Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఎలిమినేషన్ - ఈ వారం బయటకు వెళ్లేదెవరంటే?
ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేట్ అయ్యేదెవరంటే..?
బిగ్ బాస్ సీజన్ 6(Bigg Boss 6 Telugu) ఇప్పటికే 41 ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకుంది. 21మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంటర్ అవ్వగా.. ఇప్పటివరకు ఐదుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ వారం ఎలిమినేషన్ కోసం తొమ్మిది మంది సభ్యులు నామినేట్ అయ్యారు. వారెవరంటే.. బాలాదిత్య, గీతూ, రాజ్, కీర్తి, సుదీప, ఆదిరెడ్డి, ఇనయా, శ్రీహాన్, అర్జున్. వీరిలో బయటకు ఎవరు వెళ్లబోతున్నారనే విషయంపై ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
అందుతున్న సమాచారం ప్రకారం.. సుదీప(Sudeepa) ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందట. ఈసారి ఆదిరెడ్డి, శ్రీహాన్ లకు ఓట్లు బాగానే వచ్చినట్లు తెలుస్తోంది. గీతూ, ఇనయాలు కూడా సేఫ్ జోన్ లోనే ఉన్నారు. రాజ్, బాలాదిత్యలకు కూడా ఓ మోస్తరు ఓట్లు పడుతున్నాయి. అర్జున్, కీర్తి, సుదీపలకు తక్కువ ఓట్లు నమోదైనట్లు తెలుస్తోంది. కీర్తితో పోలిస్తే అర్జున్, సుదీపలకు తక్కువ ఓట్లు పడ్డాయట.
వీరిద్దరిలో సుదీప ఎలిమినేట్ అవ్వడం ఖాయమనిపిస్తుంది. ఎందుకంటే అర్జున్ కి శ్రీసత్యతో ఓ ట్రాక్ నడిపిస్తున్నారు బిగ్ బాస్. ఇప్పట్లో అతడిని ఎలిమినేట్ ఛాన్స్ లేదు. మిగిలినవారితో పోలిస్తే సుదీప గేమ్ లో కాస్త వెనుకబడింది. ఎక్కువ సమయం కిచెన్ లో ఉంటుంది కానీ బయటకొచ్చి ఆడడం లేదు. నాగార్జున గత రెండు వారాలు క్లాస్ పీకడంతో తన గేమ్ ఇంప్రూవ్ చేసుకుంది. కానీ బిగ్ బాస్ కావాల్సినంత మసాలా ఆమె ఇవ్వలేకపోతుంది.
కాబట్టి ఈసారి ఆమె ఎలిమినేషన్ పక్కా అని తెలుస్తోంది. హౌస్ లోకి ఎంటర్ అయ్యేప్పుడు.. అందరూ తనను పింకీగానే గుర్తుపడతారని.. సుదీపగా బిగ్ బాస్ హౌస్ లో పేరు తెచ్చుకుంటానని చెప్పింది. కానీ ఆమె అనుకున్నట్లుగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. హౌస్ లో రేవంత్ కి ఆమెకి మధ్య చిన్న చిన్న గొడవలు కూడా ఈ ఎలిమినేషన్ కి కారణమైనట్లు సమాచారం.
Also read: ఆర్జే సూర్య, ఆరోహిలది స్నేహమే, ఇనయానే అతని వెంటపడుతోంది - గర్ల్ ఫ్రెండ్ బుజ్జిమా అభిప్రాయం
View this post on Instagram