News
News
X

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్' - ఆ ఫ్యాక్టర్ ఎఫెక్ట్ చేయదు కదా?

రీసెంట్ గా విడుదలైన 'పొన్నియిన్ సెల్వన్' సినిమా టీజర్ అంచనాలు మరింత పెంచేసింది. ఈ సినిమాతో మణిరత్నం బౌన్స్ బ్యాక్ అవుతారని ఆశిస్తున్నారంతా. 

FOLLOW US: 
కోలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమా 'పొన్నియిన్ సెల్వన్'. సెప్టెంబర్ 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. ఈ సినిమా తెరకెక్కించడానికి ఆయన చాలా కష్టపడ్డారు. లైకా ప్రొడక్షన్స్ సహాయంతో తన సొంత బ్యానర్ లో ఈ సినిమాను నిర్మించారు మణిరత్నం. నిన్ననే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కూడా వచ్చింది. తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. 
 
రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా టీజర్ అంచనాలు మరింత పెంచేసింది. ఈ సినిమాతో మణిరత్నం బౌన్స్ బ్యాక్ అవుతారని ఆశిస్తున్నారంతా. అయితే ఈ సినిమా కథ తమిళ నేటివిటీకి సంబంధించినది కావడంతో మిగిలిన భాషల్లో ఎంతవరకు వర్కవుట్ అవుతుందా..? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఒకప్పుడు తమిళనాడు సహా పలు ప్రాంతాలను ఏలిన చోళ రాజుల కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 
 
తమిళ ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం అక్కడి నేటివిటీని కాస్త జోడించి సినిమాలు తీస్తుంటారు కోలీవుడ్ దర్శకులు. దీని వలన అక్కడ ప్రేక్షకులకు సినిమా రుచించినా.. వేరే రాష్ట్రాలకు చెందిన ప్రేక్షకులు కనెక్ట్ కాలేకపోతున్నారు. నేటివిటీ ఫ్యాక్టర్ అనేది శృతి మించకుండా చూసుకోవాల్సి ఉంటుంది. కొంతలో కొంతైనా.. స్థానిక ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా మార్చాల్సి ఉంటుంది. 'బాహుబలి' లాంటి సినిమా అంత పెద్ద హిట్ అయిందంటే దానికి కారణం.. అది కల్పిత కథ కాబట్టి దానికి పరిమితులు ఉండవు. దీంతో అన్ని ప్రాంతాల ప్రజలకు ఈ సినిమా కనెక్ట్ అయింది. 
 
'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రాంతీయ కథ అయినప్పటికీ.. అందరికీ రీచ్ అయ్యేలా సినిమా తీశారు రాజమౌళి. పైగా టైటిల్స్ కూడా అన్ని భాషలకు తగ్గట్లే ఉంటాయి. కానీ మణిరత్నం ఆ ప్రయత్నం చేసినట్లు లేరు. ఇతర భాషలకు కనీసం టైటిల్ మార్చలేదు. పాత్రల పేర్లను కూడా తమిళంలోనే పెట్టి క్యారెక్టర్ పోస్టర్స్ ను రిలీజ్ చేశారు. ఈ ఫ్యాక్టర్స్ ను దాటుకొని పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి!
 
View this post on Instagram
 
A post shared by Lyca Productions (@lyca_productions)

Published at : 10 Jul 2022 09:01 PM (IST) Tags: Mani Ratnam Ponniyin Selvan Ponniyin Selvan part 1

సంబంధిత కథనాలు

NBK108 Announcement : ఇంతకు ముందు ఎప్పుడూ చేయనటువంటి పాత్రలో నందమూరి బాలకృష్ణ

NBK108 Announcement : ఇంతకు ముందు ఎప్పుడూ చేయనటువంటి పాత్రలో నందమూరి బాలకృష్ణ

Kajal Aggarwal : కట్టప్పలా మారిన కాజల్ - బాహుబలి ఎవరో చూశారా రాజమౌళి గారూ?

Kajal Aggarwal : కట్టప్పలా మారిన కాజల్ - బాహుబలి ఎవరో చూశారా రాజమౌళి గారూ?

Khudiram Bose: భరత మాత ముద్దుబిడ్డ 'ఖుదీరాం బోస్' బయోపిక్, ఇదిగో టైటిల్ అనౌన్స్‌మెంట్‌

Khudiram Bose: భరత మాత ముద్దుబిడ్డ 'ఖుదీరాం బోస్' బయోపిక్, ఇదిగో టైటిల్ అనౌన్స్‌మెంట్‌

తరణ్ ఆదర్శ్ రివ్యూ: ‘లాల్ సింగ్ చడ్డా’ అలా - ‘రక్షాబంధన్’ ఇలా, బాలీవుడ్ ఊపిరి పీల్చుకుంటుందా?

తరణ్ ఆదర్శ్ రివ్యూ: ‘లాల్ సింగ్ చడ్డా’ అలా - ‘రక్షాబంధన్’ ఇలా, బాలీవుడ్ ఊపిరి పీల్చుకుంటుందా?

Laal Singh Chaddha Review - లాల్ సింగ్ చడ్డా రివ్యూ : ఆమిర్ సినిమా ఎలా ఉంది? హిందీలో నాగ చైతన్యకు గ్రాండ్ ఎంట్రీ లభిస్తుందా? లేదా?

Laal Singh Chaddha Review - లాల్ సింగ్ చడ్డా రివ్యూ : ఆమిర్ సినిమా ఎలా ఉంది? హిందీలో నాగ చైతన్యకు గ్రాండ్ ఎంట్రీ లభిస్తుందా? లేదా?

టాప్ స్టోరీస్

SC On Political Parties: ఎన్నికల్లో ‘ఫ్రీ’లు చాలా సీరియస్, డిబేట్ అవసరం - నా రిటైర్మెంట్‌లోగా రండి: CJI

SC On Political Parties: ఎన్నికల్లో ‘ఫ్రీ’లు చాలా సీరియస్, డిబేట్ అవసరం - నా రిటైర్మెంట్‌లోగా రండి: CJI

Munugode Congress : "మునుగోడు" ఎలా గెలుద్దాం ? కాంగ్రెస్ సీనియర్ల తర్జన భర్జన !

Munugode Congress :

Independence Day 2022: ఈసారి ఎర్రకోటలోని స్వాతంత్య్ర వేడుకలకు ఓ స్పెషాల్టీ ఉంది, అదేంటో తెలుసా?

Independence Day 2022: ఈసారి ఎర్రకోటలోని స్వాతంత్య్ర వేడుకలకు ఓ స్పెషాల్టీ ఉంది, అదేంటో తెలుసా?

Normon And Foster : ఏపీ ప్రభుత్వం నుంచి బిల్లులు ఇప్పించండి - సుప్రీంకోర్టులో నార్మన్ ఫోస్టర్స్ పిటిషన్ !

Normon And Foster : ఏపీ ప్రభుత్వం నుంచి బిల్లులు ఇప్పించండి - సుప్రీంకోర్టులో నార్మన్ ఫోస్టర్స్ పిటిషన్ !