News
News
X

Bigg Boss 6 Telugu: ఇనయాకి క్లాస్ పీకిన శ్రీహాన్ - ఆదిరెడ్డికి బిగ్ బాస్ సర్‌ప్రైజ్‌!

ఈరోజు ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ముందుగా బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి 'యమహా కాల్ ఆఫ్ ది బ్లూ' అనే టాస్క్ ఇచ్చారు.

FOLLOW US: 
 
ఈ వారం కెప్టెన్సీ కంటెండర్లుగా అయ్యేందుకు రేవంత్, సూర్య, శ్రీహాన్, కీర్తి, ఫైమా పోటీ పడ్డారు. వీరికి చిక్కుముళ్లు గేమ్ ఇచ్చారు. ఇందులో త్వరగా చిక్కుముళ్లు విప్పిన కీర్తి, సూర్య, శ్రీహాన్ కెప్టెన్సీ కంటెండర్లుగా మారారు. వారిమెడలో ఆంగ్ల అక్షరం 'సి' అనే మెత్తటి ట్యాగ్ ను వేశారు. ఇంటి సభ్యులు తాము ఎవరైతే కెప్టెన్ కాకూడదు అనుకుంటున్నారో వారు సి అక్షరంపై కత్తితో గుచ్చాలని చెప్పారు బిగ్ బాస్. అందరి కన్నా తక్కువగా శ్రీహాన్‌కు కత్తిపోట్లు వచ్చాయి. ఇనయా శ్రీహాన్‌కు కత్తి గుచ్చింది. దీంతో శ్రీహాన్ చాలా బాధపడిపోయాడు. 

అందరికంటే తక్కువ కత్తి పోట్లు శ్రీహాన్ కి రావడంతో అతడు ఈ వారం కెప్టెన్ అయ్యాడు. ఆ విషయాన్ని ఈరోజు ఎపిసోడ్ లో ప్రకటించనున్నారు. ఇదిలా ఉండగా.. ఈరోజు ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ముందుగా బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి 'యమహా కాల్ ఆఫ్ ది బ్లూ' అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో కీర్తి, రోహిత్, రేవంత్, శ్రీసత్య పాల్గొన్నారు. టాస్క్ లో భాగంగా కొన్ని ఫిజికల్ యాక్టివిటీస్ చేశారు.  

ఈ టాస్క్ కి సంచాలక్ గా వ్యవహరించిన ఇనయా.. విన్నర్ గా రోహిత్ పేరు చెప్పింది. దానికి కోప్పడిన రేవంత్ పక్కకు వెళ్లిపోయాడు. దీంతో ఇనయా.. అతడిని పిలిచే ప్రయత్నం చేయగా.. 'నా మైండ్ బాలేదు నేను రాను' అని సీరియస్ గా చెప్పేశాడు. ఆ తరువాత బిగ్ బాస్ ఈ వారం వరస్ట్ కంటెస్టెంట్ ఎవరో చెప్పాలని హౌస్ మేట్స్ ని అడిగారు. ముందుగా శ్రీహాన్.. బాలాదిత్యకి ఎర్రరంగు పూసి 'టాస్క్ బాగా ఆడారు. కానీ ఇంకొకరి కోసం కూడా ఆడినట్లు కన్వే చేశారు' అని అన్నాడు. 

దానికి బాలాదిత్య 'ఒక గేమర్ గా కంటే ఒక మనిషిగా ఆమెకి సపోర్ట్ చేశాను. నా పని నేను చేశాను' అంటూ వివరణ ఇచ్చారు. ఇక హౌస్ లో రైస్ వేస్ట్ అవుతుందని అందరూ కూర్చొని డిస్కషన్ పెట్టారు. ముందుగా రేవంత్ మాట్లాడాడు. ఆ తరువాత శ్రీహాన్ మాట్లాడుతూ.. 'కొందరికి రైస్ ఎక్కువైందని వదిలేస్తున్నారు' అని అనగానే వెంటనే ఇనయా.. 'నేను ఎక్కువైందని వదల్లేవు.. కర్రీ రాక వదిలేశాను' అని చెప్పింది. 

News Reels

ఇనయాపై శ్రీహాన్ ఫైర్: 

ఆ తరువాత తను చేసింది తప్పు కాదని.. అందరికీ క్లారిటీ ఇస్తున్నానని చెప్పగా.. 'నేను మాట్లాడే టైంలో కాదు.. నీ టైం వచ్చినప్పుడు నువ్ క్లారిటీ ఇవ్వు' అంటూ శ్రీహాన్ సీరియస్ అయ్యాడు. 'కర్రీ వేయలేదు.. అందుకే తినలేదు' అంటూ ఇనయా అంటుండగా.. 'రైస్ కి నువ్ ఇచ్చే వేల్యూ అదేనా..? రైస్ పడేయడం వంటివి జరిగితే నేను అసలు ఊరుకోను' అంటూ వార్నింగ్ ఇచ్చారు శ్రీహాన్. 

ఆదిరెడ్డికి సర్‌ప్రైజ్‌:

హౌస్ మేట్స్ అందరూ లివింగ్ ఏరియాలో కూర్చొని ఉండగా.. బిగ్ బాస్ టీవీలో ఆదిరెడ్డి ఫ్యామిలీ కనిపించింది. ఆదిరెడ్డి భార్య, కూతురు, అతడి చెల్లెలు కనిపించారు. ఆదిరెడ్డి కూతురు మొదటి పుట్టినరోజు కావడంతో బిగ్ బాస్ టీమ్ చిన్న వీడియోను షూట్ చేసి ఆదిరెడ్డికి చూపించింది. కూతురిని చూసి మురిసిపోయిన ఆదిరెడ్డి బిగ్ బాస్ కి థాంక్స్ చెబుతూ.. మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉందంటూ కూతురికి బర్త్ డే విషెస్ చెప్పారు.  

Also Read: బాలయ్య వర్సెస్ చిరు - అల్టిమేటం జారీ చేసిన డిస్ట్రిబ్యూటర్లు?

Published at : 28 Oct 2022 05:02 PM (IST) Tags: Adireddy Srihaan Bigg Boss 6 Telugu Bigg Boss 6 Inaya

సంబంధిత కథనాలు

Rakul Preet Singh: 2022లో బిగ్గెస్ట్ ఫ్లాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, ఆమె వెంటే కృతి సనన్!

Rakul Preet Singh: 2022లో బిగ్గెస్ట్ ఫ్లాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, ఆమె వెంటే కృతి సనన్!

Disaster Telugu Movies 2022: ఈ ఏడాది టాప్ 10 డిజాస్టర్ తెలుగు సినిమాలేంటో తెలుసా?

Disaster Telugu Movies 2022: ఈ ఏడాది టాప్ 10 డిజాస్టర్ తెలుగు సినిమాలేంటో తెలుసా?

Priyanak Jain- Amardeep: షూటింగ్ సెట్‌లో అమర్ దీప్, ప్రియాంక జైన్ మధ్య పెద్ద గొడవ - షాకైన ‘జానకి కలగనలేదు’ టీమ్

Priyanak Jain- Amardeep: షూటింగ్ సెట్‌లో అమర్ దీప్, ప్రియాంక జైన్ మధ్య పెద్ద గొడవ - షాకైన ‘జానకి కలగనలేదు’ టీమ్

NTR For SDT: సాయి ధరమ్ తేజ్ కోసం ఎన్టీఆర్ - పవర్‌ఫుల్ వాయిస్ అందిస్తున్న తారక్!

NTR For SDT: సాయి ధరమ్ తేజ్ కోసం ఎన్టీఆర్ - పవర్‌ఫుల్ వాయిస్ అందిస్తున్న తారక్!

Bigg Boss 6 Telugu: ఇంట్లో అతనే అన్‌డిజర్వ్ అంటున్న శ్రీహాన్, కాదు అతనే విన్నర్ మెటీరియల్ అంటున్న ప్రేక్షకులు

Bigg Boss 6 Telugu: ఇంట్లో అతనే అన్‌డిజర్వ్ అంటున్న శ్రీహాన్, కాదు అతనే విన్నర్ మెటీరియల్ అంటున్న ప్రేక్షకులు

టాప్ స్టోరీస్

Bansilalpet Stepwell : పర్యాటక హంగులతో బన్సీలాల్ పేట్ మెట్ల బావి, ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Bansilalpet Stepwell : పర్యాటక హంగులతో బన్సీలాల్ పేట్ మెట్ల బావి, ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Mlas Bribery Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, బీఎల్ సంతోష్ జగ్గూ స్వామికి హైకోర్టులో ఊరట!

Mlas Bribery Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, బీఎల్ సంతోష్ జగ్గూ స్వామికి హైకోర్టులో ఊరట!

Ex MP Harsha Kumar : వైసీపీ గూటికి మాజీ ఎంపీ హర్షకుమార్‌!, ఎంపీ టికెట్ ఇచ్చే యోచనలో అధిష్ఠానం?

Ex MP Harsha Kumar : వైసీపీ గూటికి మాజీ ఎంపీ హర్షకుమార్‌!, ఎంపీ టికెట్ ఇచ్చే యోచనలో అధిష్ఠానం?

ENG Vs PAK: పాకిస్తాన్‌పై 74 పరుగులతో ఇంగ్లండ్ ఘనవిజయం - టీ20 తరహాలో సాగిన బ్రిటిషర్ల బ్యాటింగ్!

ENG Vs PAK: పాకిస్తాన్‌పై 74 పరుగులతో ఇంగ్లండ్ ఘనవిజయం  - టీ20 తరహాలో సాగిన బ్రిటిషర్ల బ్యాటింగ్!