Bigg Boss: కత్తితో కసకస పొడిచేసుకున్న సూర్య- కన్నీళ్ళు పెట్టుకున్న కీర్తి
బిగ్ బాస్ ఇంట్లో కెప్టెన్సీ టాస్క్ కొనసాగుతోంది. ఇంటి సభ్యుల మద్దతు కూడగట్టుకునేందుకు కెప్టెన్సీ పోటీదారులుగా ఉన్న ముగ్గురు పోటీ పడుతున్నారు.
బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ కొనసాగుతోంది. ఈ వారం ఇంటికి ఎవరు కెప్టెన్ అవుతారో మరికొన్ని గంటల్లో తెలిపోతుంది. ఇంటి సభ్యుల మద్దతు కోసం కెప్టెన్సీ పోటీదారులుగా ఉన్న కీర్తి, సూర్య, శ్రీహాన్ ప్రయత్నిస్తున్నారు. మెడలో C అక్షరం ఉన్న ట్యాగ్ వేసుకునే ఇంట్లో తిరుగుతూ కనిపించారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో ప్రకారం కెప్టెన్సీ టాస్క్ మళ్ళీ మొదలైనట్టు బిగ్ బాస్ ప్రకటించాడు.
బాలాదిత్య, గీతూ మధ్య మళ్ళీ మాటల యుద్ధం నడిచింది. రోజురోజుకీ గీతూ మరింత దారుణంగా ప్రవర్తిస్తోంది. నేను ఇంతే నేను చెయ్యను అంటూ యాటిట్యూడ్ చూపిస్తూ అందరికీ చిరాకు తెప్పిస్తోంది. కూరగాయ తొక్కలు వెంటనే తీసేస్తే పని అయిపోతుంది కదా అని బాలాదిత్య అంటే.. నేను చెయ్యను అని రూడ్ గా సమాధానం చెప్పింది. నీ మాట తీరుతో పెంట చేసుకుంటున్నావ్ అని బాలాదిత్య అంటే.. చేసుకుంటే నేనే పోతాను కదా బి హ్యాపీ అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చింది. నువ్వు బాగుపడితేనే.. నేను హ్యాపీగా ఉంటాను. అదే నీకు, నాకు తేడా అని ఆదిత్య చెప్పాడు. మళ్ళీ కెప్టెన్సీ టాస్క్ మొదలైనట్టు బిగ్ బాస్ చెప్పాడు.
మీ ముగ్గురు కెప్టెన్సీ పోటీకి డిజర్వ్ అని మేరీనా పేర్కొంది. శ్రీ సత్య, వాసంతి కెప్టెన్సీకి పోటి పడుతున్న వారి గురించి తమ అభిప్రాయాలు చెప్పారు. సూర్య, కీర్తి ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. కెప్టెన్సీ పోటీ కోసం టాస్క్ పెట్టకుండా ఇది పెట్టారని కీర్తి అంటుంటే సూర్య లాస్ట్ టైమ్ కూడా నువ్వు ఇంటి సభ్యుల మద్దతుతోనే కదా కెప్టెన్ అయ్యిందని అంటాడు. దీని గురించే కీర్తి మాట్లాడుతుంటే సూర్య పట్టించుకోకుండా ఫైమా టీ తాగేశావా నువ్వు అని అడుగుతాడు. తను మాట్లాడుతున్నా పట్టించుకోకుండా అక్కడ టీ గురించి అడుగుతున్నావ్ అని కీర్తి చెవులు మూసుకుని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. అది చూసి సూర్య తన C లెటర్ మీద ఉన్న కత్తితో కసకస పొడిచేసుకున్నాడు.
గురువారం నాటి ఎపిసోడ్లో గీతూనే బిగ్ బాస్ లాగా వ్యవహరించింది. అంతా ఆమె అనుకున్నట్టే జరిగింది. ఇనయా శ్రీహాన్‌కు కత్తి గుచ్చింది. దీంతో శ్రీహాన్ చాలా బాధపడిపోయాడు. ‘ప్రోమో కోసమే ఇదంతా చేస్తుంది. ఎవరైనా నీది సూర్యది బాండింగ్ మిస్ అవుతోంది అంటే వెళ్లి అతడితో కలిసిపోయినా ఆశ్చర్యంలేదు. ప్రతిసారి సరదాగా తీసుకుంటాను అనుకుంటుందేమో, సమయం వచ్చినప్పుడు చెబుతా. యాక్టింగ్ చేస్తోంది. వారానికో రంగు మారుస్తోంది. నమ్మకద్రోహం చేస్తుంది. నాకు ఈ రోజు కత్తి గుచ్చినందుకు బాధపడేలా చేస్తా’’ అంటూ తనలో తానే రగిలిపోయాడు శ్రీహాన్. కాగా కెప్టెన్ శ్రీహాన్ అయ్యాడు. కాకపోతే అతను కెప్టెన్ అయిన విశేషాలు మరుసటి ఎపిసోడ్లో చూపించనున్నారు.
Also read: ఎట్టకేలకు శ్రీహాన్ కెప్టెన్? గీతూ అనుకున్నట్టే అయింది అంతా, ఇక బిగ్‌బాస్ ఎందుకు?
The captaincy task brings out a lot of emotions in the Bigg Boss house!
— starmaa (@StarMaa) October 28, 2022
Ee vaaram captain ayyedi evaru? To find out, watch today's episode of Bigg Boss on @StarMaa, streaming 24/7 on @DisneyPlusHSTel.#BiggBossTelugu6 #BBLiveOnHotstar#StarMaa #DisneyPlusHotstar pic.twitter.com/DhtclZmtDt