అన్వేషించండి

Bigg Boss 6 Telugu: బాలాదిత్యకు నాగార్జున పంచ్, ఆ ఇద్దరినీ నేరుగా నామినేట్ చేసిన హోస్ట్ - శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

బిగ్ బాస్ సీజన్ 6 సెప్టెంబర్ 24 శనివారం నాటి ఎపిసోడ్ కి సంబంధించిన హైలైట్స్ మీకోసం..

వీకెండ్ వచ్చేసింది. హోస్ట్ నాగార్జున స్టైలిష్ గా రెడీ అయి బిగ్ బాస్ వేదిక మీదకి వచ్చేశారు. శుక్రవారం నాడు హౌస్ లో ఏం జరిగిందో ఆడియన్స్ కి చూపించారు. ఆ తరువాత హౌస్ మేట్స్ తో మాట్లాడారు. గతవారం సోఫా వెనుక నుంచున్న తొమ్మిది మందిలో ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. మిగిలిన ఏడుగురుని మళ్లీ వెనక్కి వెళ్లి నుంచోమని చెప్పారు. 

బాలాదిత్యకు నాగార్జున పంచ్: 
వారిలో శ్రీసత్య, శ్రీహాన్ బాగా ఆడారని సోఫాలో కూర్చోమని చెప్పారు. వారి కోసం చప్పట్లు కూడా కొట్టరా? అని అడిగారు. దానికి బాలాదిత్య 'వెనక్కి ఉండిపోయామన్న షాక్‌లో కొట్టలేదు' అన్నాడు. దానికి నాగార్జున 'నువ్వు ఆడిన తీరు చూసి మేము కూడా షాకయ్యాం' అన్నారు. గేమ్ లో బాలాదిత్య ఆడడం లేదని ఒక వీడియో వేసి చూపించారు నాగార్జున. దానికి బాలాదిత్య తన వెర్షన్ వినిపించారు. గేమ్ లో చాలా మంది ఫిజికల్ అయ్యారని.. తను ఆడింది కరెక్ట్ అని చెప్పుకున్నాడు. దానికి ఆడియన్స్ అంగీకరించలేదు. మళ్లీ బాలాదిత్య మాట్లాడే ప్రయత్నం చేయగా.. నాగార్జున ఆపేశారు. వాసంతిని ఉద్దేశిస్తూ.. 'నువ్ చక్కగా రెడీ అవుతున్నావ్, అలానే గేమ్ కూడా ఆడు' అని సజెషన్ ఇచ్చారు నాగార్జున. 
 
శ్రీహాన్ పై నాగ్ ప్రశంసలు: 
రోహిత్-మెరీనా గేమ్ లో మరింత ఇంప్రూవ్ అవ్వాలని చెప్పారు నాగ్. కీర్తి చిన్న చిన్న విషయాలకు కూడా ఏడుస్తుందని.. అలా చేయొద్దని నాగార్జున చెప్పారు. గేమ్ ఇంప్రూవ్ చేసుకుంటే అసలు ఏడవాల్సిన అవసరం కూడా లేదని అన్నారు. సుదీపను కూడా గేమ్ బాగా ఆడాలని చెప్పారు. శ్రీసత్య గేమ్ తీరుని పొగిడారు నాగార్జున. దొంగల టీమ్ లో, కెప్టెన్సీ టాస్క్ లో చాలా బాగా ఆడావ్ అంటూ శ్రీహాన్ పై ప్రశంసలు కురిపించారు. 
 
ఇనయా 'పిట్ట' గొడవ: 
అదే సమయంలో అతడు ఇనయాను 'పిట్ట' అని అనడంపై నాగార్జున క్లాస్ పీకారు. శ్రీహాన్, ఇనయాల మధ్య గొడవ జరుగుతుంటే మధ్యలో గీతూ రావడంపై నాగార్జున ప్రశ్నించారు. దాన్ని గీతూ కామెడీ చేసేసింది. నాగార్జున మాత్రం గీతూకి నోటి దురద అని తేల్చేశారు. రేవంత్, ఇనయాల మధ్య గొడవ గురించి మాట్లాడారు నాగార్జున. ఇనయా 'వాడు' అని పిలవడం రేవంత్ కి కోపమొచ్చి 'లాగిపెట్టి కొడతా' అన్నట్లుగా మాట్లాడాడు. ఇంకెప్పుడు అలా ప్రవర్తించొద్దని రేవంత్ కి, క్లోజ్ నెస్ లేనప్పుడు ఇష్టమొచ్చినట్లుగా పిలవొద్దని ఇనయాకి చెప్పారు. 
 
సారీ చెప్పిన నేహా:
అర్జున్ కళ్యాణ్ ని కాసేపు శ్రీసత్య పేరుతో ఏడిపించారు నాగార్జున. ఇనయా.. తన చెంప పగలగొట్టిందని నేహా అందరికీ చెప్పడాన్ని నాగార్జున తప్పుబట్టారు. నిజానికి గేమ్ లో నేహా మొహంపై ఇనయా రాసుకుంటూ వెళ్లిందని.. దాన్ని కొట్టడం అనరని నాగార్జున చెప్పారు. వీడియో కూడా వేసి చూపించారు. దీంతో నేహా సారీ చెప్పింది. ఫైమా గేమ్ బాగా ఆడుతుందని.. ఆమెకి తొమ్మిది మార్కులు ఇచ్చారు నాగార్జున. సూర్య కూడా గేమ్ బాగా ఆడుతున్నారని చెప్పారు నాగ్. చంటి, రాజ్ సరిగ్గా ఆడడం లేదని సోఫా వెనక్కి వెళ్లి నుంచోమన్నారు. గీతూ, ఆదిరెడ్డిలకు గేమ్ లో పదికి పది మార్కులు ఇచ్చారు నాగార్జున. 
 
ఇనయా గేమ్ పరంగా బాగా ఆడుతుందని.. కానీ మాట తీరు సరిగ్గా లేదని అన్నారు. ఆ తరువాత ఆరోహి, సూర్యలకు సంబంధించిన ఒక ఫొటోని స్క్రీన్ పై చూపించారు నాగార్జున. అది రొమాంటిక్ గా ఉండడంతో హౌస్ మేట్స్ అందరూ వారిద్దరి ఆడుకున్నారు. 
 
నేరుగా నామినేట్ అయిన కీర్తి, అర్జున్: 
సోఫా వెనుక ఉన్న ఎనిమిది మంది ఆటతీరు ఇంప్రూవ్ అవ్వడం కోసం బిగ్ బాస్ నాగార్జునకు ఒక స్పెషల్ పవర్ ఇచ్చారు. హోస్ట్ నేరుగా ఇద్దరిని నామినేట్ చేయొచ్చు. ఈ ఎనిమిది మందిలో చంటికి ఒక ఓటు, రాజ్ కి  నాలుగు ఓట్లు, అర్జున్ కళ్యాణ్ కి ఐదు ఓట్లు, బాలాదిత్యకి మూడు ఓట్లు, వసంతికి రెండు ఓట్లు, మెరీనా రోహిత్ లకు ఒక ఓటు, సుదీపకి మూడు ఓట్లు, కీర్తికి ఐదు ఓట్లు వచ్చాయి. దీంతో అందరికంటే ఎక్కువ ఓట్లు వచ్చిన.. అర్జున్ కళ్యాణ్, కీర్తిలను నేరుగా నామినేట్ చేశారు నాగార్జున. 
 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులుమాజీ ప్రధానికేనా.. నా తండ్రికి ఇవ్వరా? కాంగ్రెస్ తీరుపై ప్రణబ్ కుమార్తె ఆగ్రహంNasa Parker Solar Probe Signal | సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లిన సేఫ్ గా ఉన్న పార్కర్ ప్రోబ్ | ABP DesamPushpa 2 Bollywood Collections | బాలీవుడ్ ను షేక్ చేయటం ఆపని బన్నీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
Nitish Records Alert: ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
Jio Airtel Best Plans: కాలింగ్, ఎస్ఎంఎస్‌తో పాటు ఓటీటీ యాప్స్ కూడా - జియో, ఎయిర్‌టెల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
కాలింగ్, ఎస్ఎంఎస్‌తో పాటు ఓటీటీ యాప్స్ కూడా - జియో, ఎయిర్‌టెల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
Bengaluru: మీరెక్కిన క్యాబ్ డ్రైవర్ నిద్రమత్తులో ఉంటే ఏం చేస్తారు? - ఈయన చేసింది మాత్రం వైరల్ అయింది !
మీరెక్కిన క్యాబ్ డ్రైవర్ నిద్రమత్తులో ఉంటే ఏం చేస్తారు? - ఈయన చేసింది మాత్రం వైరల్ అయింది !
Embed widget