News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Actor Naresh Son Naveen: నరేష్, పవిత్ర లోకేష్‌ల బంధంపై ఆయన కొడుకు నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు

గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన నరేష్, పవిత్రలోకేష్ పెళ్లి వ్యవహారంపై నరేష్ కొడుకు నవీన్ తొలిసారి స్పందించారు. నరేష్, పవిత్ర లోకేష్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

FOLLOW US: 
Share:

గత కొంతకాలంగా నటుడు నరేష్, పవిత్రా లోకేష్ వ్యవహారం తెలుగు సినిమా పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. నటుడు నరేష్ రమ్య రఘుపతిని మూడో వివాహం చేసుకున్నారు. కొన్నేళ్లు సజావుగా సాగిన వీరి కాపురం తర్వాత మధ్య వివాదాలు మొదలైయ్యాయి. నటి పవిత్ర లోకేష్ తో నరేష్ సన్నిహితంగా ఉంటుందనే వార్తలు రావడంతో వీరి మధ్య వివాదం మరింత ముదిరింది. ఓ రోజు నరేష్, పవిత్ర హోటల్ రూమ్ లో కనిపించడంతో నరేష్, పవిత్రలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది రమ్య.  అప్పటి నుంచి పలు సార్లు వీరి మధ్య పోలీస్ కేసులు నడిచాయి. నరేష్ రమ్య మీద, రమ్య నరేష్ మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకుంటున్నారు. రీసెంట్ గా నరేష్, పవిత్ర లోకేష్ హీరో, హీరోయిన్లుగా ‘మళ్ళీ పెళ్లి’ అనే సినిమా చేశారు. ఇందులో రమ్యను విలన్ గా చూపించే ప్రయత్నం చేశారు. ఈ సినిమా విడుదల కాకుండా చూడాలంటూ రమ్య న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే, సెన్సార్ బోర్డ్ సినిమా కల్పితమని ధృవీకరించిన తర్వాత మూవీ విడుదలను అడ్డుకోవడం కష్టమంటూ న్యాయస్థానం కేసు కొట్టివేసింది. అయినా ఈ వ్యవహారం టీవీ సీరియల్ లా సాగుతూనే ఉంది.  

చేసిన తప్పులకు సొల్యూషన్ కనుగొన్నారు- నవీన్

తాజాగా నరేష్, పవిత్ర లోకేష్ పెళ్లి వ్యవహారంపై నరేష్ కొడుకు నవీన్ తొలిసారి కీలక వ్యాఖ్యలు చేశారు. “మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా చాలా ఇండిపెండెంట్ గా వ్యవహరిస్తారు. ఎవరికి ఏది కావాలో దాని కోసం ప్రయత్నిస్తారు. ఏ నిర్ణయం తీసుకున్నా అందరం పీస్ ఫుల్ గా ఉండాలి అనుకుంటారు. మనం చేసే ప్రతి పని కరెక్ట్ గా ఉండాలనే రూల్ ఏమీ లేదు. చాలా సార్లు తప్పులు చేస్తుంటాం. మా నాన్న కూడా తప్పు చేశాడు అనుకుంటున్నాను. తప్పు చేశారు అనడం కంటే చేసిన తప్పులకు సొల్యూషన్ కనుకొన్నారు అనుకుంటున్నాను.  గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకుని బెటర్ గా లైఫ్ ను లీడ్ చేయాలి అనుకుంటున్నారేమో. ఆయనకు ఏది మంచిది అనిపిస్తే అది చేస్తారు. నా ఫీలింగ్ ఏంటంటే? నేను చెడుగా ఏమీ ఫీల్ కావడం లేదు. ప్రపంచం ఏం అనుకుంటుంది? అని ఆలోచించి మనం బతకాలంటే కష్టం. అందుకే, మనకు నచ్చినట్లుగా ఉండాలి. మా నాన్న తీసుకున్న నిర్ణయం పట్ల నేను గర్వంగానే ఉన్నాను. ఆయన తన లైఫ్ లో సంతోషంగా ఉన్నారా? లేదా? అనేదే నాకు ముఖ్యం. ఆయన హ్యాపీగా ఉన్నారు. నేను కూడా హ్యాపీగా ఉన్నాను” అన్నారు.

పవిత్ర లోకేష్ నాకు చాలా కాలంగా తెలుసు-నవీన్

“మానాన్న పెళ్లి గురించి మేం ఏం అనుకుంటున్నాం అనేది చాలా ముఖ్యం. బయటి వాళ్లు ఏం మాట్లాడుకుంటున్నారు? అనేది మాకు ముఖ్యం కాదు.  ఎందుకంటే అది మా ఓపీనియన్ కాదు. బయటి వాళ్ల ఒపినియన్స్ కన్సిడర్ చేయలేం.  ఆయన నిర్ణయం, ఆయన సమస్య, ఆయనే చూసుకుంటారు. ఆయన కొడుకుగా నా నిర్ణయాన్ని తను అడిగితే అప్పుడు చెప్తాను. నాకంటే ఆయనే తన లైఫ్ ను బాగా చూసుకోగలడు. పవిత్ర లోకేష్ గారు నాకు చాలా కాలంగా తెలుసు. చాలాసార్లు మాట్లాడాను. తను చాలా మంచి వ్యక్తి. ఆమె లాంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉంటారు. ఎప్పుడైనా తను చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆమెను పవిత్ర గారు అని పిలుస్తాను” అని నవీన్ చెప్పారు.

Read Also: ‘జవాన్’ సెన్సార్ రిపోర్ట్: ఆ డైలాగ్ తొలగింపు, ‘రాష్ట్రపతి’పై అభ్యంతరం - 7 కట్స్‌తో సర్టిఫికెట్ జారీ

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 23 Aug 2023 12:17 PM (IST) Tags: Actor Naresh Actor Naresh Son Naveen Naresh-Pavitra Lokesh Marriage Naveen First Reaction

ఇవి కూడా చూడండి

Ranbir Kapoor: రణబీర్ కపూర్‌‌ను విచారించనున్న ఈడీ - ఆ ప్రకటనే కొంప ముంచిందా?

Ranbir Kapoor: రణబీర్ కపూర్‌‌ను విచారించనున్న ఈడీ - ఆ ప్రకటనే కొంప ముంచిందా?

Month Of Madhu: లవ్ బర్డ్స్‌కు ‘మంత్ ఆఫ్ మధు’ బంపర్ ఆఫర్ - ప్రేమికుల కోసం సీక్రెట్ స్క్రీనింగ్‌.. ఎప్పుడు, ఎక్కడంటే?

Month Of Madhu: లవ్ బర్డ్స్‌కు ‘మంత్ ఆఫ్ మధు’ బంపర్ ఆఫర్ - ప్రేమికుల కోసం సీక్రెట్ స్క్రీనింగ్‌.. ఎప్పుడు, ఎక్కడంటే?

Bhagavanth Kesari: సప్పుడు చెయ్యకురి, నీకన్నా మస్తుగా ఉరుకుతాంది - ‘భగవంత్ కేసరి’ నుంచి బాలయ్య, శ్రీలీలాల సాంగ్ వచ్చేసింది!

Bhagavanth Kesari: సప్పుడు చెయ్యకురి, నీకన్నా మస్తుగా ఉరుకుతాంది - ‘భగవంత్ కేసరి’ నుంచి బాలయ్య, శ్రీలీలాల సాంగ్ వచ్చేసింది!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన కొరటాల - రెండు భాగాలుగా 'దేవర', రిలీజ్ ఎప్పుడంటే?

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన కొరటాల - రెండు భాగాలుగా 'దేవర', రిలీజ్ ఎప్పుడంటే?

రణ్‌బీర్, యష్ ‘రామాయణం’, రామ్‌చరణ్, ధోని మీటింగ్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

రణ్‌బీర్, యష్ ‘రామాయణం’, రామ్‌చరణ్, ధోని మీటింగ్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

టాప్ స్టోరీస్

Flipkart iPad Offer: కొత్త ట్యాబ్ కొనాలనుకుంటున్నారా? - రూ.20 వేలలోపే యాపిల్ ఐప్యాడ్!

Flipkart iPad Offer: కొత్త ట్యాబ్ కొనాలనుకుంటున్నారా? - రూ.20 వేలలోపే యాపిల్ ఐప్యాడ్!

Lokesh : స్కిల్ కేసులో ముందస్తు బెయిల్ పొడిగింపు - లోకేష్‌కు మరోసారి ఊరట !

Lokesh : స్కిల్ కేసులో ముందస్తు బెయిల్ పొడిగింపు - లోకేష్‌కు మరోసారి ఊరట !

Malkajgiri News: ఎమ్మెల్యే మైనంపల్లిని చర్లపల్లి జైలుకు పంపుతా - ఆయన ప్రత్యర్థి హెచ్చరికలు

Malkajgiri News: ఎమ్మెల్యే మైనంపల్లిని చర్లపల్లి జైలుకు పంపుతా - ఆయన ప్రత్యర్థి హెచ్చరికలు

Cheapest 5G Phone in India: ఐటెల్ పీ55 సేల్ ప్రారంభం - దేశంలో అత్యంత చవకైన 5జీ ఫోన్ - రూ.తొమ్మిది వేలలోపే!

Cheapest 5G Phone in India: ఐటెల్ పీ55 సేల్ ప్రారంభం - దేశంలో అత్యంత చవకైన 5జీ ఫోన్ - రూ.తొమ్మిది వేలలోపే!