Bigg Boss 6 Telugu: ఏందే? నువ్వు బాత్రూమ్‌లోకి వెళ్లి తలుపులేసుకుంటావ్, నేను డోర్లు తన్నుకునిపోతా - ఇనయాపై ఆదిరెడ్డి ఫైర్
బిగ్ బాస్ ఇంట్లో కెప్టెన్సీ టాస్క్ చివరి దశకి చేరింది. ఎన్నడూ లేనిది కూల్ బాయ్ రోహిత్ కి కూడా కోపం వచ్చేసింది.
బిగ్ బాస్ ఇంట్లో కెప్టెన్సీ టాస్క్ చివరి దశకి చేరుకుంది. ఎప్పుడు కూల్ గా ఉండే రోహిత్ నిన్న ఫైర్ అయ్యాడు. ఈ వారం కెప్టెన్ అయ్యేందుకు బిగ్ బాస్ ‘వస్తా.. నీ వెనుక’ అనే టాస్క్ ఇచ్చారు. అందులో అందరూ చాలా గట్టిగానే ఆడేందుకు ట్రై చేశారు. కెప్టెన్సీ కంటెండర్లుగా కీర్తి, ఫైమా, శ్రీసత్య, రోహిత్, ఆదిరెడ్డి, మెరీనా నిలిచారు. ఒక్కో రౌండ్లో ఒక్కొక్కరు అవుట్ అవుతూ.. చివరికి ఫైమా, శ్రీసత్య, ఆదిరెడ్డి మాత్రమే మిగిలారు. ఇక రోజు టాస్క్ చివరికి వచ్చేసింది. దీనికి సంబంధించిన ప్రోమో వదిలారు.
తాజా ప్రోమో ప్రకారం ఇనయాని ఆదిరెడ్డి మళ్ళీ టార్గెట్ చేశాడు. ఆదిరెడ్డి అయితే కాస్త నోటి దురుసు ఎక్కువగానే చూపించినట్లు కనిపిస్తోంది. ఒక ఆడపిల్లతో మాట్లాడుతున్నాడనే విషయం కూడా మరిచి.. ఏందే అని సంబోధించాడు. ఇక రోహిత్.. సంచాలక్ గా ఉన్న రేవంత్ ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండటంపై బాలాదిత్యతో చెప్పి అసహనం వ్యక్తం చేశాడు. వాళ్ళ మీద అటాక్ చేసేటప్పుడు వదిలేయ్ అంటారు. కానీ తన మీద అటాక్ చేసేటప్పుడు మాత్రం కంటిన్యూ అన్నట్లుగా ఉంటారా అని బాలాదిత్యతో చెప్పుకున్నాడు.
ఆదిరెడ్డి, శ్రీసత్య ఒకరి బ్యాగులు ఒకళ్ళు లాక్కుంటూ కనిపించారు. అంత చేస్తున్నా కూడా శ్రీసత్య నవ్వుతూ ఉంది. కానీ ఫైట్ చేసేందుకు సిద్ధంగా లేదు. శ్రీహాన్ మాత్రం అది చూసి కాస్త ఫీల్ అయినట్లు కనిపించాడు. ఆదిరెడ్డి కావాలనే కలిసి ఆది ఫైమాని గెలిపించడానికి ట్రై చేస్తున్నట్టు కనిపించిందని ఎవరో అన్నారు. మీరు ఏమైనా అనుకోండి అని ఆదిరెడ్డి నిర్లక్ష్యంగా మాట్లాడాడు. ఇనయా కూడా ఇదే విషయాన్ని ప్రశ్నిస్తే.. ‘‘నువ్వేమి పీకలేవు’’ అని ఆదిరెడ్డి చాలా అగ్రెసివ్ గా బదులిచ్చాడు. గీతూ ఇలాగే సపోర్ట్ చేసి వాళ్ళని గెలిపించింది, ఇప్పుడు మీరు సపోర్ట్ చేసి గెలిపించడం స్టార్ చేశారా? అని అంది. దీంతో ఆదిరెడ్డి చాలా కోపంగా ‘‘ఆ.. ఏందే’’ అని నోటిదురుసుగా అగౌరవంగా సంబోధిస్తూ మాట్లాడాడు. తను తెలిసి ఏ తప్పు చేయలేదని, కావాలంటే నాగార్జున గారితో మాట్లాడు ఫైమాతో కలిసి ప్లాన్ చేసి ఆడినట్టు నిరూపిస్తే డోర్స్ తన్నుకుని బయటకి వెళ్లిపోతానని ఆదిరెడ్డి ఇనయాకి ఛాలెంజ్ విసిరాడు.