అన్వేషించండి

Bigg Boss 5 Captain: ఈ వారం ‘బిగ్ బాస్’ కెప్టెన్ అతడే.. ప్రోమోలో ఇది గమనించారా?

బిగ్ బాస్ హౌస్‌లో ఈ వారం కెప్టెన్ ఎవరో తెలిసిపోయింది. ఈ రోజు విడుదలైన ప్రోమోలోనే ఈ విషయం లీకైంది.

‘బిగ్ బాస్’లో ఈ వారం హౌస్‌లో కెప్టెన్ స్థానం కోసం పోటీ మొదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కెప్టెన్సీ పోటీదారులుగా రవి, జెస్సి, శ్వేతావర్మ, శ్రీరామచంద్ర ఎంపికైనట్లు గురువారం విడుదల చేసిన మొదటి ప్రోమోలో చూపించారు. ఈ నలుగురు స్విమ్మింగ్ పూల్ నుంచి కెప్టెన్ అనే ఇంగ్లీష్ లెటర్స్‌ని తీసుకుని పేర్చే విధంగా ‘స్విమ్ జర స్విమ్’ టాస్క్‌లో పాల్గొన్నారు. 

అయితే, మధ్యాహ్నం విడుదల చేసిన రెండో ప్రోమోలో మాత్రం.. కెప్టెన్ ఎవరనేది లీకైపోయింది. బిగ్‌బాస్‌ను గమనించే ప్రేక్షకులు వెంటనే దాన్ని స్క్రీన్ షాట్ తీసి.. ఇదిగో ఇతడే కెప్టెన్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేయడం మొదలుపెట్టారు. ఇంతకీ కెప్టెన్ ఎవరయ్యరో మీకు తెలుసుకోవాలని ఉందా? మరెవ్వరో కాదు.. జెస్సీ. ఫస్ట్ లవ్ గురించి బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులో జస్సీ బెలూన్ పట్టుకున్నప్పుడు, సోఫాలో లోబో, సిరిలతో కూర్చున్నప్పుడు జెస్సీ కుడి చేతికి కెప్టెన్సీ బాండ్ కనిపించింది. దీంతో అంతా జస్సీ కెప్టెన్ అయ్యాడని డిసైడ్ అయిపోయారు. ప్రోమో ఎడిట్ చేసినవారు.. ఈ చిన్న విషయాన్ని ఎలా మరిపోయారో అంటూ నెటిజనులు చలోక్తులు విసురుతున్నారు. 

పాత సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్ 5’ సీజన్ మొదటి ఎసిపోడ్ నుంచే సందడి మొదలైంది. మొదటి వారమే గొడవలు, అరుపులు ప్రారంభమైపోయాయి. తాజాగా నేటి ఎపిసోడ్‌‌కు సంబంధించి రెండో ప్రోమో విడుదలైంది. అందులో హౌస్ మేట్లు తమ తొలి ప్రేమను గుర్తు తెచ్చుకుని, వారి గుర్తుగా ఒక ఎర్రటి బెలూన్ పైకొదలాలి. ఆ బెలూన్ పై వారి పేర్లు కూడా రాయాలి. ప్రోమోను బట్టి చూస్తే తొలి ప్రేమ అందరిచేత కన్నీళ్లు పెట్టించింది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by chusara_sirrr_eedi_memesu (@chusara_sirrr_eedi_memesu)

జీవితమనే ప్రయాణంలో ఎందరిని కలిసినా తొలి ప్రేమ ఇచ్చే మధుర అనుభవాలు, నేర్పే గుణపాఠాలు మళ్లీ మళ్లీ దక్కవు అంటూ రెండో ప్రోమోను ప్రారంభించి అందరినీ తొలిప్రేమ జ్ఞాపకాల్లో తడిసి ముద్దయ్యేలా చేశాడు బిగ్ బాస్. శ్రీరామ చంద్ర తన తొలిప్రేమ గురించి చెబుతూ ఆ అమ్మాయికి పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారని కాసేపు నవ్వించాడు. సన్నీ కూడా తన పదోతరగతి ప్రేమను గుర్తు చేసుకున్నాడు. షన్ను తన ఫస్ట్ దీపూనేనని, ఆ విషయం ఆమెకు కూడా తెలిసని అన్నాడు. షన్ను ప్రేయసి దీప్తి సునయన గతంలో బిగ్ బాస్ లో పాల్గొంది. జెస్సీ బెలూన్ పై ఒక అమ్మాయి పేరు రాసి ‘నువ్వు సింగిల్ అయితే, నేను రెడీ టు మింగిల్’ అని సిగ్నల్ ఇచ్చాడు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by jessie (@jaswanth__jessie__)

అన్నింటి కన్నా ప్రియా చెప్పిన మాటలే ప్రోమోకి హైలైట్ గా నిలిచాయి. నిజానికి ప్రియకు పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అందులో పాప గతేడాదే మరణించింది. టీనేజీ వయసున్న కొడుకు ఉన్నాడు. కాగా ప్రోమోలో మాత్రం ప్రియ ‘నేను మ్యారీడా, సెపరేటెడా, డివోర్స్ డా నాకే  తెలియదు’ అని కామెంట్ చేసింది. దీంతో ఆమె వైవాహిక జీవితం ఒడిదొడుకుల్లో ఉన్నట్టు అర్థమవుతోంది. ఆమె బెలూన్ పై ‘కేక్’అని ఇంగ్లిషులో రాసింది. అతనే తన ఫస్ట్ లవ్ అని చెప్పింది. బిగ్ బాస్ 5 సీజన్ ఆరంభ ఎపిసోడ్ లో కూడా నాగార్జునతో ప్రియ తను ఒంటరిగా బతకాల్సి వస్తే ఉండగలనా లేదా టెస్ట్ చేసుకునేందుకు బిగ్ బాస్ కు వచ్చానని చెప్పింది. దానికి నాగార్జున అలాంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటున్నట్టు అన్నారు.  ఇప్పుడు తాజా ప్రోమోలో ప్రియ మాటలు వింటే ఆమె కాపురంలో కలహాలు ఉన్నట్టు అర్థమవుతోంది. 

ప్రియాంక కూడా తన మొదటి లవ్ తలచుకుని కన్నీటి పర్యంతమైంది. ‘తన బండి వెళ్లిపోతుంటే... ఆ బండి వెనుక పరిగెత్తాను అయినా తను వినలేదు, తన పని తనే చూసుకున్నాడు’ అంటూ ఏడ్చింది. హమీద కూడా ప్రేమలో ఉన్నట్టు ఒప్పుకుంది. తమ మధ్య బ్రేకప్ అవ్వలేదని, కానీ కలిసి ఉండలేకపోతున్నామంటూ ఎమోషనల్ అయింది. మొత్తమ్మీద ఈ ప్రోమో చూస్తుంటే ఎపిసోడ్ ఎమోషనల్ గా ఉండడం ఖాయమనిపిస్తోంది.  

Also Read: ‘నాగార్జున’ అనేసి నాలుక కరుచుకున్న సమంత.. ఆ తర్వాత ‘మామ’ అంటూ ట్వీట్

Also Read: ప్రభుత్వం ఆధీనంలో సినిమా టికెట్లు.. లాభం ఎవరికీ? ఇక బెనిఫిట్ షోలు ఉండవా?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today Sep19th: మాధవ్‌ మళ్లీ ఇల్లు వదిలి వెళ్లిపోతాడేమోనని తమ్ముళ్ల కంగారు..రాత్రంతా మెలకువుగా ఉండి పెద్దికి కాపలా
పొదరిల్లు: మాధవ్‌ మళ్లీ ఇల్లు వదిలి వెళ్లిపోతాడేమోనని తమ్ముళ్ల కంగారు..రాత్రంతా మెలకువుగా ఉండి పెద్దికి కాపలా
Karthika Deepam 2 Serial Today September 19th: కార్తీకదీపం 2 సీరియల్: నడిరోడ్డు మీద నాటకం.. కూతురి ఇంట్లో దశరథ్ కుటుంబం! సూరజ్ మీద మండిపడ్డ జ్యోత్స్న!
కార్తీకదీపం 2 సీరియల్: నడిరోడ్డు మీద నాటకం.. కూతురి ఇంట్లో దశరథ్ కుటుంబం! సూరజ్ మీద మండిపడ్డ జ్యోత్స్న!
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: సీజన్‌ ఫస్ట్ లేడీ కెప్టెన్‌ ఝాన్సీ! త్రిగుణ్‌ని దారుణంగా ఆపేసిన గార్డ్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: సీజన్‌ ఫస్ట్ లేడీ కెప్టెన్‌ ఝాన్సీ! త్రిగుణ్‌ని దారుణంగా ఆపేసిన గార్డ్స్!
Jagadhatri Serial Today September 18th: బూచీపై దాడి చేసింది యువరాజేనని చెప్పిన రాగిణి...కొడుకు చెంప పగులగొట్టిన సుధాకర్‌
జగద్ధాత్రి సీరియల్: బూచీపై దాడి చేసింది యువరాజేనని చెప్పిన రాగిణి...కొడుకు చెంప పగులగొట్టిన సుధాకర్‌

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Ghee Adulteration Case: తిరుమల నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం.. సుకృతి ఫుడ్స్‌ ప్రమోటర్ అరెస్ట్
తిరుమల నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం.. సుకృతి ఫుడ్స్‌ ప్రమోటర్ అరెస్ట్
Land For Poor People: దశాబ్దాల నిరీక్షణకు తెర.. 28 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ- సీఎం చంద్రబాబు
దశాబ్దాల నిరీక్షణకు తెర.. 28 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ- సీఎం చంద్రబాబు
Sharmila Daughter Wedding: కుమార్తె పెళ్లి డేట్, వివరాలు ప్రకటించిన వైఎస్ షర్మిల.. YSRకు ఫస్ట్ కార్డ్
కుమార్తె పెళ్లి డేట్, వివరాలు ప్రకటించిన వైఎస్ షర్మిల.. నాన్న YSRకు ఫస్ట్ కార్డ్
TMC New Name And Logo: టీఎంసీ గ్రూపులకు పార్టీ పేరు, గుర్తు కేటాయించిన ఈసీ.. మమతా బెనర్జీ పార్టీ పేరు, వివరాలు
టీఎంసీ గ్రూపులకు పార్టీ పేరు, గుర్తు కేటాయించిన ఈసీ.. మమతా బెనర్జీ పార్టీ పేరు, వివరాలు
Vijayasai Reddy: ఆ 2 కుటుంబాలతో సీమకు ప్రయోజనం లేదు.. రాయలసీమ ఒరిజనల్ రెడ్ల పౌరుషం చూపిస్తాం: విజయసాయిరెడ్డి
ఆ 2 కుటుంబాలతో సీమకు ప్రయోజనం లేదు.. రాయలసీమ ఒరిజనల్ రెడ్ల పౌరుషం చూపిస్తాం: విజయసాయిరెడ్డి
Human Trafficking Case: బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
The India Story OTT : ఓటీటీలోకి సడన్‌గా కాజల్ అగర్వాల్ కొత్త మూవీ - కోర్ట్ రూమ్ డ్రామా 'ద ఇండియా స్టోరీ' ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి సడన్‌గా కాజల్ అగర్వాల్ కొత్త మూవీ - కోర్ట్ రూమ్ డ్రామా 'ద ఇండియా స్టోరీ' ఎందులో చూడొచ్చంటే?
AP Congress : ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
Embed widget