Amardeep - Supritha Movie: హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న సురేఖ వాణి కూతురు, ‘బిగ్ బాస్’ అమర్ దీప్‌తో సుప్రిత కొత్త మూవీ
Amardeep - Supritha Movie: ‘బిగ్ బాస్’ ఫేమ్ అమర్ దీప్, నటి సురేఖ వాణి కూతురు సుప్రిత హీరోయిన్ గా కొత్త సినిమా ప్రారంభం అయ్యింది. ఈ చిత్రానికి మాల్యాద్రి రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
Amardeep - Supritha New Movie Launched: ‘బిగ్ బాస్’ ఫేమ్ అమర్ దీప్ హీరోగా, నటి సురేఖావాణి కుమార్తె సుప్రిత హీరోయిన్ గా నూతన సినిమా ప్రారంభం అయ్యింది. దర్శకుడు మాల్యాద్రి రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మహర్షి కూండ్ల సమర్పణలో ఎం3 మీడియా బ్యానర్‌పై మహా మూవీస్‌తో కలిసి మహేంద్ర నాథ్ కూండ్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో పూజా కార్యక్రమంతో ఈ సినిమా మొదలయ్యింది. ముహూర్తపు సన్నివేశానికి బసిరెడ్డి క్లాప్ కొట్టారు. ఏఎం రత్నం కెమెరా స్విచ్ ఆన్ చేశారు. వీర శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.
సరికొత్త కథాంశంతో తెరకెక్కుతున్న అమర్ దీప్- సుప్రిత మూవీ
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని పాయింట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల తెలిపారు. ఎం 3 బ్యానర్ మీద ప్రొడక్షన్ నెం. 2గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. అమర్ దీప్, సుప్రిత జంటగా నటించబోతున్న ఈ సినిమాను దర్శకుడు మాల్యాద్రి అద్భుతంగా తెరకెక్కించబోతున్నారని తెలిపారు. తన లాంటి కొత్త వాళ్లను ఎం3 మీడియా ఎంతో ప్రోత్సహిస్తోందని దర్శకుడు మాల్యాద్రి తెలిపారు. ఇంకా తమలాంటి కొత్తవాళ్లను, యంగ్ టాలెంట్ పర్సన్స్ ను ఎంకరేజ్ చేయాలని కోరారు.
అమర్ దీప్- సుప్రిత ఏమన్నారంటే?
‘బిగ్ బాస్’ కంటే ముందే ఈ చిత్రాన్ని ఓకే చేసినట్లు అమర్ దీప్ తెలిపారు. “డైరెక్టర్ మాల్యా నా ఫ్రెండ్. ‘బిగ్ బాస్’ ఇంట్లోకి వెళ్లే ముందు సైన్ చేసి వెళ్లాను. చాలా ఏళ్లుగా ఈ ప్రాజెక్ట్ నా కోసం రాసుకున్నారు. నా కోసమే డిజైన్ చేశారు. నిర్మాత మహేంద్ర గారి సపోర్ట్ ఎప్పుడూ మరచిపోలేను. ఆయన ఆర్టిస్టులకు ఎంతో గౌరవం ఇస్తుంటారు. సుప్రితతో పని చేయడం ఆనందంగా ఉంది” అని తెలిపారు. అటు తనకు హీరోయిన్ గా అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు సుప్రిత ధన్యవాదాలు చెప్పింది. అమర్ దీప్ నటించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పింది. తమను సపోర్ట్ చేసిన వాళ్లందరికీ థ్యాంక్స్ చెప్పింది. దర్శక నిర్మాతల మీద నమ్మకంతోనే తన బిడ్డను వాళ్ల చేతుల్లో పెట్టానని నటి సురేఖ వాణి వెల్లడించింది. అమర్ దీప్, సుప్రితను ఆశీర్వదించడానికి ఎంతో మంది తరలి రావడం పెద్ద విజయంలా అనిపించిందన్నారు.
ఇక ఈ సినిమాలో సురేఖ వాణి, రాజారవీంద్ర, రూపాలక్ష్మి, వినోద్ కుమార్, ఎస్తేర్ నొరోన్హా, ఆకు మాణిక్ రెడ్డి, తల్లాడ సాయి కృష్ణ, మహబూబ్ బాషా, జబర్దస్త్ దుర్గారావు సహా పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాస్ కడియాల మ్యూజిక్ అందిస్తుండగా, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ బాధ్యతలను బాల సరస్వతి నిర్వహిస్తున్నారు. మేకప్ చీఫ్ గా భానుప్రియ అడ్డగిరి, కాస్ట్యూమ్ డిజైనర్: రోజా భాస్కర్, ప్రొడక్షన్ మేనేజర్: శ్రావణ్ కుమార్ వందనపు, బాలు ప్రభాస్, మాటలు: మరుధూరి రాజా, ఫైట్స్: రాజేష్ లంక, ఆర్ట్ డైరెక్టర్: అశోక్ నర్రా, ఎడిటర్ గా మేనగ శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారు.
Read Also: సుహాస్‌ను చూస్తే నన్ను నేను చూసుకున్నట్టు ఉంటుంది, అందుకే ‘తండేల్‘ సినిమా చెయ్యొద్దన్నాను- బన్నీవాస్