Monkey Selfie With Abijeet: అభిజీత్‌తో కోతి సెల్ఫీ - ఆ ఫొటో కోతే తీసిందట!
శేఖర్ కమ్ముల సినిమా ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ తో పరిచయమైన అభిజీత్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు. అతడు షేర్ చేసిన కోతితో సెల్ఫీ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీన్ని ఎలా తీశారని ఆరా
‘బిగ్ బాస్’ తెలుగు సీజన్-4 విన్నర్ అభిజీత్‌తో కోతి సెల్ఫీ తీసుకుంది. అదేంటీ? అభిజీత్ కదా కోతితో సెల్ఫీ తీసుకోవాలని అని అనుకుంటున్నారా? ఈ వైరల్ పిక్ చూస్తే అలాగే అనిపిస్తోంది. కోతి తన చేత్తో సెల్ఫీ తీసుకుంటున్నట్లుగా ఉంది. అందుకే ఈ పిక్ సోషల్ మీడియాలో క్రేజీగా చక్కర్లు కొడుతోంది.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' సినిమాతో నటుడిగా అభిజీత్ పరిచమయ్యాడు. ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న సమయంలో ఆ సినిమాలో నటించే అవకాశం దక్కింది. సినీ ప్రస్థానం ప్రారంభమై ఇన్నాళ్లయినా కూడా ఇప్పటి వరకు సరైన బ్రేక్ దక్కలేదు. సినిమాలతో పాటు ‘పెళ్లి గోల’ అనే వెబ్ సిరీస్ ను చేశాడు. సినిమాలు, సిరీస్ లతో కంటే కూడా ‘బిగ్ బాస్’ వల్ల అభిజీత్ కు ఎక్కువ పాపులారిటీ దక్కింది. స్టార్ మా లో ప్రసారం అయిన ఆ షో నాల్గవ సీజన్ విజేతగా నిలిచాడు. ఆ షో తర్వాత వరుసగా సినిమాల్లో నటించే అవకాశాన్ని అభిజీత్ దక్కించుకుంటాడనే అభిప్రాయం వ్యక్తమయింది. కానీ ఇప్పటి వరకు తదుపరి సినిమాను ఈ 'మిర్చి లాంటి కుర్రాడు' స్టార్ ప్రకటించలేదు. ఇతడికి సినిమాల్లో నటించాలనే ఆసక్తి లేదా అనే అనుమానాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు.
సినిమాల్లో కనిపించకున్నా.. షో ల్లో సందడి చేయకున్నా.. సిరీస్ లు చేయకున్నా సోషల్ మీడియాలో మాత్రం అభిజీత్ చాలా యాక్టివ్ గా ఉంటాడు. రెగ్యులర్ గా తన లైఫ్ స్టైల్ కి సంబంధించిన ఫొటోలు, వీడియోలను, సామాజిక అంశాలను, తన మనసుకు నచ్చిన విషయాలపై అభిప్రాయాన్ని షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. అభిజీత్ ఇన్ స్టాగ్రామ్ లో దాదాపుగా మిలియన్ మెంబర్స్ ఫాలోవర్స్ ఉన్నారు. ప్రతి పోస్ట్ కూడా చాలా స్పెషల్ గా ఉండే విధంగా విభిన్నంగా ఆలోచిస్తాడనే అభిప్రాయం నెటిజన్స్ లో ఉంది. కొద్దిసేపటి క్రితం అభిజీత్ ఈ ఫొటోను షేర్ చేశాడు. దీన్ని చూస్తూ ఉంటే కోతి సెల్ఫీ తీసినట్లుగా అనిపిస్తుంది. ఇది నిజమేనా.. అసలు కోతి సెల్ఫీ ఎలా తీయగలిగిందని అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా కెమెరా ట్రిక్ ఉపయోగించి ఉంటారేమోనని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే మరి కొందరు అభిజిత్ అంటే ఆ కోతికి అభిమానమై ఉంటుంది.. అందుకే ఇలా సెల్ఫీ తీసుకుందని ఫొటోను తెగ షేర్ చేయడంతో వైరల్ అయింది.
View this post on Instagram
‘బిగ్ బాస్’ తర్వాత బిజీ కాలేదు...
ఈ ఫొటో ఎవరు తీశారంటూ ఒక వ్యక్తి అడిగిన సందర్భంగా అభిజీత్ స్పందిస్తూ.. కోతి అని సమాధానం ఇచ్చాడు. కోతితో సెల్ఫీ భలే ఉందంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకు అభిజీత్ ఎన్నో ఫొటోలు ఇన్ స్టా గ్రామ్ ద్వారా షేర్ చేశారు... అయితే ఈ ఫొటో మాత్రం చాలా స్పెషల్ గా ఉందంటూ ఆయన అభిమానులతో పాటు చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి ఫొటోలతో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్న అభిజీత్ ను వెండి తెరపై చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఆయన తిరిగి సినిమాల్లో నటించేది ఎప్పుడంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. సినిమాల్లో కాకున్నా సిరీస్ ల్లో నైనా అభిజీత్ ను చూడాలని కోరుకుంటున్న వారు ఉన్నారట. ‘బిగ్ బాస్’ తర్వాత దక్కిన పాపులారిటీ స్టార్ డమ్ ను ఇతడు సద్వినియోగం చేసుకోవడంలో విఫలం అవుతున్నాడనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. వాటికి అభిజీత్ నుండి వచ్చే సమాధానం ఏంటో చూడాలి. అభిజీత్ ఓకే చెప్పాలే కానీ పలువురు కొత్త దర్శకులు కథలతో సిద్ధంగా ఉన్నారట.. కానీ అభిజీత్ మాత్రం కథల ఎంపిక విషయంలో కన్ఫ్యూజన్ లో ఉన్నాడా లేదా సినిమాల్లో నటించే విషయమై ఆసక్తిని కలిగి లేడా అంటూ మీడియా సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.
Also Read : శృతి హాసన్ మందు కొట్టి ఆరేళ్ళ - బీర్ కూడా నాన్ ఆల్కహాలిక్ అయితేనే