Bigg Boss Fame Sarayu: విజయ్ సేతుపతి సినిమా రిఫరెన్స్ తీసుకునే, పోలీస్ కేసుపై సరయు క్లారిటీ
బిగ్ బాస్ ఫేమ్ సారాయిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు.
యూట్యూబర్ 7 ఆర్ట్స్ సరయు తన కంటెంట్ తో బాగా పాపులర్ అయింది. బోల్డ్ వీడియోలను రూపొందిస్తూ.. యూత్ ని బాగానే ఎట్రాక్ట్ చేసింది. బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్ గా పాల్గొంది. ఇటీవల ఆమెని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతో పాటు ఆమె అనుచరులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశమైంది. సరయుతోపాటు ఆమె టీమ్‌లో ఉన్న దర్శక నిర్మాత, శ్రీకాంత్ రెడ్డి, నటులు కార్తీక్, కృష్ణ మోహన్‌లను కూడా అరెస్ట్ చేశారు. వారిని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. నోటీసులు కూడా జారీ చేశారు.
ఆమె నటించిన ఓ షార్ట్ ఫిలిం హిందూ సమాజాన్ని మహిళలను కించపరిచే విధంగా ఉందంటూ సిరిసిల్ల జిల్లా విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు చేపూరి అశోక్ చేసిన ఫిర్యాదు మేరకు ఆమెపై ఇదివరకు కేసు ఫైల్ చేశారు. ఈ కేసులో భాగంగానే ఆమెని అరెస్ట్ చేశారు . ఇదిలా ఉండగా.. ఈ కేసు గురించి సరయు ఇచ్చిన వివరణకి సంబంధించిన ఇంటర్వ్యూ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సిరిసిల్లలో 7 ఆర్ట్స్ కి చెందిన ఒక బిర్యానీ ఫ్రాంచైజీ ఓపెన్ అయిందని.. ఈ బిరియానీ ప్రమోషన్ లో గణపతి బప్పా రిబ్బన్ కట్టుకొని మందు తాగామని చెప్పింది సరయు. ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికి అలా చేయలేదని.. విజయ్ సేతుపతి సినిమాలో ఒక సీన్ ను రిఫరెన్స్ గా తీసుకునే అలా చేశామని చెప్పుకొచ్చింది. కానీ సిరిసిల్లలో విశ్వ హిందూ పరిషత్ వాళ్లకు అది నచ్చలేదని.. ఒక సీన్ వారి మనోభావాలను కించపరిచేలా ఉందని అభ్యంతరం చెప్పడంతో ఆ సన్నివేశాన్ని తొలగించమని చెప్పింది. ఆ తరువాత బిరియానీ పాయింట్ ఓపెన్ చేశామని తెలిపింది.
అంతా అయిపోయిందనుకున్న సమయంలో ఏడాది తరువాత ఆ కేసుని బంజారాహిల్స్ కు బదిలీ చేశారని.. పోలీస్ విచారణకు వెళ్లొచ్చామని తెలిపింది. మమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించామంటున్నారు కానీ అది జరగలేదని చెప్పింది. ఒక నటిగా దర్శకుడు చెప్పినట్లుగా వింటానని..నేనూ ఓ హిందూనే అని ఆవేదన వ్యక్తం చేసింది. హిందూ మతం గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా.. సహించనని.. ఒక హిందూ అమ్మాయిగా హిందువుల మనోభావాలను కించపరచనని చెప్పుకొచ్చింది. తన కారణంగా ఎవరి మనోభావాలైనా దెబ్బ తిని ఉంటే క్షమించమని కోరింది.
View this post on Instagram