Bigg Boss 5 Telugu: ఇసుకతో, డబ్బాలతో ఆడుకున్న బిగ్ బాస్ ఇంటి సభ్యులు..
బిగ్ బాస్ ఇంట్లో ఈ రోజు కెప్టెన్సీ టాస్క్, రేషన్ మేనేజర్ టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులు పోటీపడ్డారు..విజేతలుగా ఎవరు నిలిచారంటే
38 వ రోజు షో ఆరంభంతోనే 'బిగ్ బాస్ బొమ్మల ఫ్యాక్టరీ ' కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ముగిసిందని ప్రకటించిన బిగ్ బాస్... ఏ టీం దగ్గర ఎన్ని బొమ్మలు ఉన్నాయో చెప్పాలన్నారు. సంచాలకులుగా ఉన్న సిరి, కాజల్ బొమ్మలు ఫైనల్ చేసే ప్రాసెస్ లో...కాజల్ తో ఇంటి సభ్యులు వాగ్వాదానికి దిగారు. ముందే ఫైనల్ చేసిన బొమ్మలు కొన్ని డ్యామేజ్ పేరుతో ఇప్పుడు రిజెక్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. శ్వేత, ప్రియ, లోబో ఇది సరికాదంటూ కాజల్ పై ఫైరయ్యారు. అయితే ఆల్రెడీ ఓకే చేసిన బొమ్మలు మీరు కాపాడుకోలేనందుకు రిజెక్ట్ చేశానని కాజల్ చెప్పింది. మరో సంచాలక్ సిరి కూడా ఒప్పుకోనని చెప్పినప్పటికీ కాజల్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఫైనల్ లా గ్రీన్ టీం-24, రెడ్ టీం-17, ఎల్లో టీం-14, బ్లూ టీం-17 బొమ్మలు ఫైనలయ్యాయని సంచాలకులు బిగ్ బాస్ కు చెప్పారు. అయితే ప్రియ, శ్రీరామ్, విశ్వ టీంకి లభించిన స్పెషల్ పవర్ ఉపయోగించి ఓ టీం లో ఫైనల్ అయిన సగం బొమ్మల్ని రెజెక్ట్ చేయవచ్చు. ఈమేరకు ఎల్లో టీం అయిన షణ్ముక్ టీం బొమ్మల్లో సగం రిజెక్ట్ చేసిన బిన్ లో పడేశారు. టాస్క్ సమయంలో బిగ్ బాస్ ఇంటి నియమాలను ఉల్లంఘించి ప్రాపర్టీకి నష్టం కలిగించారంటూ లోబో, శ్వేత, రవి టీం సభ్యులతో పాటూ సంచాలకులైన సిరి, కాజల్ ని కెప్టన్సీ టాస్క్ కి అనర్హులుగా ప్రకటించారు.
Also Read: సినీ ఇండస్ట్రీ అంటే నలుగురు పెద్దవాళ్లు కాదు..వేల మంది కార్మికులు ! చల్లగా చూడాలని ప్రభుత్వాలకు నిర్మాతల విజ్ఞప్తి !
39 వ రోజు 'జల్సా' లో 'ఛలోరే ఛలొరే ఛల్' సాంగ్ తో ఇంటి సభ్యులు నిద్రలేచారు. కెప్టెన్సీ టాస్క్ లో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ మిస్సైన వాళ్లు బాధపడ్డారు. మరోవైపు ప్రియాంక సింగ్ తనకు కెప్టెన్ అయ్యే ఛాన్సిమ్మని ఇంటి సభ్యులు కొందరితో మాట్లాడింది. జెస్సీ.. టాస్క్ నువ్వు సరిగ్గా అడమని చెప్పగా...నువ్వు నీకోసం కాకుండా మానస్ కోసం ఆడుతున్నావని కాజల్ అంది. విశ్వ స్వార్థంగా ఆలోచిస్తాడని ప్రియ కామెంట్ చేసింది. హౌస్ లో ఎంట్రీ ఇచ్చినప్పుడు తనతో పాటూ తీసుకొచ్చిన బొమ్మని సన్నీ బయటకు తీసి కాసేపు ఎంటర్టైన్ చేశాడు.
ఈ వారం కెప్టెన్సీ టాస్క్- 'ఇసుకతో ఆట ఈజీ కాదు బేటా'
17 బొమ్మలతో రెడ్ టీం, బ్లూ టీం సభ్యులు కెప్టెన్సీ కోసం పోటీ పడతారని ప్రకటించారు బిగ్ బాస్. ప్రతి పోటీదారులు వారి కంటైనర్లో ఎక్కువ ఇసుక ఉండేలా చూసుకోవాలి. వారి బ్యాగుల్లో ఇసుక నింపుకుని ముందున్న అడ్డంకులు దాటుకుని వారి వారి కంటైనర్లలో ఇసుక నింపాల్సి ఉంటుంది. ఎండ్ బజర్ మోగే సరికి ఎవరి కంటైనర్లో ఎక్కువ ఇసుక ఉంటే వాళ్లే ఈ వారం ఇంటి కెప్టెన్ అవుతారని ..ఈ టాస్క్ కి సంచాలక్ గా జస్వంత్ ఉంటాడని ప్రకటించారు బిగ్ బాస్. ప్రియ, యానీ, విశ్వ, మానస్, సన్నీ, శ్రీరామ్ పోటీ పడగా ఈ టాస్క్ లో 'విశ్వ' విజేతగా నిలిచాడు. ఇంటి కెప్టెన్ అయిన విశ్వకు ప్రియ కెప్టెన్సీ బ్యాండ్ పెట్టారు. తన కారణంగా ఇంటి కెప్టెన్ అయ్యే ఛాన్స్ మిస్సైన వారికి రవి సారీ చెప్పాడు.
రేషన్ మేనేజర్ టాస్క్- డబ్బాల ధమాకా
ఈ వారం రేషన్ మానేజర్ అయ్యే అర్హత సంపాదించుకునేందుకు బిగ్ బాస్ మరో టాస్క్ ఇచ్చారు. విడివిడిగా ఉన్న డబ్బాలను ఎండ్ బజర్ మోగే సరికి ఎవరు ఎక్కువ సెట్ చేస్తే వాళ్లు రేషన్ మేనేజర్ అని చెప్పారు. ఈ టాస్క్ లో సన్నీ, మానస్, ప్రియాంక సింగ్ పోటీపడ్డారు. ఈ టాస్క్ మొత్తం సరదాగా గడిచింది. కెప్టెన్ అంటే కాలేను కనీసం రేషన్ మేనేజర్ కూడా కాలేనా అంటూ సన్నీ నవ్వించాడు. ఫైనల్ గా ఈ టాస్కులో 11 డబ్బాలు సెట్ చేసి ప్రియాంక సింగ్ రేషన్ మేనేజర్ అయింది.
Also Read: ‘శ్యామ్ సింగరాయ్’ఇంట్రడక్షన్ వీడియో, రెండు పాత్రల్లో నాని అదుర్స్..
Also Read: 'అంత ఇష్టం ఏందయ్యా' పవన్ ని ఓరగా చూస్తోన్న నిత్యామీనన్
Also Read:దండుపాళ్యం' గ్యాంగ్ తో 'తగ్గేదే లే'..వరుస మర్డర్స్, నో ఎవిడెన్స్
Also Read: పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా డార్లింగ్ …ఖాకీ డ్రెస్ లో ప్రభాస్ కటౌట్ చూస్తే..
Also Read: శరన్నవరాత్రుల్లో చివరి మూడు రోజులు ఎందుకంత ప్రత్యేకం, దశమి రోజు ఈ శ్లోకం రాసి జమ్మిచెట్టుకి కడితే…
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి