Bigg Boss 6 Telugu: సూర్యతో రేవంత్ వాదన - ఈ వారం కెప్టెన్ అతడేనా?
తాజా ప్రోమో ప్రకారం.. కెప్టెన్సీ కోసం పోటీ పడుతున్న వాళ్ళు ఇతర పోటీదారుల పూల కుండీలు తీసుకుని పరిగెట్టాలి.
బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈసారి ఇంటి సభ్యులందరికీ కెప్టెన్సీ టాస్క్ లో పోటీ పడే అవకాశం ఇచ్చారు. మొదట టాస్క్ లో గెలిచిన శ్రీసత్య, రేవంత్, వాసంతి, ఆదిరెడ్డి, సూర్య, రాజ్, అర్జున్, రోహిత్ కెప్టెన్సీ కంటెండర్లు గా మారారు. ఇప్పుడు వాళ్ళకి మరో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఆఖరి వరకు ఆగని పరుగు పేరుతో టాస్క్ ఇచ్చాడు. ఇందులో గెలిచి ఇంటికి తాము కెప్టెన్ ఎందుకు అవాలనుకుంటున్నారో చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి ప్రోమో వదిలారు.
తాజా ప్రోమో ప్రకారం.. కెప్టెన్సీ కోసం పోటీ పడుతున్న వాళ్ళు ఇతర పోటీదారుల పూల కుండీలు తీసుకుని పరిగెట్టాలి. పరుగులో వెనకబడితే ఆ కంటెస్టెంట్‌తోపాటు పూల కుండీపై ఎవరి పేరు ఉంటుందో వారు కూడా వెనకబడినట్లే. అంటే, ఆ ఇద్దరు బయట ఉండి.. తాము ఎందుకు కెప్టెన్సీకి అర్హులనే విషయాన్ని చెప్పాలి. లేటెస్ట్ ప్రోమోలో ముందుగా వాసంతి.. హౌస్ మేట్స్ గేమ్ లో తనను కార్నర్ చేస్తున్నారంటూ బాధపడింది. మెరీనాతో ఈ విషయం గురించి డిస్కషన్ పెట్టింది.
ఆ తరువాత గేమ్ ఆడుతున్న సమయంలో సూర్య ఒకటికంటే ఎక్కువ కుండీలు తీసుకురావడంతో అది తప్పని వాదించాడు రేవంత్. దానికి సూర్య ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య వాదన జరిగినట్లు తెలుస్తోంది. శ్రీసత్య, రేవంత్ ల మధ్య పోటీ రాగా.. హౌస్ మేట్స్ ఇద్దరిలో ఒకరిని ఎన్నుకోవాల్సి వస్తుంది. ఆ తరువాత సూర్య, రోహిత్ ల మధ్య పోటీ రాగా.. మెరీనా తన ఓటు సూర్యకి వేసింది. దీంతో రోహిత్ షాక్ అయ్యాడు.
ఆ తరువాత శ్రీసత్య, గీతూ, బాలాదిత్యల మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది. ఇక ఈరోజు కెప్టెన్సీ టాస్క్ లో సూర్య గెలిచినట్లు సమాచారం. ఈ వారం అతడే కెప్టెన్ అని అంటున్నారు. దానిపై ఈరోజు ఎపిసోడ్ లో క్లారిటీ రానుంది.
కెప్టెన్సీ కంటెండర్ల టాస్కు
కెప్టెన్సీ కంటెండర్లుగా అయ్యే అవకాశం అందరికీ ఇచ్చారు బిగ్ బాస్. ఎమినిమి బంతులు పెట్టి వాటిని ఎవరైతే తమ బాస్కెట్లో మొదట వేస్తారో.. ఆ ఎనిమిది మంది కెప్టెన్సీ కంటెండర్లుగా మారుతారని చెప్పారు బిగ్ బాస్. బంతులు కోసం చాలా ఫైట్ చేసుకున్నారు. ముందుగా రేవంత్, ఆదిరెడ్డి, శ్రీ సత్య, రాజేశేఖర్ బంతులు దక్కించుకుని తమ పేరున్న బాస్కెట్లో పెట్టారు. సూర్యకు, అర్జున్, వాసంతికి కూడా బంతులు దొరికాయి. గీతూ అయితే ఫైట్ చేయకుండా అందరి దగ్గరికి వెళ్లి బంతి ఇచ్చేయమని అడగడం మొదలుపెట్టింది. చివరికి సుదీప బంతిని దక్కించుకుని రోహిత్ బాస్కెట్లో వేసింది. దీంతో శ్రీసత్య, రేవంత్, వాసంతి, ఆదిరెడ్డి, సూర్య, రాజ్, అర్జున్, రోహిత్ కెప్టెన్సీ కంటెండర్లుగా మారారు.
Also Read : 'క్రేజీ ఫెలో' రివ్యూ : ఆది సాయి కుమార్ సినిమా క్రేజీగా ఉందా? బోర్ కొట్టించిందా?
View this post on Instagram