Actor Kireeti Damaraju: బిగ్ బాస్ తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాను : నటుడు కిరిటీ దామరాజు
Actor Kireeti Damaraju: బిగ్ బాస్ ఎంతోమందిని సెలబ్రిటీలని చేసింది. ఎంతోమందికి మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే, అదే బిగ్ బాస్ లో పాల్గొన్న కొంతమంది డీ ఫేమ్ అయ్యారు ట్రోలింగ్ కి కూడా గురయ్యారు.
Actor Kireeti Damaraju bout Big Boss Journey: బిగ్ బాస్ చాలామందిని సెలబ్రిటీలను చేసింది. ఎంతోమంది సెలబ్రిటీలకు ఇంకా చాలా చాలా మంచి ఛాన్సులు తెచ్చిపెట్టింది. బిగ్ బాస్ లో పాల్గొన్న చాలామందికి అభిమాన సంఘాలు కూడా ఏర్పడ్డాయి. ఇక ఆ షోకి వెళ్లిన వాళ్లు కొంతమందికి మంచి పేరు వస్తే.. ఇంకొంతమందికి చెడ్డ పేరు కూడా వచ్చింది. హౌస్ లోకి వెళ్లి వచ్చిన చాలామంది ఇబ్బందులు కూడా పడ్డారు ట్రోలింగ్ కి కూడా గురయ్యారు. అయితే, వాళ్లలో కొంతమంది బయటికి చెప్పుకున్నా, చాలామంది వాళ్లు పడ్డ ఇబ్బందులు చెప్పుకోలేకపోయారు. ఇబ్బందులు పడ్డవాళ్లలో డీజే టిల్లు యాక్టర్ కిరిటీ కూడా ఒకరు. ఆయన ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలు పంచుకున్నారు.
తెలీదు.. గుర్తులేదు.. మర్చిపోయా..
యాక్టర్ కిరీటీ దామరాజు. ఈయన్నీ ఇలా అంటే.. 'డీజే టిల్లు'లో రోహిత్ అంటేనే ఎక్కువగా గుర్తుపడతారు అందరూ. ఎన్నో మంచి మంచి క్యారెక్టర్లు చేసి ఎంతోమందికి సుపరిచితమ. ఇక ఆయన బిగ్ బాస్ - 2 సీజన్ లో పాల్గొన్నారు. హౌస్‌లో దాదాపు 85 రోజులు ఉన్నారు. ఆయనని తన జర్నీ గురించి అడిగితే షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను చాలా ఇబ్బందులు పడ్డానని చెప్పుకొచ్చారు.
బిగ్ బాస్ గురించి ఏమీ తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. బిగ్ బాస్ అనేది ఒక వెరైటీ ఎక్స్ పీరియెన్స్. అందరికీ రాదు ఆ అవకాశం. కానీ అవకాశం వస్తే.. దాన్ని మనం వాడుకోవాలి. అది మనల్ని వాడుకోకూడదు. బిగ్ బాస్ కి వెళ్తే మన గురించి మనం ఎక్కువగా తెలుసుకోవచ్చు. అయినా ఆ షో గురించి ఇప్పుడు ఎందుకు లెండి అంతా మర్చిపోయాను. గుర్తు చేయొద్దు. బిగ్ బాస్ తర్వాత చాలా ఇబ్బందుల్లో పడిపోయాను. ఆ తర్వాత దాన్ని నుంచి బయటికి వచ్చాను. అప్పుడే పవన్ సాధినేని గారు వెబ్ సిరీస్ లో ఆఫర్ ఇచ్చారు. దాని తర్వాత 'పుష్పక విమానం', 'డీజే టిల్లు', 'వలయం', 'పెళ్లి సందడి' ఇంకా చాలా సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయి. బిగ్ బాస్ వల్ల ఏదైనా మంచి విషయం జరిగిందంటే.. అది వివేక్ ఆత్రేయ గారి లాంటి మంచి వ్యక్తిని కలవడమే అని చెప్పుకొచ్చారు కిరీటీ.
షార్ట్ ఫిలిమ్స్ తో పరిచయమై..
కిరీటీ దామరాజు.. షార్ట్ ఫిలిమ్స్ తో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆయన నటించిన ఒక షార్ట్ ఫిలిమ్ కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ కి కూడా ఎంపిక అయ్యింది. ఇక ఆ తర్వాత ఆయన టాలీవుడ్ లో చాలా సినిమాల్లో నటించారు. 'ఉయ్యాల జంపాల', 'ఉన్నది ఒక్కటే జిందగీ', 'డీజే టిల్లు' లాంటి చాలా సినిమాల్లో హీరో ఫ్రెండ్ గా నటించారు. అయితే, డీజే టిల్లు సినిమాలో ఆయన క్యారెక్టర్ తో చాలా మీమ్స్ వచ్చాయి. ఇక రానున్న కాలంలో చాలా ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నానని, ఆ సినిమాలు కూడా అద్భుతంగా ఉంటాయని తన కెరీర్ గురించి చెప్పారు కిరీటీ.
Also Read: కామెడీతో కితకితలు పెట్టిన కీర్తి సురేష్ - ‘రఘు తాత’ ట్రైలర్ చూస్తే పడిపడి నవ్వాల్సిందే!