్సుల్లో అదుర్స్ అనిపించేలా ఉంటుంది. తాజా బ్యాక్ లెస్ శారీ ఫోటోను షేర్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. అమ్మడు బ్యాక్ పోజును చూసి కుర్రాళ్లు మైమరిచిపోయారు. ఈ అద్భుమైన ఫోటోకు “అస్తమించే సూర్యుడితో రోజులు లెక్కపెట్టుకుంటూ.. నీ రాకకై ఎదురుచూస్తూ, నే నీకోసం చేస్తున్న నిరీక్షణ” అంటూ క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.  

View this post on Instagram
 
A post shared by Divi Vadthya (@actordivi)

‘రుద్రంగి’లో దివి అందాల కనువిందు

తాజాగా ‘రుద్రంగి’ సినిమాలో తన అందచందాలతో ఆకట్టుకుంది దివి. అజయ్‌ సామ్రాట్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఫోక్ సాంగ్ కు అమ్మడు అద్భుతంగా డ్యాన్స్ చేసి ఆకట్టుకుంది. “జాజిమొ గులాలి… ” అంటూ సాగే ఈ పాటలో దివి తన అందాలతో అలరించింది. పూర్తి తెలంగాణ యాసలో సాగే ఈ జానపద పాట అభినయ శ్రీనివాస్‌ అందించగా సంగీతం నాఫల్‌ రాజా అందించారు. ఈ మూవీలో జగపతి బాబు, ఆశిష్‌ గాంధీ, గానవి లక్ష్మణ్‌, విమలా రామన్‌, మమతా మోహందాస్‌, కాలకేయ ప్రభాకర్‌, ఆర్‌ఎస్‌ నంద సహా పలువురు కీలక పాత్రల్లో నటించారు. 

Read Also: నరేష్, పవిత్ర లోకేష్‌ల బంధంపై ఆయన కొడుకు నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 23 Aug 2023 01:03 PM (IST) Tags: Divi Vadthya Divi Vadthya Movies Divi Vadthya Photos Divi Backless Saree

ఇవి కూడా చూడండి

Bigg Boss Season 7 Latest Promo: అహంకారంతో మట్లాడొద్దు - ఆట సందీప్‌కు శివాజీ వార్నింగ్, అమర్ దీప్‌కు శోభా షాక్

Bigg Boss Season 7 Latest Promo: అహంకారంతో మట్లాడొద్దు - ఆట సందీప్‌కు శివాజీ వార్నింగ్, అమర్ దీప్‌కు శోభా షాక్

Bigg Boss Promo: బ్యాంక్ గా మారిన బిగ్ బాస్ హౌస్- నాలుగో పవర్ అస్త్ర కోసం పోటీ!

Bigg Boss Promo: బ్యాంక్ గా మారిన బిగ్ బాస్ హౌస్- నాలుగో పవర్ అస్త్ర కోసం పోటీ!

Bigg Boss Season 7 Day 22 Updates: చెల్లి, అక్కా అని పిలుస్తా, నీ పేరు ఎత్తితే చెప్పుతో కొట్టు - రతికతో పల్లవి ప్రశాంత్ లొల్లి

Bigg Boss Season 7 Day 22 Updates: చెల్లి, అక్కా అని పిలుస్తా, నీ పేరు ఎత్తితే చెప్పుతో కొట్టు - రతికతో పల్లవి ప్రశాంత్ లొల్లి

Bigg Boss Sivaji: ‘బిగ్ బాస్’ హౌస్‌కు శివాజీ గెస్టా? ఆడేది తక్కువ అజమాయిషీ ఎక్కువ - పిల్ల గ్యాంగ్‌తో మైండ్ గేమ్!

Bigg Boss Sivaji: ‘బిగ్ బాస్’ హౌస్‌కు శివాజీ గెస్టా? ఆడేది తక్కువ అజమాయిషీ ఎక్కువ - పిల్ల గ్యాంగ్‌తో మైండ్ గేమ్!

Bigg Boss Season 7 Telugu Day 22 Updates: శోభాశెట్టిపై గౌతమ్ అసభ్యకర సైగలు? పల్లవి ప్రశాంత్ చెప్పింది నిజమేనా? ఆ రోజు ఏం జరిగింది?

Bigg Boss Season 7 Telugu Day 22 Updates: శోభాశెట్టిపై గౌతమ్ అసభ్యకర సైగలు? పల్లవి ప్రశాంత్ చెప్పింది నిజమేనా? ఆ రోజు ఏం జరిగింది?

టాప్ స్టోరీస్

Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!

Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు షాకిచ్చిన కేంద్రం, సీబీఐ విచారణకు ఆదేశం

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు షాకిచ్చిన కేంద్రం, సీబీఐ విచారణకు ఆదేశం

IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్‌ మాక్సీ! రాజ్‌కోట్‌ వన్డేలో టీమ్‌ఇండియా ఓటమి

IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్‌ మాక్సీ! రాజ్‌కోట్‌ వన్డేలో టీమ్‌ఇండియా ఓటమి

Pawan Kalyan: బాలిక హత్యపై మహిళా కమిషన్ ఎందుకు స్పందించట్లేదు, కనీస బాధ్యత లేదా: పవన్ కల్యాణ్

Pawan Kalyan: బాలిక హత్యపై మహిళా కమిషన్ ఎందుకు స్పందించట్లేదు, కనీస బాధ్యత లేదా: పవన్ కల్యాణ్