అన్వేషించండి

Aditya Om: పాపం ఆదిత్య ఓం... బిగ్ బాస్ భారీ షాక్ - హౌస్ నుంచి బయటకొచ్చే రోజు పర్సనల్ లైఫ్‌లో స్పెషల్ డే కూడా!

బిగ్ బాస్ 8లో నెమ్మదిగా ఆట మొదలు పెట్టినప్పటికీ... పికప్ అయ్యే టైంలో బిగ్ బాస్ నుంచి భారీ షాక్ ఎదుర్కొన్నాడు ఆదిత్య ఓం. అతడిని జనం అర్థం చేసుకునే లోపే బయటకు వస్తున్నారు. ఆ డే స్పెషల్ ఏమిటో తెలుసా?

Aditya Om Bigg boss Birthday: బిగ్ బాస్ నుండి మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా బయటకు వచ్చేశారు ఆదిత్య ఓం. ఈ రోజు (అక్టోబర్ 5) ఆయన పుట్టిన రోజు. సరిగ్గా బర్త్ డే నాడే హౌస్ మేట్స్ కు గుడ్ బై చెప్పేందుకు మరోసారి ఆయన స్టేజ్ మీదకు రాబోతున్నారు. అయితే ఈ వారం అంతా ఆయన అద్భుతంగా ఆడారు. టాస్కుల్లో గానీ, డిస్కషన్స్‌లో తన వాదన వినిపించడంలో ఆయన చాలా మంచి ప్రదర్శన ఇచ్చారు. అయితే అప్పటికే ఆయన నామినేషన్స్‌లో ఉండడం కనీసం ఈ వారం మొత్తం ఓటింగ్ పడే అవకాశం లేకుండా బిగ్ బాస్ మిడ్ వీక్ ఎలిమినేషన్ పెట్టడంతో ఆదిత్య ఓం హౌస్ నుండి బయటకు వెళ్లిపోవాల్సి వచ్చింది.

ఫుల్ పాజిటివ్ నోట్‌తో బయటకు వచ్చిన హౌస్ మేట్ 
సాధారణంగా బిగ్ బాస్ హౌస్ నుండి రెండవ వారం తరువాత టాప్ ఫైవ్ కు ముందు బయటకు వచ్చే హౌస్ మేట్స్ కు ఎంతో కొంత నెగిటివిటీ ఉండడం సహజం. అప్పటికే ఏర్పడే ఫ్యాన్స్ తో పాటు కొంతమంది యాంటీ ఫ్యాన్స్ కూడా రెడీ అవుతారు. అలాంటివాళ్లు సోషల్ మీడియాలో  కొద్దిగానన్నా నెగిటివ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు. కానీ ఈ వారం ఎక్కడా ఆదిత్య ఓం పై అలాంటి కామెంట్స్ కనపడలేదు. ఆయన ఎలిమినేట్ అవ్వడంపై "అయ్యో పాపం" అనేవాళ్లే  ఎక్కువగా కనబడుతున్నారు.

ఎలివేట్ అవుతున్న టైంలో ఎలిమినేట్ అయిన ఆదిత్య ఓం
ఆదిత్య ఓం తన ఆటను స్లోగా మొదలు పెట్టారు. మొదటి రెండు వారాలు  ఆయన పెద్దగా టాస్కుల్లో ప్రభావం చూపింది లేదు. అలాంటి సందర్భాలు కూడా పెద్దగా రాలేదు. నామినేషన్స్‌లో కూడా అవతలి వాళ్ల పాజిటివ్స్ చెప్పి నామినేట్ చేయడం కూడా సేఫ్ గేమ్ గా ఆడియన్స్ భావించారు. అయితే ఈ వారం నిఖిల్, నబీల్, పృథ్వి లాంటి బలవంతులతో, వయస్సులో చిన్న వాళ్ళతో పోటీ పడి మరీ ఫిజికల్ టాస్క్ లో అద్భుతంగా ఆడారు ఆదిత్య ఓం. అలాగే ప్రేరణ తనను నామినేట్ చేసే టైంలో కొంటర్ ఇస్తూ హౌస్ మేట్స్ ఎవరు విలన్లు కాదని కేవలం నామినేట్ చెయ్యడం కోసం వాళ్లని చెడ్డవాళ్ళుగా పోట్రేట్ చేయాల్సిన అవసరం లేదంటూ అని చెప్పిన పాయింట్స్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. అయితే ఈ లోపు ఎలిమినేషన్ వచ్చేయడంతో ఆదిత్య ఓం బలయ్యారు. ఆయన పాయింట్ అర్థం చేసుకున్న తర్వాత తనను నామినేట్ చేసిన ప్రేరణ కూడా చాలా బాధపడింది. అయితే ఇందులో ఆదిత్య ఓం పొరపాటు కూడా లేకపోలేదు. మొదటి నుండీ ఈ వారం ఆడినట్టు ఆడి ఉంటే ఖచ్చితంగా టాప్ ఫైవ్ వరకు ఆదిత్య ఓం గేమ్ లో ఉండి ఉండేవారన్న అభిప్రాయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గతంలో అలీ రైజా, నయని పావని లాంటి వాళ్ళు ఇలానే ఆట మధ్యలోనే ఎలిమినేట్ అయిపోయారు. దానితో అలి రైజాకు మరో ఛాన్స్ లభించింది. నయని పావని వైల్డ్ కార్డుగా ఈ సీజన్ లో ఎంట్రీ ఇస్తుంది. ఆదిత్య ఓంకు కూడా అలాంటి ఛాన్స్ ఇవ్వాలని ఆయన ఫ్యాన్స్ కోరుతున్నారు.

Also Read: బిగ్ బాస్ తెలుగు 8 డే 33 రివ్యూ... విసిగిస్తున్న బిగ్ బాస్ టీం... కంటెస్టెంట్ల ఏడ్పులు ఆడియెన్స్ నిట్టూర్పులు

సినీ ఇండస్ట్రీ లో 25 ఏళ్లుగా ప్రయాణం
2000లో సినీ ఎంట్రీ ఇచ్చిన ఆదిత్య ఓం పాతికేళ్లుగా ఇండస్ట్రీ లో కొనసాగుతునన్నారు. 'లాహిరి లాహిరి లాహిరిలో', 'ధనలక్ష్మి ఐలవ్ యు' లాంటి హిట్లతో పేరు తెచ్చుకున్నారు. హిందీలోనూ కొన్ని సినిమాలు చేశారు. స్క్రీన్ ప్లే  రైటర్ గానూ, డైరెక్టర్ గాను ప్రతిభ చూపిన ఆయన సమాజ సేవలోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. కొన్ని గ్రామాలు దత్తత తీసుకుని విద్య, త్రాగు నీరు, మెడికల్ క్యాంప్స్ నిర్వహణ లాంటి సేవలు అందిస్తున్నట్టు ఆయన అభిమానులు చెబుతున్నారు. ఏదేమైనా మిడ్ వీక్ ఎలిమినేషన్ లో కూడా పాజిటివ్ నోట్ తో బయటకు వచ్చిన హౌస్ మేట్ గా ఆదిత్య ఓం నిలిచిపోయారు. తన పుట్టిన రోజు నాడే  బిగ్ బాస్  హౌస్ కు చివరి గుడ్ బై చెప్పేందుకు ఆయన రెడీ అయ్యారు .

Also Readబిగ్ బాస్ 32 రివ్యూ... మెగా చీఫ్ గా నబిల్ అఫ్రిది, మిడ్ నైట్ ఎలిమినేషన్ లో ఆదిత్య అవుట్ - ప్రేరణపై యష్మి గౌడ ఏడుపు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Mahindra BE 6e Vs Tata Curvv EV: నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Embed widget