Bigg Boss 6 Telugu: ‘బిగ్ బాస్’ సీజన్-6 కంటెస్టెంట్లు వీళ్లేనట, వాళ్లకు సెకండ్ ఛాన్స్?
‘బిగ్ బాస్’ సీజన్ 6లో పాల్గొనే కంటెస్టెంట్ల జాబితా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాళ్లెవరో చూసేయండి మరి.
బుల్లితెరపై అతి పెద్ద రియాలిటీ షోగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ‘బిగ్ బాస్’. ఇప్పటికే 5 సీజన్లు పూర్తి చేసుకుని 6వ సీజన్లోకి అడుగుపెడుతోంది. ఈ లేటెస్ట్ సీజన్ సెప్టెంబర్ 4 నుంచి ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంతో పోల్చితే మరింత కొత్తగా జనాల ముందుకు రాబోతున్నట్లు హోస్ట్ అక్కినేని నాగార్జున వెల్లడించారు. గతంతో పోల్చితే కొత్త సీజన్‌లో టాస్కులు, నామినేషన్లు, ఎలిమినేషన్లు సరికొత్తగా ఉంటాయట.
‘బిగ్ బాస్’ అంటేనే కంటెస్టెంట్ల మధ్య గొడవలు, అరుపులు, దోస్తీ, జబర్దస్తీ.. ఇవన్నీ కామన్. చెప్పాలంటే.. ఈ షోలో అన్ని షేడ్స్ చూడొచ్చు. కానీ, ప్రేక్షకులు ఎక్కువగా వివాదాలకే కనెక్ట్ అవుతున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్-6లో పాల్గొనే కంటెస్టెంట్లు ఫైనల్ అయ్యారట. వారందరినీ త్వరలో క్వారంటైన్ లో ఉంచబోతున్నారట. అన్నపూర్ణ స్టూడియోలోనే వీరి కోసం క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అదిరిపోయే లుక్ తో బిగ్ బాస్ సెట్ రెడీ అయ్యిందట. సెప్టెంబర్ 4 సాయంత్రం రోజున కంటెస్టెంట్లను బిగ్ బాస్ హౌస్ లోకి పంపనున్నారు. అంతకు ముందు వారం నుంచి వీరిని క్వారంటైన్ లో ఉంచుతారట. ప్రస్తుతం కరోనా ప్రభావం అంతగా లేకున్నా.. రిస్క్ తీసుకోవడం ఎందుకని నిర్వాహకులు భావిస్తున్నారట.
ఇక ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి మొత్తం 16 మంది కంటెస్టెంట్లను పంపుతున్నారని తెలిసింది. తాజాగా వారికి సంబంధించిన పేర్లు సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతున్నాయి. బిగ్ బాస్ నిర్వాహకులు మాత్రం హౌస్ లోకి వెళ్లబోయే కంటెస్టెంట్ల వివరాలను గోప్యంగానే ఉంచారు. అయినా సోషల్ మీడియాలో బిగ్ బాస్ సీజన్-6 కంటెస్టెంట్లు వీళ్లేనంటూ ఓ లిస్టును ప్రచారం చేస్తున్నారు. మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. ఇదివరకు ప్రసారమైన ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’లో పాల్గొన్న కంటెస్టెంట్లకు ఈ షోలో మరోసారి అవకాశం ఇస్తున్నారని తెలిసింది. అజయ్ కుమార్, ఆర్జీ చైతు, అనిల్, మిత్ర శర్మ తదితరులు మళ్లీ ఈ షోలో కనిపించే అవకాశం ఉంది. ఒకప్పటి లవర్ బాయ్ తరుణ్ సైతం ఈ షోలో పాల్గొంటారని వదంతుల వ్యాపించినా.. తాజాగా జాబితాలో మాత్రం ఆయన పేరు కనిపించలేదు. తాజాగా మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న జాబితాలో ఎవరెవరు ఉన్నారో చూడండి.
1. ఉదయ భాను
2. అమర్ దీప్ చౌదరి
3. శ్రీహన్
4. దీపికా పిల్లి
5. నేహా చౌదరి
6. ఆది రెడ్డి
7. ఆర్జే సూర్య
8. నిఖిల్ విజేంద్ర
9. చలాకీ చంటీ
10. ఇనయా సుల్తానా
11. శ్రీ సత్య
12. పాండు మాస్టర్
13. అనిల్ రాథోడ్
14. అజయ్ కుమార్
15. మిత్రా శర్మ
16. ఆర్జే చైతు
(వీరితోపాటు మరికొందరు సామాన్యులకు ఈ సారి బిగ్ బాస్‌లో పాల్గొనే అవకాశం దక్కనుంది. ఇప్పటికే వారి సెలక్షన్ పూర్తయినట్లు సమాచారం.)
Also Read: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ
Also Read: అయ్యో రాధిక, నువ్వు లేని ‘డీజే టిల్లు’నా? సీక్వెల్‌లో ఆమె కనిపించదా?