అన్వేషించండి

Bigg Boss 8 Telugu Elimination 3rd week: బిగ్ బాస్‌ని తిడితే ఊరుకుంటారా... నిజంగా బయటకు గెంటేస్తున్నారు, ఈ వారం ఎలిమినేషన్ ఇతడిదే!

Bigg Boss 8 Telugu Elimination This Week: గేమ్ ఆడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే ఏం జరుగుతుందో చెప్పడానికి ఈ వారం 'బిగ్ బాస్ 8' తెలుగు ఎలిమినేషన్ ఉదాహరణ.

Bigg Boss 8 Telugu Elimination This Week 3: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వచ్చిన 'అత్తారింటికి దారేది' సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. 'జీతాలు ఇచ్చే వాడి మీద జోకులు వేస్తే జీవితం తలకిందులు అయిపోతుంది' అని! అభయ్ నవీన్ అలియాస్ అభయ్ బేతిగంటి పరిస్థితి చెప్పడానికి ఇప్పుడు ఆ డైలాగ్ సరిగ్గా సరిపోతుంది.‌ ఎందుకు అంటే...

మూడో వారం ఎలిమినేట్ అయ్యేది అతడే!
స్టార్ మా టీవీ ఛానల్ బిగ్ బాస్ షో మొదలుపెట్టి మూడు వారాలు పూర్తి కావస్తుంది.‌ మొదటివారం ఇంటి నుంచి బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయ్యారు. ఆ తర్వాతి వారం ఆర్జే శేఖర్ బాషా ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు మూడో వారం ఆట తుది దశకు చేరుకుంది. మరి ఈ వారం బయటికి ఎవరు వస్తున్నారో తెలుసా? అభయ్ నవీన్ అలియాస్ అభయ్ బేతిగంటి.

అవును... బిగ్ బాస్ 8 నుంచి మూడో వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ అభయ్ నవీన్ అని ఇన్‌సైడ్ వర్గాల టాక్. ఇంటి నుంచి బయటకు రావడానికి అతని ఆట కంటే ఒక విధంగా అతని నోటి దురుసు, ఆటలు ఆడే సమయంలో చూపించిన ప్రవర్తన కారణమని చెప్పాలి. 

ఆట ఆడించే వాడినే తిడితే ఎలా అభయ్ నవీన్?
అభయ్ నవీన్ ఎలిమినేషన్ కావడం వెనుక కారణాలు ఏమిటి? అని ఆరా తీస్తే... విశ్లేషణ చేస్తే... బిగ్ బాస్ మీద నోరు జారడం ప్రధాన కారణం కింద కనిపిస్తుంది. బిగ్ బాస్ ఇంటిలో బిగ్ బాస్ పెట్టిన రూల్స్ ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే. అయితే అభయ్ నవీన్ ఆ రూల్స్ మీద మండిపడ్డాడు. ఏకంగా బిగ్ బాస్ మీద బూతులు తిడుతూ విరుచుకుపడ్డాడు. ఒక్కసారి, రెండు సార్లు కాదు ఈ విధంగా నాలుగు ఐదు సార్లు జరిగింది.

అభయ్ నవీన్ ప్రవర్తన పట్ల హోస్ట్ నాగార్జున సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనికి రెడ్ కార్డ్ చూపించారు. బిగ్ బాస్ మీద తర్వాత తర్వాత వారాల్లో ఎవరైనా నోరు జారితే ఏం జరుగుతుందో అభయ్ నవీన్ ఎలిమినేషన్ ద్వారా మిగతా కంటెస్టెంట్లకు ఒక క్లారిటీ వచ్చి ఉండాలి.

Also Read: ఆహా ఇండియన్ ఐడల్ 3 విన్నర్‌గా ఏపీ మెకానిక్ కొడుకు... 'ఓజీ'లో పాడే గోల్డెన్ ఛాన్స్ కూడా

బయటకు వచ్చిన తర్వాత అయినా సైలెంట్ అవుతాడా?
బిగ్ బాస్ రియాల్టీ షో ఫాలో అయ్యే వీక్షకులకు వచ్చే మొదటి సందేహం... అభయ్ నవీన్ బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? అని! షో మధ్యలో ఒకటి రెండు సార్లు బయటకు వెళ్లిన తర్వాత కూడా బిగ్ బాస్ పట్ల తన ప్రవర్తన ఇదే విధంగా ఉంటుందని అభయ్ నవీన్ తెలిపాడు. ఈ మాటలు అని వారం కూడా గడవకముందే అతడిని బయటకు పంపించేశారు. ఇక బయటకు వచ్చిన తర్వాత ఏ విధంగా రెచ్చిపోతాడు? ఎలా చెలరేగుతాడు? అనేది చూడాలి.

Also Read: 'దేవర' ఫస్ట్ రివ్యూ: సినిమా చూసిన రాజమౌళి ఫ్రెండ్ - లాస్ట్ అరగంట అదిరిందంతే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget