Actor Shivaji: ‘వ్యూహాం’ను మడిచి పెట్టుకోమనండి, వాళ్లంతా పోరంబోకులు - ఆర్జీవీపై బిగ్ బాస్ శివాజీ కామెంట్స్
Actor Shivaji: ‘నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ శివాజీ ఆర్జీవీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ పోరంబోకు అని మండిపడ్డారు. వైసీపీ ఇచ్చే డబ్బు కోసం ఆశపడి అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు.
Actor Shivaji about Vyuham Movie: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ ‘వ్యూహం’. డిసెంబర్ 29న విడుదల కావాల్సి ఉండగా, తెలంగాణ హైకోర్టు రిలీజ్ ను నిలిపివేసింది. చంద్రబాబు ప్రతిష్టని దెబ్బతీసేలా తెరకెక్కించారని, ఆ సినిమా రిలీజ్ ని అడ్డుకోవాలంటూ టీడీపీ నాయకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు, సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని అభిప్రాయపడింది. ఈ మేరకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ను నిలిపివేసింది. జనవరి 11 వరకు ఈ చిత్రాన్ని విడుదల చేయకూడదని మేకర్స్ ను ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 11కి వాయిదా వేసింది.
ఆర్జీవీ మాటలు వినేవాళ్లంతా పోరంబోకులే- శివాజీ
తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో పాటు ‘వ్యూహం’ సినిమాపై నటుడు శివాజీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కమ్మవాళ్ల గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్న ఆర్జీవీ, ఆయనకు సీనీ కెరీర్ ఇచ్చిందే కమ్మోడు అనే విషయాన్ని గుర్తుచుకోవాలి అన్నారు. “అర్జీవీకి జీవితం ఇచ్చిందే కమ్మోడు. ఆయన సహకారంతోనే సినిమాల్లోకి వచ్చాడు. ఆర్జీవీ ఓ తెలివైన బిజినెస్ మ్యాన్. చంద్రబాబు నాయుడును తిట్టిన వాళ్లను జగన్ దగ్గరికి తీసుకుంటాడు. ఆర్జీవీ ఆ వీక్ నెస్ ను వాడుకుంటున్నాడు. ఆయన ‘వ్యూహం‘ సినిమాను మడిచి బ్యాగ్ లో పెట్టుకోవడం మంచిది. జగన్ ఫండింగ్ చేస్తున్నాడు కాబట్టి బాబుకు వ్యతిరేకంగా సినిమా చేశాడు. రేపు చంద్రబాబు ఫండింగ్ చేస్తే ఇదే వ్యక్తి జగన్ కు వ్యతిరేకంగా సినిమా చేస్తాడు. ఇవాళ హడావిడి చేస్తున్న వాళ్లంతా రాష్ట్ర విభజన రోజు సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాల్లో పాల్గొన్నారా? ఈ పోరంబోకులు మాట్లాడితే ఎవరు వింటారు? ఆర్జీవీ చెప్పే మాటలను వినేవాళ్లంతా పనీపాట లేని పోరంబోకులే” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
త్వరలో భయం అంటే ఏంటో తెలుస్తుంది- శివాజీ
భయం లేదని చెప్పే ఆర్జీవీకి త్వరలో భయం అంటే ఏంటో తెలుస్తుందన్నారు శివాజీ. “‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు‘ అని సినిమా తీశాడు. కమ్మోళ్లను ఏం పీకాడు? వైసీపీ ఫండింగ్ తో ఆయన ఛానెల్స్ నడుపుతున్నాడు. వాటి వ్యూవర్ షిప్ కోసం పవన్ కల్యాణ్ ను తిడుతున్నాడు. భయం లేదని మాట్లాడ్డం చాలా ఈజీ. కానీ, ప్రకృతి భయాన్ని కూడా చూపిస్తుంది. అబద్దాలు చెప్తూ, వాటిని నిజం అని భ్రమలో ఉండి, జనాలు కూడా తాము చెప్పింది నమ్ముతారనే ఆలోచనలో ఉన్నాడు. మాట మీద నిలబడను. నిజం చెప్పను. నాకు నచ్చింది చెప్తాను అని ఆయనే చెప్పాడు. అమ్మాయి కాళ్లు నాకితే తప్పేంటి అన్నాడు. యూనివర్సిటీకి వెళ్లి విద్యార్థులను ఎవరితో పడితే వాళ్లతో వెళ్లి ఎంజాయ్ చేయాలని చెప్పారు. అలాంటి వాడి గురించి ఏం మాట్లాడాలి. వీళ్లంతా కలిసి డబ్బు కోసం రాష్ట్రాన్ని బలి చేస్తున్నారు. అదే నా బాధ. జీవితం అంటే క్లారిటీ లేని ఆర్జీవీకీ త్వరలో క్లారిటీ వస్తుంది” అని తేల్చి చెప్పారు.