By: ABP Desam | Updated at : 16 Dec 2022 07:12 PM (IST)
Edited By: Mani kumar
image credit :Ashu Reddy/instagram
‘బిగ్ బాస్’ ఫేమ్ అషు రెడ్డి గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో యాక్టీవ్ ఉండే అషురెడ్డి టిక్ టాక్ వీడియోలతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. నెట్టింట జూనియర్ సమంతగా పేరు తెచ్చుకొని అదే పాపులారిటీతో తర్వాత ‘బిగ్ బాస్’ లో ఛాన్స్ కొట్టేసింది. కానీ హౌస్ లో ఎక్కువ వారాలు ఉండలేకపోయింది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ మరింత పాపులారిటీ తెచ్చుకుంది.
అషురెడ్డి పలు టీవీ ప్రోగ్రాంలలో కూడా కనిపిస్తోంది. అయితే ఈ ముద్దుగుమ్మ గురించి ఓ ఇంట్రస్టింగ్ వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అషురెడ్డి ‘A మాస్టర్ పీస్’ అనే సినిమాలో మెయిన్ లీడ్ లో కనిపించనుంది. ఈ సినిమాలో అషురెడ్డి ‘ఆద్య’ అనే పాత్రలో నటించనుందని తెలుస్తోంది. ఈ సినిమాకు సుకు పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్, థ్రిల్లర్ మూవీగా ఈ చిత్రం తెరకెక్కనుందని టాక్. సుకు పూర్వాజ్ గతంలో ‘శుక్ర’, ‘మాటరాని మౌనమిది’ వంటి సినిమాలను తీశారు. ఈ చిత్రాన్ని కండ్రగుల శ్రీకాంత్ నిర్మిస్తున్నారు. అరవింద్ కృష్ణ ఈ మూవీలో హీరోగా కనిపించనున్నారు. ఈ సినిమా పోస్టర్ ని బట్టి చూస్తే అరవింద్ కృష్ణ సూపర్ పవర్ ఉన్న హీరోగా కనిపిస్తారనే టాక్ నడుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
ఇక అషురెడ్డి పవన్ కల్యాణ్ వీరాభిమానిగా చెప్పుకుంటూ మంచి పబ్లిసిటీ కొట్టేసింది. పవన్ కల్యాణ్ పేరును పచ్చబొట్టు కూడా పొడిపించుకుంది. అంతేకాకుండా బుల్లి తెరపై కూడా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఇటీవల వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో అషురెడ్డి చేసిన ఇంటర్వ్యూలు చర్చనీయాంశంగా మారాయి. ఆ మధ్య రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ పై ఇంటర్నెట్ లో పెద్ద చర్చే జరిగింది. ఆ ఇంటర్య్యూ జరిగిన విధానంపై కూడా నెగిటివ్ కామెంట్లు వచ్చాయి. అయినా కూడా ఈ అమ్మడు బోల్డ్ పబ్లిసిటీ లో ఎక్కడా తగ్గలేదు. అంతే కాదు ఇటీవల ఆర్జీవితో మరో ఇంటర్య్వూ చేసి మళ్లీ వార్తల్లోకెక్కింది.
Also Read : 'జగమే మాయ' రివ్యూ : డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైన ధన్యా బాలకృష్ణ సినిమా ఎలా ఉందంటే?
ఇటీవల ఆర్జీవి తెరకెక్కించిన ‘డేంజరస్’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అషురెడ్డితో ఇంటర్వ్వూ ప్లాన్ చేశారు వర్మ. ఆ ఇంటర్వ్యూ చివర్లో ఆర్జీవి అషురెడ్డి పాదాలకు ముద్దు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై నెటిజన్స్ తీవ్ర స్థాయిలో నెగిటివ్ కామెంట్స్ చేశారు. తర్వాత దీనిపై ఆర్జీవీ ప్రత్యేకంగా వీడియో చేశారు. అయినా ట్రోలింగ్స్ మాత్రం ఆగలేదు. అయితే ఈ మేటర్ పై అషురెడ్డి మాత్రం స్పందించకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లి పోతుంది. తాజాగా సినిమాలో ఛాన్స్ తో మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. మరి ఈ సినిమా అషు రెడ్డి సినిమా కెరీర్ కు ఎలాంటి బూస్ట్ ఇస్తుందో చూడాలి.
మే నెలలో డబ్బింగ్ సినిమాలదే హవా - ఈ మూవీస్‌కు పాజిటీవ్ రెస్పాన్స్!
Mentoo Movie: ఓటీటీలోకి ‘మెన్ టూ’ మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అవికా గోర్ '1920 హారర్ ఆఫ్ ది హార్ట్' ట్రైలర్ చూశారా - వెన్నులో వణుకు పుట్టడం ఖాయం!
ఆ ఐదేళ్లు నేను చెన్నైవాడిని కాదని చెప్పుకోవడమే సరిపోయేది: రానా
వచ్చేస్తోంది తమన్నా కొత్త వెబ్ సీరిస్ - స్ట్రీమింగ్ ఆ ఓటీటీలోనే!
YS Viveka Murder Case: వైఎస్ భాస్కర్‌రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఓకే, ప్రత్యేక కేటగిరీ ఖైదీగా ఎంపీ అవినాష్ తండ్రి
Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !
Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో
Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు