Actor Arjun Kalyan : ‘బిగ్ బాస్’లో శ్రీ సత్యతో లవ్ నిజం కాదా? అదంతా స్క్రిప్టెడా? అసలు విషయం చెప్పేసిన అర్జున్ కల్యాణ్
Actor Arjun Kalyan : బిగ్ బాస్ ప్రతి సీజన్ లో కచ్చితంగా ఒక పెయిర్ ఉంటుంది. ఆ పెయిర్ కి ఫ్యాన్ బేస్ కూడా ఉంటుంది. అలా శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్ ఇద్దరు ఫేమస్ అయ్యారు.
Actor Arjun Kalyan About Sri Satya: బిగ్ బాస్.. సీజన్ ఏదైనా కామన్ పాయింట్ మాత్రం ఒకటి ఉంటుంది. అదే ఒక పెయిర్. వాళ్ల మధ్య నిజంగా ప్రేమ ఉంటుందో లేదో తెలియదు కానీ, వాళ్ల గురించి పుకార్లు మాత్రం షికార్లు చేస్తుంటాయి. ఇక స్క్రీన్ పైన వాళ్ల కెమిస్ట్రీ, ఒకరికి ఒకరు సహకరించుకోవడం చూసిన వాళ్లకు కూడా వాళ్లు నిజంగా ప్రేమించుకుంటున్నారేమో అనిపిస్తుంది. అలా ఇప్పటికి ఎంతోమంది ఫేమస్ అయ్యారు. ఇక వాళ్లకు సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంటుంది. అయితే, బయటికి వచ్చాక మాత్రం వాళ్లు కనీసం కలుసుకున్న దాఖలాలు కూడా ఉండవు. అలాంటి పెయిర్ ఒకటి శ్రీ సత్య, అర్జున్. అయితే, ఇప్పుడు వాళ్ల మధ్య ఉన్న రిలేషన్ గురించి స్పందించాడు అర్జున్. వాళ్ల మధ్య ఉంది ఏంటో చెప్పేశాడు.
మా మధ్య ఏముందంటే?
నీకు శ్రీ సత్యకి మధ్య కెమిస్ట్రీ ఉంది కదా ఏమైనా సినిమా ఆఫర్స్ వచ్చాయా? అని అడిగిన ప్రశ్నకి అర్జున్ సమాధానంగా ఇలా చెప్పాడు. "అలాంటిది ఏమీ లేదు. ఏదో ఒక సాంగ్ కోసం అప్రోచ్ అయ్యారు. బేబీ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అంట. ఆ తర్వాత దాని గురించి ఏమీ మాట్లాడలేదు. అది షూట్ అవుతుందో లేదో కూడా తెలీదు. ఇక శ్రీ సత్యకి నాకు మధ్య ఏమీ లేదు. జస్ట్ ప్రొఫెషనల్ ఫ్రెండ్స్ మాత్రమే మేము. అప్పుడు మాత్రం చాలా మంచి ఫ్రెండ్స్. ఏదో వైబ్ నడిచేది మా మధ్య. లవ్ మాత్రం లేదు. ఇక బిగ్ బాస్ విషయానికొస్తే.. అందులో ఉండేవాళ్లు ఏదో ఒక డ్రామా చేయాలి. ఒకరు ఎమోషనల్ గా, ఒకరు కొట్టుకుంటూ అలా మేమిద్దరం లవ్ డ్రామా ఆడాం అంతే. ఇక ఎలా ఉండాలి అనేది హింట్ ఇస్తారు. ఆడియెన్స్ ద్వారా ఇన్ డైరెక్ట్ గా చెప్తారు. వీకెండ్ షోలో ఆడియెన్స్ వచ్చినప్పుడు మీ నుంచి ఇంకా కంటెంట్ కావాలి లాంటివి చెప్తారు. అలా ఒక వీక్ చెప్పడంతో.. ప్లాన్ చేసుకుని అలా చేస్తాం. టాస్క్ లు ఆడటం లాంటివి కలిసి చేస్తాం అంటూ తన లవ్ స్టోరీ గురించి చెప్పారు అర్జున్.
బయటికి వచ్చాక నాతో చేయను అంది..
ఇక బిగ్ బాస్ అందరికీ ప్లస్ అవుతుందని, బయటికి వచ్చాక కొంతమంది ఫ్రెండ్స్ గా ఉన్నా, కొంతమంది మాత్రం ఛాన్సులు రాకుండా చేస్తారు అంటూ కామెంట్స్ చేశాడు అర్జున్. "బిగ్ బాస్ అందరికీ ప్లస్ అవుతుంది. దాన్ని సరిగ్గా వాడుకోవాలి. బిగ్ బాస్ ద్వారానే నాకు ఎక్కువ ఫేమ్ వచ్చింది. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక కంటెస్టెంట్స్ అందరూ టచ్‌లో ఉంటాం. కానీ, ప్రొఫెషనల్ రైవలరీ, ఇన్ సెక్యూరిటీ మాత్రం ఉంటుంది కొంతమందిలో. హెల్ప్ చేయరు, ఛాన్సులు కూడా రానివ్వకుండా చేస్తారు. కొందరికి ఆన్ స్క్రీన్ ఫ్రెండ్ ఫిప్స్ మాత్రమే ఉంటాయి. నా సీజన్‌లో వాసంతి, సూర్య నాకు మంచి ఫ్రెండ్స్. ఎప్పుడేమి అడిగిన చేయడానికి రెడీగా ఉంటారు వాళ్లు. మిగతా వాళ్లు అంత క్లోజ్ గా ఉండరు. కొన్ని ఛాన్సులు కూడా మిస్ అయ్యేలా చేశారు. నాకు ఒక మంచి డ్యాన్స్ షోలో ఛాన్స్ వచ్చింది. కానీ, అది మిస్ చేశారు. వీడైతే నేను చేయను.. మేం ఇద్దరం పెయిర్ అనుకుంటున్నారు. వేరే వాళ్లను పెట్టండి అని చెప్పింది ఒక యాక్టరస్. నిజానికి పేమెంట్ తక్కువ ఉన్నా ఒప్పుకున్నాను. కట్ చేస్తే.. ఆమె వద్దు అన్నారండీ.. వేరే వాళ్లను సెలెక్ట్ చేశాం" అని చెప్పారు. ఇక బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత సోషల్ మీడియా ద్వారా డబ్బులు ఎక్కువగా వచ్చేది అమ్మాయిలకే.. అబ్బాయిలకి అంత రాదు" అని తన గురించి, తన బిగ్ బాస్ జర్నీ, ఫ్రెండ్ షిప్ గురించి చెప్పుకొచ్చాడు అర్జున్ కల్యాణ్.
బిగ్ బాస్ సీజన్ 6లో పార్టిసిపెంట్ అర్జున్ కల్యాణ్. ఆ సీజన్ లో ఆయనకు శ్రీ సత్యకి మధ్య ఏదో లవ్ ట్రాక్ నడిచిన విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరు వాళ్లను పెయిర్ అనుకున్నారు. కానీ, బయటికి వచ్చాక పరిస్థితి మాత్రం అలా లేదు. గతంలో చాలా సీజన్స్‌లో కూడా ఇలాంటి లవ్ స్టోరీ నడిచింది. కానీ, అవన్నీ నిజం కాదని తేలిన విషయం తెలిసిందే. ఇప్పుడిక అర్జున్, శ్రీ సత్యలది కూడా అలా కాదని అర్జున్ స్వయంగా చెప్పేశాడు.
Also Read: మలయాళీ పాన్ వరల్డ్ మూవీలో అనుష్క - అబ్బో, ఎంత మారిపోయిందో చూశారా?