అన్వేషించండి
Advertisement
Bigg Boss 6 Telugu: కెప్టెన్ గా ఫైమా - మొత్తానికి సాధించింది!
కెప్టెన్సీ కంటెండర్లుగా కీర్తి, ఫైమా, శ్రీసత్య, రోహిత్, ఆదిరెడ్డి, మెరీనా నిలిచినట్టు తెలుస్తోంది.
బిగ్ బాస్ ఇంట్లో కెప్టెన్సీ టాస్క్ మొదలైపోయింది. ఇప్పటి వరకు కూడా ఆట మీద ఎక్కువ ఫోకస్ పెట్టని వాళ్ళు కూడా ఈసారి తమ సత్తా ఎంతో నిరూపించుకుంటున్నారు. ఈ వారం కెప్టెన్ అయ్యేందుకు ఇంటి సభ్యులు తమవంతుగా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. కెప్టెన్సీ కి పోటీదారులు బిగ్ బాస్ వస్తా.. నీ వెనుక అనే టాస్క్ ఇచ్చారు.
కెప్టెన్సీ కంటెండర్లుగా కీర్తి, ఫైమా, శ్రీసత్య, రోహిత్, ఆదిరెడ్డి, మెరీనా నిలిచినట్టు తెలుస్తోంది. వారికి ఇచ్చిన టాస్ ప్రకారం మూడు భాగాలుగా ఉన్న సర్కిల్ లో తిరుగుతూ తమ భుజాల మీద ఉన్న పేపర్ బాల్స్ బస్తాలని పట్టుకుని కాపాడుకోవాలి. ఒకదాని తర్వాత ఒక సర్కిల్ లో తిరుగుతూ తమ బ్యాగ్స్ ని కాపాడుకోవాలి. ఇప్పటికే ఈ ఆటకు సంబంధించిన ఒక ప్రోమో విడుదలైంది.
ఇందులో ఫస్ట్ రౌండ్ లో మెరీనా, కీర్తి అవుట్ అయిపోయినట్లు తెలుస్తోంది. తర్వాత రింగ్ లో రోహిత్, ఆదిరెడ్డి, ఫైమా, శ్రీసత్య పోటీపడ్డారు. వీరిలో ఫైమా కెప్టెన్ అయిందని సమాచారం. ఈరోజు ఎపిసోడ్ లో అదే చూపించబోతున్నారు. నిజానికి ఫైమా, రోహిత్ ల మధ్య గొడవ జరిగింది. మధ్యలో రాజ్ ఇన్వాల్వ్ అవ్వడంతో విషయం సీరియస్ అయింది. ఫైమాను టాస్క్ నుంచి అవుట్ చేయడానికి ఆదిరెడ్డి, రోహిత్ చాలా స్ట్రగుల్ అయ్యారు.
ఆ తరువాత ఆదిరెడ్డి, రోహిత్ లు ఒకరిని తోసుకొని మరొకరు ఆడారు. ఫైనల్ గా శ్రీసత్య, ఫైమాలు గేమ్ లో మిగిలారని.. వారిలో ఫైమా విన్ అయిందని తెలుస్తోంది. హౌస్ లోకి వచ్చి తొమ్మిది వారాలు పూర్తవుతున్నా.. ఇప్పటివరకు ఫైమాకి కెప్టెన్ అయ్యే అవకాశం రాలేదు. ప్రతిసారి ఆమె కెప్టెన్సీ కంటెండర్ గా పోటీ చేస్తోంది కానీ ఓడిపోతుంది. మొత్తానికి పదో వారంలో ఆమెని కెప్టెన్ గా చూడబోతున్నారు జనాలు. మరి హౌస్ ని ఫైమా ఎలా రూల్ చేస్తుందో చూడాలి!
Also Read : 'లైగర్' గాయాలు - ఎనిమిది నెలల తర్వాత
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
అమరావతి
హైదరాబాద్
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement