Bigg Boss 8 Telugu Live Updates: 'బిగ్ బాస్ 8'లో 14 మంది కంటెస్టెంట్లు వచ్చేశారు... చివరిలో ట్విస్ట్ ఇచ్చారుగా, అనిల్ రావిపూడి ఏం చేశారంటే?
Bigg Boss 8 Telugu Contestants List: 'బిగ్ బాస్ 8' మరికొన్ని గంటల్లో మొదలు కానుంది. ఈసారి ఇంటిలో అడుగు పెట్టేది ఎవరు? థీమ్ ఎలా ఉండబోతుందనే విషయాలు అందరి కంటే ముందుగా ఏబీపీదేశం లైవ్ పేజీలో తెలుసుకోండి.
LIVE

Background
కంటెస్టెంట్ల చేతిలోనే ప్రైజ్ మనీ
ప్రైజ్ మనీని చూపించే సమయం ఆసన్నమైందని చెప్పిన బిగ్ బాస్... కేవలం సున్నా మాత్రమే చూపించారు. అయితే... అది ఎప్పటికీ సున్నాలా ఉంటుందని అనుకోవద్దని చెప్పారు. లిమిట్ లెస్ ప్రైజ్ మనీ ఉంటుందని చెప్పారు. మనస్ఫూర్తిగా ఆడమని కంటెస్టెంట్లకు 'బిగ్ బాస్' చెప్పారు.
కంటెస్టెంట్లకు 'బిగ్ బాస్' చేసిన ప్రామిస్ ఏమిటంటే?
హౌస్‌లో అడుగు పెట్టిన కంటెస్టెంట్లకు 'బిగ్ బాస్' ఓ ప్రామిస్ చేశారు. అది ఏమిటంటే... ఈ సీజన్ ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విధంగా ఉండబోతుందని చెప్పారు. ఊహించని మలుపులు, లిమిట్ లెస్ సర్‌ప్రైజ్‌లు ఉంటాయని వివరించారు. లాంచింగ్ డే చూసినది కేవలం ట్రైలర్ మాత్రమేనని అన్నారు. ఫుల్ సినిమా మున్ముందు వారాల్లో, అదీ ఇంటర్వెల్ లేకుండా చూస్తారని ట్విస్ట్ ఇచ్చారు.
ఎలిమినేషన్... నాగమణికి ఐదు ఓట్లు వేసిన ఐదుగురు
అనిల్ రావిపూడి ప్రతి 'బిగ్ బాస్' సీజన్‌లో కొన్ని వరాలు గడిచిన తర్వాత వచ్చి ఒకరిని ఎలిమినేట్ చేసేవారు. కానీ, ఈసారి మొదటి రోజు వచ్చారు. అప్పటి వరకు జరిగిన టాస్కుల్లో ఓడిపోయిన నలుగురిని నిలబెట్టారు. అందులో ఒకరిని బయటకు పంపాలని, ఆయా నలుగురిలో ఒకరిని బయటకు పంపమని అడిగితే... ఎవరికి ఓటు వేస్తారని అడిగారు. అప్పుడు నాగమణికి ఐదు ఓట్లు వేశారు. ఆయన్ను బయటకు తీసుకు వెళ్లి కాసేపు ఆగిన తర్వాత ప్రాంక్ అని చెప్పారు అనిల్ రావిపూడి.
ఏడు జంటలుగా ఇంటిలో అడుగుపెట్టిన 14 మంది
'బిగ్ బాస్ 8'లో మొత్తం 14 మంది కంటెస్టెంట్లు అని అర్థం అయ్యింది. వాళ్లందరూ ఏడు జంటలుగా అడుగు పెట్టారు. చివరి రెండు జంటలతో టాస్క్ ఆడించడానికి దర్శకుడు అనిల్ రావిపూడి ఇంటిలో అడుగు పెట్టారు.
'బిగ్ బాస్ 8'లో వరంగల్ కుర్రాడు
నబీల్ ఆఫ్రిది... సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్! చిన్నతనం నుంచి నటన మీద ఆసక్తి ఉంది. యూట్యూబ్‌లో 'వరంగల్ డైరీస్'తో పాపులర్. ఇప్పుడీ యువకుడికి 'బిగ్ బాస్ 8'లో పార్టిసిపేట్ చేసే అవకాశం అందుకున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

