Raghuthatha Trailer: కామెడీతో కితకితలు పెట్టిన కీర్తి సురేష్ - ‘రఘు తాత’ ట్రైలర్ చూస్తే పడిపడి నవ్వాల్సిందే!
కీర్తి సురేష్ నటించిన తాజా చిత్రం ‘రఘు తాత’. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రబృందం ట్రైలర్ ను విడుదల చేసింది. ఫుల్ కామెడీతో అలరిస్తోంది.
Keerthy Suresh's Raghu Thatha Trailer Is Out: ‘మహానటి’ బ్యూటీ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన తాజాగా చిత్రం ‘రఘు తాత’. సుమన్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. అందులో భాగంగా ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫన్ తో నిండిపోయింది. హిందీ నేర్చుకోవడం సమస్యలు ఎదుర్కోవడంతో పాటు జీవితంలో సవాళ్లను ఎదుర్కొనే యువతి పాత్రలో కీర్తి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. కీర్తి ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడటం ఖాయం అని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
View this post on Instagram
‘రఘు తాత’పై వివాదం క్లారిటీ
ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలయ్యాక కొంత వివాదం చెలరేగింది. హిందీకి వ్యతిరేకంగా ఈ సినిమాను తెరకెక్కించారంటూ విమర్శలు వచ్చాయి. అయితే, ఈ వివాదంపై దర్శకుడు సుమన్ తో పాటు హీరోయిన్ కీర్తి సురేష్ రియాక్ట్ అయ్యారు. “ఈ సినిమా హిందీ భాషకు వ్యతిరేకంగా తెరకెక్కిందంటూ వస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని చెప్పారు. హిందీ భాషపై ఒత్తిడిని వ్యతిరేకిస్తూ రూపొందించిన ఎంటర్ టైన్మెంట్ మూవీ” అని వివరించారు.
మహిళా సమస్యలను చూపించే ప్రయత్నం
అటు కీర్తి సురేష్ ఈ సినిమాకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించింది. “’రఘుతాత’ సినిమాను సరికొత్త కథతో తెరకెక్కించారు. ఒక మహిళ ఎదుర్కొనే అనేక ఇబ్బందులను ఇందులో చాలా చక్కగా చూపించారు. ఈ సినిమా ద్వారా మంచి సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు దర్శకుడు. నిజానికి ఈ సినిమా కథను డైరెక్టర్ నాకు చెప్పినప్పుడు కాస్త భయం అనిపించింది. ఈ పాత్రకు నేను న్యాయం చేయగలనా? అనుకున్నాను. కానీ, ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో నటించడానికి ఓకే చెప్పాను. ఈ సినిమాలో హిందీ భాషను నేర్చుకోవడం తప్పనిసరి అనే విధానాన్ని టచ్ చేస్తూ కొనసాగుతుంది. అలాగే మహిళలపై జరుగుతున్న పలు సంఘటనలను ఖండిస్తూ సాగుతుంది. ఇందులో ఎలాంటి వివాదాలు లేవు. ఈ సినిమా కామెడీతో నిండి ఉంటుంది. ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్ టైయినర్ గా అలరించనుంది” అని వివరించింది.
ఈ సినిమాలో రవీంద్ర విజయ్, ఎమ్మెస్ భాస్కర్ ఆనంద్ సామి, దేవదర్శిని కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ హోం భలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరకిందర్ నిర్మించారు. ఈ సినిమాకు శ్యాన్ రోల్డన్ సంగీతం అందించగా, యామిని జ్ఞానమూర్తి చాయగ్రహణం అందించారు. ప్రస్తుతం కీర్తి సురేష్ బాలీవుడ్ లో హీరో వరుణ్ ధావన్ తో కలిసి ఓ సినిమా చేస్తోంది.
Also Read: అబ్బబ్బా అనసూయ... ముద్దులు ఎక్కడ ఇస్తావ్ రీతూ... శ్రీముఖి మాటల్లో డబుల్ మీనింగ్!