News
News
వీడియోలు ఆటలు
X

Bigg Boss 5 Telugu: ‘బిగ్ బాస్’ గ్రాండ్ ఫినాలే: అతడిని చూసి నా కంటే పిచ్చోడని అనుకున్నా.. రాజమౌళి

‘బిగ్ బాస్ 5’ గ్రాండ్ ఫినాలేలో రాజమౌళి, అలియా భట్‌లు సందడి చేశారు.

FOLLOW US: 
Share:

‘బిగ్ బాస్’ సీజన్-5 గ్రాండ్ ఫినాలేలో RRR, బ్రహ్మాస్త్ర టీమ్ సందడి చేశారు. దర్శకుడు రాజమౌళి, హీరోయిన్ అలియాభట్, ఆమె బాయ్ ఫ్రెండ్, బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్, ‘బ్రహ్మస్త్ర’ దర్శకుడు అయన్ వేదిక మీదకు వచ్చారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. ఇద్దరు హీరోల అభిమానులను కలపాలనే ఉద్దేశం చేసిన ప్రయత్నమే ‘ఆర్ఆర్ఆర్’ అని అన్నారు. అయితే, ‘ఆర్ఆర్ఆర్’ ద్వారా యావత్ ప్రపంచంలోని ప్రేక్షకులందరినీ ఒక్కటి చేశారని నాగార్జున ప్రశంసలతో ముంచెత్తారు. ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో తాను కూడా నటించానని, ఈ చిత్రాన్ని రాజమౌళి సమర్పిస్తున్నారని నాగ్ తెలిపారు. అనంతరం ‘బ్రహ్మాస్త్ర’ హీరో రణ్‌బీర్‌తోపాటు, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని హీరోయిన్ అలియా భట్‌ను పరిచయం చేశారు. 

‘బ్రహ్మాస్త్ర’ సినిమా గురించి మాట్లాడుతూ.. కరణ్ జోహార్‌ ఈ చిత్రంలో తనను భాగస్వామి కావాలని కోరారని, ఈ సందర్భంగా దర్శకుడు అయన్‌ను నా వద్దకు పంచించారని తెలిపారు. అతడు స్టోరీ చెప్పిన విధానం చూసి.. అతడు నాకంటే పిచ్చోడిలా కనిపించాడని పేర్కొన్నారు. ఈ చిత్రం తప్పకుండా ఆకట్టుకుంటుందని రాజమౌళి అన్నారు. అలియా భట్ హౌస్ సభ్యులను పలకరిస్తూ.. సన్నీకి ఐలవ్ యూ చెప్పింది. దీంతో.. సన్నీ కిందపడ్డాదు. ఆ తర్వాత శ్రీరామ్‌ను చూసి.. అతడు హిందీలో పాడిన పాటను పాడి ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత శ్రీరామ్‌తో ఆ పాటను పాడించుకున్నారు. శ్రీరామ్ వాయిస్‌కు రాజమౌళి కూడా ఫిదా అయ్యారు. ఈ సందర్భంగా బ్రహ్మాస్త్రం మోషన్‌ పోస్టర్‌ ప్లే చేశారు. అనంతరం రణ్‌బీర్ స్పందిస్తూ.. ‘‘మీ కన్నా పెద్ద కింగ్‌ ఎవరూ లేరు’’ అంటూ నాగార్జునపై పొగడ్తల వర్షం కురిపించాడు. అనంతరం ఒకప్పుడు టాలీవుడ్‌కు చెందిన ఎన్టీఆర్, అక్కినేని ఫ్యామిలీతో తన కుటుంబానికి ఉన్న బంధాన్ని తెలియజేస్తూ.. అప్పటి ఫొటోలను ప్రదర్శించారు. 

బ్రహ్మాస్త్రం..: హౌస్ మేట్స్ తో బ్రహ్మాస్త్రం అనే గేమ్ ఆడించారు. ఇందులో టాప్ 5 కంటెస్టెంట్స్ తమలో ఉండే పవర్ గురించి చెప్పాలని.. ఎవరిదైతే బాగా నచ్చుతుందో వాళ్లకి 'బ్రహ్మాస్త్రం' ఇస్తామని చెప్పారు. ఎంతో కష్టపడి ఈ స్టేజ్ కి వచ్చానని.. అదే తన పవర్ అని చెప్పాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా.. కామ్ గా ఉంటూ డెసిషన్ తీసుకోవడం తన పవర్ అని చెప్పాడు మానస్. ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. ఇండిపెండెంట్ గా ఉంటూ లక్ష్యాన్ని చేరుకోవడం తన పవర్ అని చెప్పాడు శ్రీరామ్. పేషెన్స్ అండ్ కాన్ఫిడెన్స్ తన పవర్ అని చెప్పాడు షణ్ముఖ్. స్మైల్ అండ్ కాన్ఫిడెన్స్ తన పవర్ అని చెప్పింది సిరి. మానస్ చెప్పిన ఆన్సర్ తనకు నచ్చిందని రాజమౌళి చెప్పడంతో.. అతడికి 'బ్రహ్మాస్త్రం' ఇచ్చారు.

స్టేజ్ పై పరంపరం టీమ్..: స్టేజ్ పైకి 'పరంపర' వెబ్ సిరీస్ టీమ్ మెంబర్స్ జగపతిబాబు, నవీన్ చంద్రని ఇన్వైట్ చేశారు నాగార్జున. ఈ సిరీస్ లో తను మంచివాడిగా నటించానని అన్నారు. జగపతిబాబు లాంటి నటుడితో కలిసి పని చేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పారు నవీన్ చంద్ర. డిసెంబర్ 24న ఈ సిరీస్ హాట్ స్టార్ లో విడుదల కానుంది. 

Also Read: ‘బిగ్ బాస్’కే దిమ్మతిరిగేలా అతడికి ఓట్లు.. రన్నరే డౌట్! ఆఖరి రోజు మారిన సమీకరణాలు

Also Read: ‘షన్ను.. ఐ లవ్ యూ’.. మనసులో మాట చెప్పేసిన సిరి.. ముద్దులు హగ్గులతో సహన పరీక్ష!

Also Read: సిరి ఓట్లకు గండి కొట్టిన ‘బిగ్ బాస్’.. ఆమె ఎలిమినేషన్‌తో షన్ను ‘లెక్క’ మారుతుందా?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Published at : 19 Dec 2021 07:47 PM (IST) Tags: RRR alia bhatt Bigg Boss 5 Telugu బిగ్ బాస్ 5 తెలుగు రాజమౌళి Ranbir Kapoor ఆర్ఆర్ఆర్ Rajamouli in Bigg Boss 5 finale

సంబంధిత కథనాలు

Boyapati RAPO Movie : శ్రీ లీలతో కలిసి మైసూర్ వెళ్ళిన రామ్ పోతినేని - అసలు మ్యాటర్ ఏంటంటే?

Boyapati RAPO Movie : శ్రీ లీలతో కలిసి మైసూర్ వెళ్ళిన రామ్ పోతినేని - అసలు మ్యాటర్ ఏంటంటే?

Gruhalakshmi June 6th: రాజ్యలక్ష్మి ప్లాన్ సక్సెస్, దివ్యని అసహ్యించుకున్న విక్రమ్- రంగంలోకి లాస్య మాజీ మొగుడు

Gruhalakshmi June 6th: రాజ్యలక్ష్మి ప్లాన్ సక్సెస్, దివ్యని అసహ్యించుకున్న విక్రమ్- రంగంలోకి లాస్య మాజీ మొగుడు

Bro Special Song Cost : ఏంటిది పవన్ 'బ్రో' - ఊర్వశి స్పెషల్ సాంగ్‌కు అంత ఖర్చా?

Bro Special Song Cost : ఏంటిది పవన్ 'బ్రో' - ఊర్వశి స్పెషల్ సాంగ్‌కు అంత ఖర్చా?

RRR Re-Release Trailer: ‘RRR’ మరో ఘనత, గోల్డెన్ ట్రైలర్ అవార్డుకు రీ-రిలీజ్ ట్రైలర్ నామినేట్!

RRR Re-Release Trailer: ‘RRR’ మరో ఘనత,  గోల్డెన్ ట్రైలర్ అవార్డుకు రీ-రిలీజ్ ట్రైలర్ నామినేట్!

Krishna Mukunda Murari June 6th: కొడుకు, కోడలు విడిపోకుండా అదిరిపోయే ప్లాన్ వేసిన రేవతి- ముకుందకి ఫ్యూజులు ఎగిరిపోయే షాక్

Krishna Mukunda Murari June 6th: కొడుకు, కోడలు విడిపోకుండా అదిరిపోయే ప్లాన్ వేసిన రేవతి- ముకుందకి ఫ్యూజులు ఎగిరిపోయే షాక్

టాప్ స్టోరీస్

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షల్లో స్మార్ట్ కాపీయింగ్- స్నేహితుల కోసం చీట్ చేసి చిక్కిన టాపర్‌

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షల్లో స్మార్ట్ కాపీయింగ్- స్నేహితుల కోసం చీట్ చేసి చిక్కిన టాపర్‌

RBI: కొత్త వడ్డీ రేట్లపై నేటి నుంచి ఆర్‌బీఐ సమీక్ష, రెపో రేట్‌ ఎంత పెరగొచ్చు?

RBI: కొత్త వడ్డీ రేట్లపై నేటి నుంచి ఆర్‌బీఐ సమీక్ష, రెపో రేట్‌ ఎంత పెరగొచ్చు?

WTC Final 2023 Live Streaming: డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌ ఫ్రీ లైవ్‌స్ట్రీమింగ్‌ ఎందులో? టైమింగ్‌, వెన్యూ ఏంటి?

WTC Final 2023 Live Streaming: డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌ ఫ్రీ లైవ్‌స్ట్రీమింగ్‌ ఎందులో? టైమింగ్‌, వెన్యూ ఏంటి?

Adani Group: అప్పు తీర్చిన అదానీ, షేర్‌ ప్రైస్‌లో స్మార్ట్‌ రియాక్షన్‌

Adani Group: అప్పు తీర్చిన అదానీ, షేర్‌ ప్రైస్‌లో స్మార్ట్‌ రియాక్షన్‌