Bigg Boss Beauty: పెళ్లి పీటలెక్కబోతున్న బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక సింగ్? హల్దీ ఫోటోలు వైరల్
హల్దీ వేడుకల్లో పెళ్లి కూతురిలా ముస్తాబైన బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక సింగ్.
బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక సింగ్ అందరికీ షాక్ ఇచ్చింది. పెళ్లి కూతురులా ముస్తాబై హల్దీ వేడుకల్లో పాల్గొంది. గత కొన్ని రోజులుగా ప్రియాంక సింగ్ పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి. వాటికి మరింత ఊతం ఇచ్చేలాగా ఇప్పుడు ఈ నటి హల్దీ వేడుకలో పాల్గొన్న ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. పెళ్లి కూతురులాగా ముఖానికి పసుపు రాసుకుని కనిపించింది. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ఇవి చూసిన అందరూ కంగ్రాట్స్ ప్రియాంక అంటూ విషెస్ చెప్తున్నారు. అయితే ప్రియాంక సింగ్ నిజంగానే పెళ్లి చేసుకోబోతుందా లేక ఫోటో షూట్ కోసం ఈ సెటప్ అనేది అర్థం కావడం లేదు. దీనికి సంబంధించి వీడియో, ఫోటోలు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అందులో ప్రియాంక పసుపు రంగు చీర కట్టుకుని పెళ్లి కూతురిలా ముస్తాబై మెరిసిపోతోంది.
ప్రియాంక సింగ్ అసలు పేరు సాయి తేజ. జబర్దస్త్ లో లేడీ గెటప్స్ వేస్తూ పాపులారిటీ సంపాదించుకున్నాడు. తర్వాత లింగ మార్పిడి చేసుకుని ప్రియాంక సింగ్ గా మారాడు. నాగార్జున హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్ గా ‘అమ్మాయి’గా అడుగుపెట్టింది. సీరియల్ నటుడు మానస్ తో కలిసి బిగ్ బాస్ హౌస్ లో రొమాన్స్ చేసింది. మానస్ వెంటే తిరుగుతూ తనంటే ఇష్టమని చాలా సార్లు చెప్పింది కూడా. బిగ్ బాస్ తో తనకి మరింత పాపులారిటీ వచ్చేసింది. తను లింగ మార్పిడి చేయించుకున్న విషయం తన తండ్రికి తెలియదని హౌస్ లో ఉన్నప్పుడు చెప్తూ ఎమోషనల్ అయ్యింది. బిగ్ బాస్ హౌస్ ద్వారానే ఈ విషయం తన తండ్రికి చెప్తునట్టు ఆమె చెప్పారు. హౌస్ నుంచి బయటకి వచ్చిన తర్వాత ప్రియాంక సింగ్ ని కలుసుకున్న తన తండ్రి ఎమోషనల్ అయ్యారు. తనని ప్రేమగా దగ్గరకై తీసుకున్నారు. ప్రియాంక సింగ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందమైన లేటెస్ట్ ఫోటోస్ ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ అభిమానులని అలరిస్తోంది.
Also Read : ఎన్టీఆర్ రాక కోసం ఎదురు చూస్తున్న సకల అస్త్రాలకు అధిపతి
Also Read : తెలుగులో డిజాస్టర్ దిశగా 'లైగర్', హిందీలో బెటర్ - రోజు రోజు విజయ్ దేవరకొండ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?
View this post on Instagram