Bigg Boss 6 Telugu: వాష్ ఏరియాలో సూర్యను హగ్ చేసుకుని ఏడ్చేసిన ఇనయా, గీతూపై రేవంత్ చిటపట!
బిగ్ బాస్ ఇంట్లో కెప్టెన్సీ టాస్క్ మొదలైపోయింది. ఈ వారం కెప్టెన్ అయ్యేందుకు ఇంటి సభ్యులు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.
కెప్టెన్సీ టాస్క్ మంచి హీట్ మీద సాగుతోంది. చేపల టాస్క్ లో గీతూ చేసిన పనికి రేవంత్ తో పాటు హౌస్ మేట్స్ చాలా కోపంగా ఉన్నారు. దీనికి సంబంధించిన ప్రోమోని వదిలారు. అందులో రేవంత్ గీతూ, ఆది రెడ్డి మీద ఫైర్ అయ్యాడు. ఇప్పటికే రేవంత్ గీతూ కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఈ కెప్టెన్సీ టాస్క్ దానికి మరింత ఆజ్యం పోసినట్టయ్యింది.
తాజా ప్రోమో ప్రకారం బిగ్ బాస్ కెప్టెన్సీ ఆట కోసం చిక్కుముడి బాగానే వేశారు. గీతూ, ఆది రెడ్డి వెల్డన్ అని రేవంత్ వెటకారంగా అన్నాడు. తనలో ఇక లావా పొంగుతుందని కానీ పైకి మాత్రం తపస్సు చేస్తున్న మునిలాగా ఉంటున్నానని తన బాధని రేవంత్ శ్రీ సత్య, శ్రీహాన్ దగ్గర చెప్పుకున్నాడు. ప్రతిసారి ఏదైనా చేసే ముందు నీట్‌గా వెన్న రాసుకుని చేస్తుంటే.. అసలు నీ రియల్ క్యారెక్టర్ ఏంటని శ్రీ సత్య గీతూని మొహం మీదే అడిగేసింది. ఇంట్లో అందరూ కూడా చేపల టాస్క్ లో గీతూ చేసిన పని గురించే మాట్లాడుకుంటూ కనిపించారు.
ముందు అందరినీ రెచ్చగొట్టి, గేమ్ అయిపోయిన తర్వాత ఏడ్చేస్తుందని రాజ్ తదితరులు మాట్లాడుకున్నారు. అనంతరం ‘బిగ్ బాస్’ కెప్టెన్సీ కోసం పోటీ పడే వాళ్ళకు ఒక టాస్క్ ఇచ్చాడు. ఒక తాడు నడుముకు కట్టుకుని చిక్కుల నుంచి విడిపించుకోవాలని చెప్పాడు. అందులో భాగంగా అడుతుంటే రేవంత్ కి నడుము పట్టేసినట్టుగా చూపించారు.
ఆ పోటీలో సూర్య, రేవంత్, శ్రీహాన్, ఫైమా, కీర్తి కనిపించారు. చివరిగా ఇనయా బాత్రూమ్ దగ్గర సూర్యని గట్టిగా కౌగలించుకుని వెక్కి వెక్కి ఏడవటం చూపించారు. నామినేషన్స్ టైమ్ ఇనయా.. సూర్య గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడింది. అందరికీ సోప్ వేస్తూ సేఫ్ గేమ్ ఆడుతున్నాడని అనేసింది. ఆ మాటకి సూర్య చాలా ఫీల్ అయ్యాడు కూడా. మరి ఇప్పుడు ఇనయా మళ్ళీ సూర్య చెంతకి చేరి అలా ఎక్కిళ్ళు పెట్టె విధంగా ఎందుకు ఏడ్చిందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారం అయ్యేంత వరకు ఆగాల్సిందే.
బుధవారం నాటి ఎపిసోడ్లో గీతూ - ఆదిరెడ్డి జంట కెప్టెన్సీ కంటెండర్ల టాస్కులో మొదటిరోజే తొలగిపోయారు. దీంతో రెండో రోజు వారిద్దరినీ సంచాలక్‌గా నియమించారు బిగ్ బాస్. చేపల వర్షం కురుస్తుంటే ఇంటి సభ్యులతో పాటూ తాను ఏరుకోవడం మొదలుపెట్టింది. ఆదిరెడ్డి దీనికి అభ్యంతరం చెప్పాడు. ‘నా ఇష్టం నేను ఏరుకుంటా సామి’ అని చెప్పింది గీతూ. అలా సంచాలక్ చేపలు పట్టడాన్ని రేవంత్ గట్టిగా నిలదీశాడు. తనతో వాదిస్తే డిస్ క్వాలిఫై చేస్తా అంటూ వాదించింది గీతూ. రేవంత్ మైక్‌తో పాటూ పూల్ లో దిగడంతో అతనికి జరిమానా విధించి పది చేపలు తీసుకుంది. అలాగే బుట్టలో చేపలు ఒకరికి ఒకరు ఆటగాళ్లు లాక్కుంటున్నప్పుడు తాను కూడా వెళ్లి లాక్కోవడం మొదలుపెట్టింది. దీంతో ఆదిరెడ్డి మళ్లీ అభ్యంతరం చెప్పాడు. బాలాదిత్య కూడా అడిగాడు. అయినా గీతూలో మార్పు లేదు. ‘నేను ఆడిస్తున్నా’ అంటూ సమాధానం చెప్పింది. రేవంత్ - గీతూల మధ్య మాటల యుద్ధమే ఈ ఎపిసోడ్ లో హైలైట్ అయింది.
Also read: ఆ చిన్న నల్ల చేప రేవంత్ కొంపముంచిందిగా, మరోసారి వారిద్దరినీ టార్గెట్ చేసిన గీతూ